సమంత ఓకే అంటే యశోద సీక్వెల్ షురూ

Clarity On Samanthas Yashoda Movie Sequel, Samanthas Yashoda Movie Sequel, Yashoda Movie Latest Collections, yashoda collections, Samantha's Yashoda, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Samantha, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Hareesh Narayan, K Hari Shankar, Yashoda, Yashoda 2022, Yashoda Movie, Yashoda Update, Yashoda Movie Update, Yashoda Movie New Update, Yashoda Movie Latest Update, Yashoda Movie Updates, Yashoda Telugu Movie, Yashoda Telugu Movie Latest News, Yashoda Telugu Movie Live Updates, Yashoda Telugu Movie New Update, Yashoda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మరోసారి స్టార్ హీరోయిన్ సమంత తన సత్తాను బాక్సాఫీస్ వద్ద చాటుకుంది. హీరోయిన్స్ లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేసినా కొంతమందికి మాత్రమే అవి కలిసొస్తాయి. అందులో సమంత ముందుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూ టర్న్, ఓ బేబి, ఇప్పుడు యశోద ఇలా వరుస విజయాలను అందుకుంటుంది. నిజానికి ఈసినిమా ప్రమోషన్స్ ను కాస్త లేట్ గా మొదలుపెట్టారు. చాలా తక్కువ టైమే ప్రమోషన్స్ కు కేటాయించారు. మరోవైపు సమంత కూడా అనారోగ్యంతో ట్రీట్ మెంట్ లో ఉంది. ఏదో రిలీజ్ కు ముందు ఒక ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చింది. కానీ రిలీజ్ కు ముందు వచ్చిన బజ్ కంటే సినిమా రిలీజ్ తరువాత ప్రేక్షకుల టాక్ తోనే ఈసినిమా సక్సెస్ అయింది అని చెప్పొచ్చు. సమంత నటనకు, దర్శకుల మేకింగ్ ఇంకా కథకు ప్రశంసలు దక్కాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా సెక్సెస్ మీట్ ను కూడా నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటి చేసిన మీట్ లో ఈసినిమా సీక్వెల్ గురించి ఆసక్తికర విషయాలు తెలియచేశారు దర్శకులు. తెలుగులో మాకు ఇది మొదటి సినిమా.. యశోద సీక్వెల్ పై మాకు ఒక ఐడియా ఉంది. సెకండ్ పార్ట్ మాత్రమే కాదు థర్డ్ పార్ట్ కు కూడా లీడ్ ఉంది.. అయితే ఇది సమంతపై ఆధారపడి ఉంటుంది.. సమంత ఫుల్ రికవరీ అయిన తరువాత తనకు సీక్వెల్ గురించి చెబుతామని.. సమంత ఓకే చెబితే వెంటనే సెట్స్​పైకి తీసుకెళతామని క్లారిటీ ఇచ్చారు. చూద్దాం మరి సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో..!

కాగా ఈసినిమాలో ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్, సంపత్ రాజు, మురళీ శర్మ, రావు రమేష్, ఉన్ని ముకుందన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాని ప్రముఖ సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించగా మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 3 =