కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 64

సినిమా వార్తలు

య‌న్టీఆర్‌ ‘బాలనాగమ్మ’కు 60 ఏళ్ళు

మహానటుడు యన్.టి.రామారావు, దిగ్గజ నటీమణి అంజలీ దేవి జంటగా పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘బాలనాగమ్మ’ ఒకటి. వేదాంతం రాఘవయ్య తెరకెక్కించిన ఈ సినిమాలో ఎస్.వి.రంగారావు, రేలంగి, లంక సత్యం, సీఎస్సార్, ఎ.వి.సుబ్బారావు, రాజసులోచన, హేమలత, సూర్యకళ, మాస్ట‌ర్ స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు ముఖ్య భూమికలు పోషించారు. 1942లో వచ్చిన ‘బాలనాగమ్మ’(సి.పుల్ల‌య్య ద‌ర్శ‌కుడు) చిత్రానికి రీమేక్‌గా 17 ఏళ్ల అనంతరం ఈ ‘బాలనాగమ్మ’రూపొందింది. ఆస‌క్తిక‌ర‌మైన అంశ‌మేమిటంటే... ఈ రెండు చిత్రాలలోనూ రేలంగి, లంక సత్యం నటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దర్శకుడు VV వినాయక్ హీరోగా మూవీ ప్రారంభం

సూపర్ హిట్ మూవీ ఆది తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమైన VV వినాయక్ దర్శకత్వంలో రూపొందిన దిల్ ,ఠాగూర్, లక్ష్మీ , నాయక్, ఖైదీ నెం 150 మూవీస్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు దర్శకుడు VV వినాయక్ హీరోగా మారారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నరసింహా దర్శకత్వంలో వినాయక్ హీరో గా సీనయ్య మూవీ వినాయక్ బర్త్ డే సందర్భంగా ఈ రోజుప్రారంభమయింది. 8 వ తేదీ విజయదశమి రోజున టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నంద‌మూరి కళ్యాణ్ రామ్ న‌ట‌నాప్ర‌స్థానానికి ప‌ద‌హారేళ్ళు

వైవిధ్యభరితమైన క‌థాంశాల‌కు పెద్ద‌పీట వేసే కథానాయకుల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. అలాంటి క‌ళ్యాణ్ రామ్‌ న‌ట‌నాప్ర‌స్థానానికి బీజం వేసిన చిత్రం ‘తొలిచూపులోనే...’. తన తాత, మహానటుడు యన్.టి.రామారావు నటించిన ‘జస్టిస్ చౌదరి’ చిత్రంలోని “నీ తొలిచూపులోనే” అనే పాటలోని తొలి ప‌దాన్ని టైటిల్‌గా ఎంచుకుని... కథానాయకుడిగా తొలి అడుగులు వేసాడు ఈ నంద‌మూరి హ్యాండ్స‌మ్ హీరో.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శ్రీ‌దేవి న‌ట విశ్వ‌రూపం ‘క్షణక్షణం’కు 28 ఏళ్ళు

కొన్ని సినిమాలు చూడడానికే కాదు... వాటి గురించి మాట్లాడుకోవడానికి కూడా భలే సరదాగా ఉంటాయి. అటువంటి చిత్రాలలో ‘క్షణక్షణం’ ఒకటి. ‘శివ’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రమిది. థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ మూవీలో ఓ వైపు ఉత్కంఠ‌కు గురిచేస్తూనే... మరోవైపు నటీనటుల హావభావాలతో, వారి వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో కడుపుబ్బా నవ్వించాడు దర్శకుడు. ఇక ఈ సినిమా పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది “సత్య” పాత్ర. ఈ పాత్రలో నటించిన శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. తనకు మాత్రమే సాధ్యమయ్యేలా... ఓ వైపు అమాయకత్వాన్ని, మరోవైపు భయాన్ని అభినయించి నటిగా తన నట…

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

ఎంత మంచివాడవురా! టీజర్ రిలీజ్

శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణ లో ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ , మెహరీన్ జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎంత మంచివాడవురా!మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. తనికెళ్ళ భరణి, విజయ్ కుమార్, నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . ఈ మూవీ కి గోపిసుందర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Pratiroju Pandaage Movie Interesting Update
సినిమా వార్తలు

‘ప్రతి రోజూ పండగే’... ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు

మెగా హీరో సాయితేజ్, యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. తేజ్ కి జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. కుటుంబ బంధాల నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో స‌త్య‌రాజ్, రావుర‌మేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వరుణ్ కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారు?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కనున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్స‌ర్‌గా దర్శనమివ్వనున్నాడు. అంతేకాదు... ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు ఈ మ్యాచో స్టార్‌. తాజాగా ప్రీ-ప్రొడక్షన్ ప‌నులు పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ఎంటర్‌టైనర్... ఈ నెల 10న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని సమాచారం. అయితే, రెగ్యులర్ షూటింగ్ మాత్రం 2020 ఆరంభంలో మొదలవుతుందని టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాజ్ త‌రుణ్‌

యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న యువ కథానాయకుల్లో రాజ్ తరుణ్ ఒకరు. కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ హ్యాట్రిక్ హీరో... ప్రస్తుతం ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆచి తూచి అడుగులు వేస్తున్న రాజ్... ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటి టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘ఇద్దరి లోకం ఒకటే’ కాగా... మరొకటి ‘గుండెజారి గ‌ల్లంత‌య్యిందే’ ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఈ రెండు సినిమాలు సెట్స్‌పై ఉండ‌గానే... ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్నల్…

Team TFNవాట్సాప్
Miss India Finalist In Akhil New Movie
సినిమా వార్తలు

అఖిల్ సినిమాలో మాజీ మిస్ ఇండియా ఫైన‌లిస్ట్‌?

యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో... అఖిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ట్టు సమాచారం. అంద‌మైన ప్రేమ‌క‌థ‌తో పాటు కుటుంబ బంధాల‌కు పెద్ద పీట వేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రంలో స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Team TFNవాట్సాప్
Rowdy Vijay Deverakonda To Pair Up With Priya Prakash Varrier
సినిమా వార్తలు

ఫైటర్'తో ప్రియా ప్రకాష్ వారియర్?

ప్రియా ప్రకాష్ వారియర్... ఒక్క‌ కన్నుగీటుతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కేరళ కుట్టి. మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’(తెలుగులో ‘లవర్స్ డే’)తో హీరోయిన్‌గా పరిచయమైన ఈ వింక్ బ్యూటీ... ప్ర‌స్తుతం యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో రానున్న సినిమాతో తెలుగునాట కథానాయిక(సెకండ్ హీరోయిన్)గా తొలి అడుగులు వేస్తోంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే... ఇప్పుడు మరో తెలుగు చిత్రంలో నాయికగా ఎంపికైనట్టు తెలుస్తోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

య‌న్టీఆర్ న‌ట విశ్వ‌రూపం ‘కొండవీటి సింహం’కు 38 ఏళ్ళు

మహానటుడు యన్.టి.రామారావు, అతిలోకసుందరి శ్రీదేవి జంటగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించారు. వాటిలో ‘కొండవీటి సింహం’ ఒక‌టి. యన్టీఆర్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన‌ ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ముఖ్యంగా ఎస్.పి.రంజిత్‌కుమార్‌గా యన్టీఆర్ నట విశ్వరూపాన్ని ప్ర‌ద‌ర్శించారు. య‌న్టీఆర్‌కు జోడీగా శ్రీదేవి, జయంతి నటించగా... మోహన్‌బాబు, సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, నగేష్, కాంతారావు, ముక్కామల, చలపతిరావు, గీత, పుష్పలత, “మాస్టర్” హరీష్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. తమిళ చిత్రం ‘తంగ పతాకం’కు రీమేక్‌గా ‘కొండవీటి సింహం’ను రూపొందించారు దర్శకేంద్రుడు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

హైద‌రాబాద్‌లో ‘96’ రీమేక్

తమిళనాట ఘన విజయం సాధించిన '96' తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ను సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. తమిళ వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్‌కుమార్ తెలుగు వెర్ష‌న్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘ఆర్ ఆర్ ఆర్’ టైటిల్ అబ్రివేష‌న్స్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క‌థానాయ‌కులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. పేట్రియాటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కొమరం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నారు. ఇదిలా ఉంటే... `ఆర్ ఆర్ ఆర్‌` టైటిల్ కి సంబంధించి అబ్రివేష‌న్ స‌జెష‌న్స్‌ పంప‌మ‌ని ఇప్ప‌టికే జ‌క్క‌న్న ఓ ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న‌కి స్పంద‌నగా వంద‌లాది అబ్రివేష‌న్ స‌జెష‌న్స్ వ‌చ్చాయ‌ట‌. అయితే, వీటిలో రెండు అబ్రివేష‌న్స్‌ని మేక‌ర్స్‌ ఫిక్స్ చేశార‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వెంకటేష్ ‘జయం మనదేరా!’కు 19 ఏళ్ళు

‘విక్టరీ’ వెంకటేష్ క‌థానాయ‌కుడిగా త‌న హోమ్ బేన‌ర్‌ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘జయం మనదేరా!’ ఒకటి. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వెంకటేష్ డ్యూయల్ రోల్స్‌లో దర్శనమిచ్చారు. వెంకీకి జోడీగా సౌందర్య, భానుప్రియ నటించగా... జయప్రకాష్‌ రెడ్డి, అతుల్ కులకర్ణి, బ్రహ్మానందం, అలీ, ‘ఆహుతి’ ప్రసాద్, ఎం.ఎస్.నారాయణ, ఎల్.బి.శ్రీరామ్, ఝాన్సీ, వెన్నిరాడై నిర్మల, హేమ, ప్రియ, రమాప్రభ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్.శంకర్ దర్శకత్వం వహించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను... తమిళంలో ‘మణికంఠ‌’ పేరుతో పునర్నిర్మించారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

య‌న్‌.బి.కె 105... విడుద‌ల తేదీ ఖ‌రారు

`జై సింహా` త‌రువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, ద‌ర్శ‌కుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో... పోలీస్ ఆఫీస‌ర్‌గానూ, గ్యాంగ్‌స్ట‌ర్‌గానూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాల‌య్య‌ కనిపించనున్నట్టు సమాచారం. సోనాల్ చౌహాన్‌, వేదిక క‌థానాయికలుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Interesting Title For Nithiin New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Nithiin Upcoming Movie Title,Nithiin Next Film Title,Nithiin Latest movie Title
సినిమా వార్తలు

`చద‌రంగం` ఆడుతున్న నితిన్‌?

యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేష‌న్‌లో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ రూపొందుతున్న‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి ‘చదరంగం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. ఈ చిత్రంలో నితిన్ చెస్ ప్లేయ‌ర్ గా దర్శనమివ్వనున్నాడ‌ట. అందుకే ‘చదరంగం’ అనే టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. త్వరలోనే ఈ టైటిల్‌కు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Team TFNవాట్సాప్
26 Years For Nagarjuna Allari Alludu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Allari Alludu Movie Updates,Allari Alludu Telugu Movie Latest News,Allari Alludu Movie Completes 26 Years,Allari Allu
సినిమా వార్తలు

నాగార్జున ‘అల్లరి అల్లుడు’కు 26 ఏళ్ళు

‘కింగ్’ నాగార్జునకి కలిసొచ్చిన దర్శకుల్లో ఎ.కోదండరామిరెడ్డి ఒకరు. ఈ ఇద్దరి క‌ల‌యిక‌లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు వ‌చ్చాయి. వాటిలో ‘అల్లరి అల్లుడు’ ఒకటి. నాగార్జున సరసన నగ్మా, మీనా కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో అలనాటి మేటి నటి వాణిశ్రీ కీలక పాత్ర పోషించారు. రావుగోపాలరావు, కోట శ్రీనివాసరావు, మురళీమోహన్, చలపతిరావు, బ్రహ్మానందం, బాబూమోహన్, సంగీత తదితరులు ఇత‌ర పాత్ర‌ల్లో నటించగా... రమ్యకృష్ణ ఓ స్పెషల్ సాంగ్‌లో న‌ర్తించింది.

Team TFNవాట్సాప్
Venky Mama To Have A Highlight Song?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Venky Mama Movie Updates,Venky Mama Telugu Movie Latest News,Highlight Song In Venky Mama Movie
సాంగ్

‘వెంకీమామ’ కోసం వెంకీ, చైతూ అద‌ర‌గొట్టే స్టెప్పులు

విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. పాయ‌ల్ రాజ్‌పుత్, రాశీఖ‌న్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ హిలేరియ‌స్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌ను కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నిశ్శబ్ధం మూవీ అప్ డేట్ కై ట్వీట్స్

స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై రూపొందిన నిశ్శబ్ధం మూవీ పూర్తిగా US లో షూటింగ్ జరుపుకుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల, మైకేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలలో నటించారు. నిశ్శబ్ధం మూవీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది. తెలుగు లో నిశ్శబ్దం, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సూపర్ హిట్ మూవీ ధృవ సీక్వెల్ ధృవ 2 ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ధృవ మూవీ 2016 సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ధృవ మూవీ లో తమిళ హీరో అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా నటించడం విశేషం. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ తని ఒరువన్ కు అధికారిక తెలుగు రీమేక్ ధృవ మూవీ.

Team TFNవాట్సాప్

షేర్