
ట్యాగ్ · 1431 కథనాలు · పేజీ 56


కూలీలో మంజుమ్మల్ బాయ్స్ నటుడు

కుబేర నుండి నాగ్ పోస్టర్ రిలీజ్

వేట్టైయాన్.. డబ్బింగ్ సెషన్లో మంజు వారియర్

మత్తు వదలరా 2.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

జనక అయితే గనక ట్రైలర్లో ఇవి గమనించారా..!

ఆయనతో వర్క్ చేయాలన్న కోరిక ఈ సినిమాతో తీరింది

దేవర వరల్డ్‌వైడ్ రిలీజ్ చేస్తోంది ఎవరంటే..?

ఈ సినిమా కోసం కీరవాణి గారిని అడగాలా? వద్దా? అనుకున్నా
బ్లాక్‌బస్టర్ 'మగధీర'తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో ఆకట్టుకున్న దేవ్ గిల్ ప్రస్తుతం 'అహో! విక్రమార్క' అంటూ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి వద్ద కో డైరెక్టర్‌గా పని చేసిన పేట త్రికోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దేవ్ గిల్ ప్రొడక్షన్స్ మీద నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు త్రికోటి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..
బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకలు.. ఆహ్వానం అందుకున్న అల్లు అర్జున్
టాలీవుడ్లో ఒక స్టార్ హీరో 50 కనీవినీ ఎరుగని రీతిలో ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.

కూలీలో మంజుమ్మల్ బాయ్స్ నటుడు
గత ఏడాది జైలర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్.ఈసినిమా తరువాత రీసెంట్ గా లాల్ సలామ్ తో ప్రేక్షకులను పలకరించాడు అయితే ఇందులో హీరోగా కాదు ఓ కీలక పాత్ర చేశాడు.ఇక రజనీ హీరోగా వేట్టాయాన్ అనే సినిమాను పూర్తి చేశాడు.జై భీం ఫేమ్ టిజి జ్ఞానవేల్ తెరకెక్కిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.అక్టోబర్ 10న విడుదలకానుంది.

కుబేర నుండి నాగ్ పోస్టర్ రిలీజ్
ఈసంక్రాతికి నా సామి రంగతో వచ్చి హిట్ కొట్టాడు కింగ్ నాగార్జున.ఇక ఈసినిమా తరువాత నాగ్ సోలో హీరోగా ఇంతవరకు మరో సినిమాకు కమిట్ కాలేదు కానీ ప్రస్తుతం కుబేరలో కీలక పాత్ర చేస్తున్నాడు.ఇంతకుముందు ఈసినిమా నుండి వచ్చిన నాగ్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఇక ఈరోజు నాగార్జున బర్త్ డే సందర్భంగా తన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈపోస్టర్ లో నాగార్జున చాలా కూల్ గా కనిపించాడు.

ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ - ఓం రౌత్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఇతిహాసం 'ఆదిపురుష్'. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మూవీలో ప్రభాస్ పురాణపురుషుడు శ్రీరాముడిగా నటించాడు. కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీనికి ప్రధానకారకుడు డైరెక్టర్ ఓం రౌత్ అంటూ విమర్శకులు సైతం ఆయనపై విరుచుకుపడ్డారు.

100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న అడివి శేష్ G2
ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ కథానాయకుడిగా నటించిన సెన్సేషనల్ స్పై థ్రిల్లర్ 'గూఢచారి' 6 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తన లేటెస్ట్ మూవీ 'G2' నుంచి స్టన్నింగ్ మూమెంట్స్‌తో ఫ్యాన్స్‌ని థ్రిల్ చేశారు. కాగా ఇది గూఢచారికి సీక్వెల్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న G2లో బనితా సంధు హీరోయిన్గా నటిస్తోంది. డైరెక్టర్ వినయ్ కుమార్‌తో కలిసి శేష్ రైటర్‌గా వ్యవహరిస్తుండటం గమనార్హం.

వేట్టైయాన్.. డబ్బింగ్ సెషన్లో మంజు వారియర్
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వేట్టైయాన్'. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్ టీజర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసింది. దుషారా విజయన్, రితికా సింగ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.

సరిపోదా శనివారం తెలుగు రివ్యూ
మొత్తానికి మంచి అంచనాల మధ్య వచ్చిన సరిపోదా శనివారం అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు. నాని, ఎస్జే సూర్య నటన, స్క్రీన్ ప్లే, సెకండాఫ్ సినిమాలో హైలైట్ అయ్యాయి. ఓవరాల్‌గా అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.

35 నుండి.. నీలి మేఘములలో లిరికల్ వీడియో రిలీజ్
మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్టైనర్ '35-చిన్న కథ కాదు'. క్లీన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమని రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ వాల్టెయిర్ ప్రొడక్షన్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు.

మత్తు వదలరా 2.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్యాలెంటెడ్ హీరో శ్రీ సింహా కోడూరి ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మత్తు వదలారా 2'. రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ మూవీ 'మత్తు వదలరా' సినిమాకు సీక్వెల్ గా ఇది తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దీనికోసం మళ్ళీ ఇప్పుడు అదే క్రియేటివ్ టీమ్ చేతులు కలిపింది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది.

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్‌ను కలిసిన హీరో నాని
నేచురల్ స్టార్ నాని కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న)ను కలిశారు. నాని నటించిన 'సరిపోదా శనివారం' సినిమా రేపు రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆయన దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు బెంగళూరులో ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేయగా.. అందులో శివన్న కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో నాని శాండల్‌వుడ్ సూపర్ స్టార్‌ను కలుసుకున్నారు.

పుష్ప 2 కౌంట్‌డౌన్ స్టార్ట్.. 100 రోజుల్లో థియేటర్లలోకి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్లో నటిస్తోన్న ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ 'పుష్ప-ది రైజ్'కి సీక్వెల్‌గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి రిలీజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సహా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ పెంచేసింది.

ఓటీటీలో కల్కి సంచలనం.. గ్లోబల్ వైడ్‌గా ట్రెండింగ్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజైన సంగతి గుర్తుండేవుంటుంది.

జనక అయితే గనక ట్రైలర్లో ఇవి గమనించారా..!
అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాను శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆయనతో వర్క్ చేయాలన్న కోరిక ఈ సినిమాతో తీరింది
యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్‌కమింగ్ మూవీ 'భలే ఉన్నాడే'. సింగీతం శ్రీనివాస్, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, రాచా రవి, సుదర్శన్, శ్రీనివాస్ వడ్లమాని, మణి చందన, పటాస్ ప్రవీణ్ తదితరులు ముఖ్య తారాగణం.

ఈ సినిమా టైటిల్లో శనివారం పెట్టడానికి కారణం.. నాని
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో SJ సూర్య పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు.

దేవర మూడో పాట.. ఎప్పుడొచ్చినా భీభత్సమే
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

మత్తు వదలరా 2 నుంచి ఫరియా అబ్దుల్లా ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ మూవీ 'మత్తు వదలరా'. ఇప్పుడు అదే క్రియేటివ్ టీమ్ సీక్వెల్ 'మత్తు వదలారా 2' తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దేవర వరల్డ్‌వైడ్ రిలీజ్ చేస్తోంది ఎవరంటే..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఓటీటీ లోకి వచ్చేస్తున్న అల్లు శిరీష్ బడ్డీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బడ్డీ'. ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు. గాయత్రి భరద్వాజ్, ప్రిషా సింగ్ రాజేష్ ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించగా.. హిప్హాప్ తమిళ సంగీతం అందించారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించిన బడ్డీ ఆగస్ట్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.