కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వేట్టైయాన్’. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్ టీజర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసింది. దుషారా విజయన్, రితికా సింగ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె రజినీకాంత్ భార్యగా కనిపించనున్నారు.
తాజాగా మంజు వారియర్ వేట్టైయాన్‌లో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ ప్రారంభించారు. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. మంజు డబ్బింగ్ చెప్తున్న ఫోటోను షేర్ చేశారు. ఇందులో ఆమె తలకు హెడ్ ఫోన్స్ తగిలించుకుని డబ్బింగ్ చెబుతుండటం గమనించొచ్చు. కాగా అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో మంజు వారియర్ మాట్లాడుతూ.. సూపర్ స్టార్‌తో కలిసి తొలిసారిగా నటిస్తున్నానని, ఆయన భార్యగా ఒక అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్ కలిగిన రోల్‌లో కనిపిస్తానని తెలిపారు.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కాగా వేట్టైయాన్ సినిమాను దీపావళి కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదిలావుంటే, మరోవైపు క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘తలైవా 171’గా తెరకెక్కుతోన్న ‘కూలి’ చిత్రంలో కూడా రజినీకాంత్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: