సరిపోదా శనివారం తెలుగు రివ్యూ

Saripodhaa Sanivaaram Movie Review in Telugu

నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్.జె.సూర్య, సాయికుమార్ తదితరులు
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్ర‌ఫీ: మురళి జి
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
నిర్మాణం: డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేచురల్ స్టార్ నాని హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ఈ అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపధ్యంలో గురువారం ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలయింది. ఇక ఈ చిత్రం ఎలా ఉంది? ‘దసరా’, ‘హాయ్ నాన్న’ తర్వాత నాని హ్యాట్రిక్ అందుకున్నాడా? ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత నిర్మాత డివివి దానయ్య మళ్ళీ హిట్ కొట్టారా? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:-

సూర్య (నాని) LIC ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. తనకి చిన్నప్పటి నుండి కోపం ఎక్కువ. దీంతో అతను అనేక సమస్యలు ఎదుర్కొంటుంటాడు. ఈ సమస్యకు పరిష్కారంగా వారంలో ఆరు రోజులు ప్రశాంతంగా వుంటూ, ఒక్క శనివారం రోజు మాత్రమే గొడవలకు దిగుతానని తన తల్లి ఛాయాదేవి (అభిరామి) చనిపోయేముందు వాగ్దానం చేస్తాడు. అతని ఈ వైఖరి వలన తండ్రి (సాయికుమార్), అక్క (అదితి) ఇబ్బందులు పడుతుంటారు. ఇదిలావుండగా కానిస్టేబుల్ చారులత (ప్రియాంక మోహన్) తో ప్రేమలో పడతాడు సూర్య.

మరోవైపు దయానంద్ (ఎస్‌జే సూర్య) ఒక క్రూరమైన పోలీసు అధికారిగా సోకులపాలెం అనే ప్రాంతాన్ని తన అధికార బలంతో పట్టి పీడిస్తుంటాడు. అయితే తప్పు జరిగితే తట్టుకోలేని హీరో ఆ ప్రాంతాన్ని కాపాడాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో హీరోకి, విలన్‍కి మధ్య జరిగిన గొడవలో ఎవరు గెలిచారు? దయాకు తన సొంత అన్న (మురళీశర్మ)తో ఉన్న గొడవలేంటి? దయా క్రూరత్వానికి గురైన సోకులపాలెంలోని ప్రజలను సూర్య ఎలా రక్షించాడు? అన్నదే సినిమా కథ.

విశ్లేషణ:-

ఇదొక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ మూవీ అయినప్పటికీ.. హీరో శనివారం మాత్రమే ఫైట్ చేస్తాడనే కాన్సెప్ట్‌ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అసలు కథలోకి వెళ్ళడానికి.. అంటే హీరో పాత్ర‌ను ప‌రిచ‌యం చేయ‌డానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ ఎక్కువ‌ టైమ్ తీసుకున్నాడు. ఇక హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా అనిపిస్తుంది.

దీంతో ఆ పాత్రకు సంబంధించి రాసుకున్న సీన్స్ సరదాగా సాగడంతో ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‍గా సాగుతుంది. అయితే ప్రీ ఇంటర్వెల్ నుండి సీరియస్ టర్న్ తీసుకుని ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై అంచనాలు పెంచేస్తుంది. ఇక సెకండాఫ్‌లో హీరో విలన్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగే సీన్స్ ఆకట్టుకుంటాయి. ప్రతి సీన్ ఆసక్తిగా ఉండి ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేసేలా వుంటుంది. ఇక్కడ కథ కంటే కూడా స్క్రీన్ ప్లే పరంగా మేజిక్ చేసాడు దర్శకుడు.

అయితే మూడు గంట‌ల ర‌న్ టైమ్ ఉండటం ఈ సినిమాకు కొంత డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. మూవీ లెంగ్త్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది. అక్కడక్కడా కొంచెం డ్రాగ్ అయిన ఫీల్ వస్తుంది. కానీ ఓవరాల్‌గా ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‍ మోడ్‌లో.. సెకెండాఫ్ ఇంట్రెస్టింగ్‍గా సాగింది. ఇక ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సినిమాకు మంచి ఎస్సెట్ అని చెప్పొచ్చు.

ఇక నటీనటుల విషయానికొస్తే.. నాని సూర్య పాత్రలో ఇరగదీశాడు. దసరా తర్వాత హాయ్ నాన్నతో ఫ్యామిలీ స్టోరీ చేసిన ఆయన మరోసారి యాక్షన్ పాత్రలో కనిపించి అలరించాడు. వారంలో ఆరు రోజులు కోపాన్ని కంట్రోల్ చేసుకునే క్రమంలో ఆయన పలికించిన ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం నానిలోని నటుడిని మరింత కొత్తగా ఆవిష్కరిస్తుంది. సినిమా మొత్తం ఎంతో సెటిల్డ్‌గా నటించి మెప్పించాడు నాని.

ఇక ఎస్‌జే సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడిగా కంటే, నటుడిగా ఆయనకు ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య ఆయన లేకుండా తమిళంలో పెద్ద సినిమాలు రావట్లేదు అంటేనే తెలుస్తోంది ఆయన రేంజ్ ఏంటో? ఇటీవల వచ్చిన ధనుష్ 50వ చిత్రం ‘రాయన్’ లోనూ సూర్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదేక్రమంలో ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఎస్‌జే సూర్య ప‌ర్మార్ఫెన్స్‌ అదిరిపోయిందనే చెప్పాలి. ఆ పాత్రను అయన తప్ప మరెవ్వరూ అంత బాగా పోషించలేరు అని హీరో నాని చెప్పిన మాటలు యదార్ధం.

హీరోయిన్ ప్రియాంక మోహన్ గ్యాంగ్ లీడర్ తర్వాత నానికి జోడిగా చేసింది. అందులో కంటే ఈ చిత్రంలోనే వీరిద్దరి జంట బావుంది. వీరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందనే చెప్పాలి. ఇక అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్.. తమ పాత్రల పరిధి మేరకు డీసెంట్‌గా నటించారు.

ఇక టెక్నికల్ విషయానికొస్తే.. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో వుంది. బీజీఎమ్ చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది. సాంగ్స్ కూడా డీసెంట్‍గా వున్నాయి. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. మురళి జి సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. యాక్షన్ సీక్వెన్స్ విజువల్ ఫీస్ట్‌లా వున్నాయి. నిర్మాణ విలువలు బావున్నాయి.

మొత్తానికి మంచి అంచనాల మధ్య వచ్చిన సరిపోదా శనివారం అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు. నాని, ఎస్‌జే సూర్య నటన, స్క్రీన్ ప్లే, సెకండాఫ్ సినిమాలో హైలైట్ అయ్యాయి. ఓవరాల్‌గా అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.