
ట్యాగ్ · 51 కథనాలు · పేజీ 3


హిట్ 3 కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

నెపోటిజం పై నాని సిస్టర్ ఎమోషనల్

1 మిలియన్ డాలర్ క్లబ్ లో హిట్ 2

తెలుగు మూవీస్ లో నటిస్తూనే ఉంటా - తాప్సీ

మాల్దీవ్స్ లో "అంటే .. సుందరానికీ !" షూటింగ్

సుహాస్ 'ఫ్యామిలీ డ్రామా' ట్రైలర్ రిలీజ్

హీరోలు రవితేజ, అడివి శేష్ లపై మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఫెమీనా మిస్ ఇండియా హరియాణ 2018 టైటిల్ విన్నర్ మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. తరువాత మాస్ మహారాజా రవితేజ కు జంటగా మీనాక్షి ఖిలాడి మూవీలో నటించారు. అడివి శేష్, మీనాక్షి జంటగా తెరకెక్కిన HIT:ది సెకండ్ కేసు ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీతో మీనాక్షి ఫస్ట్ హిట్ అందుకున్నారు.

హిట్ 3 కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ల హవా నడుస్తుందని చెప్పొచ్చు. కొత్త కొత్త కథలతో హిట్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక అందులో శైలేష్ కొలను కూడా ఉన్నాడు. రీసెంట్ గానే హిట్ 2 తో మరో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ఇంతకుముందు తన నుండి వచ్చిన హిట్ సినిమాకు సీక్వెల్. హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా.. సస్పెన్స్ థ్రిల్లర్ తో రూపొందించిన ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. ఆ సీక్వెల్ గా హిట్ 2 ను తెరకెక్కించి ఇటీవల రిలీజ్ చేశారు. అడివి శేష్ నటించిన ఈసినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ అప్పుడే ఈసినిమాకు ఏడు ప్రాంచైజీస్ ఉన్నట్టు తెలిపాడు డైరెక్టర్. ఇక…

నెపోటిజం పై నాని సిస్టర్ ఎమోషనల్
అష్టా చమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన నటనతో న్యాచురల్ స్టార్ గా పేరుతెచ్చుకొని ఇప్పుడు స్టార్ హీరోగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నాని. ఇక ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క ప్రొడక్షన్ హౌస్ కూడా స్థాపించి నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే తన బ్యానర్ పై వచ్చిన హిట్ సినిమా హిట్ 2 సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. అంతేకాదు తన సిస్టర్ దీప్తిని కూడా డైరెక్టర్ గా తన ప్రొడక్షన్ హౌస్ నుండే ఇంట్రడ్యూస్ చేశాడు. మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్ ను దీప్తీ డైరెక్ట్ చేసింది దీప్తి. ఈ సిరీస్ కు నాని నిర్మాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం అయితే ఈ సిరీస్ కు మంచి రెస్పాన్సే…

1 మిలియన్ డాలర్ క్లబ్ లో హిట్ 2
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో, వరుస హిట్లతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కెరీర్ ప్రారంభం నుండీ విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కథలో కంటెంట్ ఉండేలా చూసుకుంటాడు కాబట్టి వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ఈనేపథ్యంలోనే ఈఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు హిట్లను అందుకున్నాడు. పేట్రియాటిక్ నేపథ్యంలో వచ్చిన మేజర్ సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయి దేశవ్యాప్తంగా అడివి శేష్ కు గుర్తింపు నిచ్చింది. ఇక ఈనెల 2వ తేదీన రిలీజ్ అయిన సినిమా హిట్ 2. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా హిట్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే.

తెలుగు మూవీస్ లో నటిస్తూనే ఉంటా - తాప్సీ
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సూపర్ హిట్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”మూవీ ఫేమ్ స్వరూప్ RSJ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నిజ జీవిత సంఘటనతో తెరకెక్కిన “మిషన్ ఇంపాజిబుల్ ” మూవీ ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో హార్ష్ రోషన్ , సుహాస్ , హర్షవర్ధన్ , సత్యం రాజేష్ ముఖ్య పాత్రలలో నటించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయకుడు నవీన్ పోలిశెట్టి “మిషన్ ఇంపాజిబుల్ ” మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.

నవీన్ పోలిశెట్టి వాయిస్ ఓవర్ తో "మిషన్ ఇంపాజిబుల్ "
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సూపర్ హిట్ "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ"మూవీ ఫేమ్ స్వరూప్ RSJ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నిజ జీవిత సంఘటనతో తెరకెక్కిన "మిషన్ ఇంపాజిబుల్ " మూవీ ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో హార్ష్ రోషన్ , సుహాస్ , హర్షవర్ధన్ , సత్యం రాజేష్ ముఖ్య పాత్రలలో నటించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మాల్దీవ్స్ లో "అంటే .. సుందరానికీ !" షూటింగ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ రెండు షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో హీరో నాని కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ పేరుతో నటించడం విశేషం.

'ఫ్యామిలీ డ్రామా' రెస్పాన్స్ పై సుహాస్.. చాలా భయపడ్డా..!
మరోసారి తన నటనతో మంచి నటుడని నిరూపించాడు యంగ్ హీరో సుహాస్. మొదటి నుండి సుహాస్ నటన అంటే చాలా మందికి మంచి ఇంప్రెషనే ఉంది. సుహాస్ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పటినుండి కూడా తన నటనకు అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక ఆ తరువాత పలు సినిమాల్లో ఫ్రెండ్స్ క్యారెక్టర్లతో పాటు పలు కీలకపాత్రల్లో నటించిన సుహాస్ కలర్ ఫొటో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటిసినిమాతోనే హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇక రీసెంట్ గా ఫ్యామిలీ డ్రామా అనే సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. ఓటీటీలో రిలీజ్ అయిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సైకో పాత్రలో చేసిన సుహాస్ నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

'ఫ్యామిలీ డ్రామా' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
కలర్ ఫొటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ ఆ సినిమాలో తన నటనకు గాను మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. దాంతో సుహాస్ కు మంచి ఆఫర్లే వస్తున్నాయి.. ఇక సుహాస్ కూడా అదే జోష్ తో ఇప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా అనే థ్రిల్లర్ తో రాబోతున్నాడు. మెహెర్ తేజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ఎలాంటి హడావుడి లేకుండానే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. సైకో కిల్లర్‌గా సుహాస్ కనిపించిన తీరు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలను కూడా పెంచేశారు. ఇక తాజాగా…

సుహాస్ 'ఫ్యామిలీ డ్రామా' ట్రైలర్ రిలీజ్
కలర్ ఫొటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుహాస్. అంతకు ముందు పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లలో చేసి తనదైన కామెడీతో నవ్వించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి జోనర్ ను మార్చి ఫ్యామిలీ డ్రామా అనే థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా ఈసినిమా మొదలైనట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఏకంగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

సుహాస్ 'ఫ్యామిలీ డ్రామా' ఫస్ట్ లుక్ రిలీజ్
షార్ట్ ఫిల్మ్‌తో పాపులర్ అయిన సుహాస్.. సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ మెల్లమెల్లగా సినిమా అవకాశాలు దక్కించుకున్నాడు. మజిలి, ఏజేంట్ శ్రీనివాస్ ఆత్రేయ తో పాటు పలు సినిమాల్లో తన కామెడీతో నవ్వించిన సుహాస్ ఇటీవల హీరోగా కూడా మారాడు. కలర్ ఫొటో సినిమాలో హీరోగా నటించి హీరోగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో కొత్తసినిమాతో వచ్చేస్తున్నాడు.