టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో, వరుస హిట్లతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కెరీర్ ప్రారంభం నుండీ విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కథలో కంటెంట్ ఉండేలా చూసుకుంటాడు కాబట్టి వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ఈనేపథ్యంలోనే ఈఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు హిట్లను అందుకున్నాడు. పేట్రియాటిక్ నేపథ్యంలో వచ్చిన మేజర్ సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయి దేశవ్యాప్తంగా అడివి శేష్ కు గుర్తింపు నిచ్చింది. ఇక ఈనెల 2వ తేదీన రిలీజ్ అయిన సినిమా హిట్ 2. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా హిట్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో అడివి శేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఇక ఈసీక్వెల్ కూడా సూపర్ హిట్ అయి కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. పది రోజుల్లో ‘హిట్ 2’ మూవీకి భారీగా వసూళ్లు దక్కాయి. ఇక ఈసినిమాకు యూఏస్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా 1 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిపోయింది.
కాగా ఈసినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. ఇంకా ఈసినిమాలో భానుచందర్, రావు రమేష్, పోసాని, తనికెళ్ళ భరణి, కోమలీ ప్రసాద్ తదితరులు నటించారు. నాని సొంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మించారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి జాన్ స్టీవర్ట్ ఎడురి సంగీతాన్ని అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: