
ట్యాగ్ · 12 కథనాలు


అయలాన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మహావీరుడు డబ్బింగ్ కంప్లీట్ చేసిన కార్తికేయన్

కార్తికేయన్ 'ప్రిన్స్' రిలీజ్ అనౌన్స్ మెంట్..!

#SK 20 "మూవీ రిలీజ్ డేట్

100 కోట్ల క్లబ్ లో కార్తికేయన్ 'డాన్'

టాలీవుడ్ మేకర్స్ తో కోలీవుడ్ హీరోలు

శివకార్తికేయన్ 'డాన్' రిలీజ్ డేట్ ఫిక్స్

'జాతి రత్నాలు' తో థమన్.. చాలా నవ్వుకున్నా

శివ కార్తికేయన్ "డాక్టర్ వరుణ్" రిలీజ్ డేట్ ఫిక్స్

"శక్తి" ది సూపర్ హీరో మూవీ ట్రైలర్ రిలీజ్

"శక్తి " ది సూపర్ హీరో మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్

శివ కార్తికేయన్ 25వ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్
గత ఏడాది దీపావళికి అమరన్ తో వచ్చి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు తమిళ హీరో శివ కార్తికేయన్. ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులో కూడా దాదాపు 40కోట్ల వసూళ్లతో బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించాడు.

అయలాన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో శివ కార్తికేయన్ పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారి తన నటనతో అందరినీ ఆకట్టుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే మహా వీరుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ కార్తికేయన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో బిజీగా అయిపోయాడు. ఆర్ రవికుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న సినిమా అయలాన్. సైన్స్ ఫిక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే కదా.

మహావీరుడు డబ్బింగ్ కంప్లీట్ చేసిన కార్తికేయన్
తమిళ్ టాలెంటెడ్ నటుడు శివకార్తికేయన్ తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నుండి వస్తున్న సినిమా మహావీరుడు. మడోన్ అశ్విన్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. తమిళ్ లో మావిరన్ అనే టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో మహావీరుడు అనే టైటిల్ తో వస్తుంది. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసే పనిలో ఉంది. రీసెంట్ గానే శివ కార్తికేయన్ ఈసినిమా డబ్బింగ్ ను ప్రారంభించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ అప్…

కార్తికేయన్ 'ప్రిన్స్' రిలీజ్ అనౌన్స్ మెంట్..!
ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు తమిళ్ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిపోయాడు. రీసెంట్ గా డాక్టర్ ఇంకా డాన్ సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మరోవైపు శివ కార్తికేయన్ తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ సినిమా తెరకెక్కు తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈమధ్య ఈసినిమా నుండి పోస్టర్లు రిలీజ్ చేయగా అవి అందరినీ ఆక్టటుకున్నాయి.

#SK 20 "మూవీ రిలీజ్ డేట్
సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు” మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా తెలుగు , తమిళ భాషలలో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో శివకార్తికేయన్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ తో ఆయన టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

100 కోట్ల క్లబ్ లో కార్తికేయన్ 'డాన్'
విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వరుసగా విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు తమిళ టాలెంటెడ్ నటుడు శివ కార్తికేయన్. ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన శివ కార్తికేయన్ తక్కువ టైంలోనే స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. గత ఏడాదే డాక్టర్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈసినిమా కూడా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అవ్వడమే కాదు.. సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన డాన్ సినిమా కూడా అస్సలు తగ్గడం లేదు.

టాలీవుడ్ మేకర్స్ తో కోలీవుడ్ హీరోలు
కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్ , కమల్ హాసన్ , అజిత్ , విజయ్ , విక్రమ్ , సూర్య ,ధనుష్, కార్తీ , శివ కార్తికేయన్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ , కమల్ హాసన్, కార్తీ వంటి హీరోలు తెలుగు స్ట్రయిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.తమిళ హీరోలకు తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా అధికమే. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కుతున్న టాలీవుడ్ మూవీస్ పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ కావడం , సక్సెస్ రేటు, నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందడంతో కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ మూవీస్ పై అధిక ఆసక్తి కనపరుస్తున్నారు.

శివకార్తికేయన్ 'డాన్' రిలీజ్ డేట్ ఫిక్స్
శివ కార్తికేయన్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అక్కడి హీరోలకు మంచి పోటీ ఇస్తూ విభిన్నమైన కథలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే డాక్టర్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు శివ కార్తికేయన్. ఆ సినిమాను తానే నిర్మించి మంచి నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టింది డాక్టర్ సినిమా. ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయాడు. సిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.

'జాతి రత్నాలు' తో థమన్.. చాలా నవ్వుకున్నా
ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న లాంగ్వేజ్ బారియర్స్ అనేవి దాదాపు చాలా వరకూ తొలగిపోయాయి. మన వాళ్లు ఇతర వాళ్లను తీసుకోవడం.. ఇప్పుడు మన వాళ్లు కూడా వేరే లాంగ్వేజస్ లో చేయడం.. ఇంకా విచిత్రం ఏంటంటే.. తమిళ్ హీరోలు డైరెక్ట్ గా తెలుగు సినిమాలను చేయడం.. దానికి తెలుగు డైరెక్టర్స్ దర్శకత్వం వహించడం ఇలా చాలా ఈక్వేషన్స్ ను చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు మరో కాంబినేషన్ కూడా రెడీ అయిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ అనుదీప్ జాతిరత్నాలు సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అలాంటి అనుదీప్ డైరెక్షన్ లో తమిళ్ స్టార్ కార్తికేయ హీరోగా సినిమా వస్తుంది. ఈ సినిమా తోనే టాలీవుడ్ లో డైరెక్ట్ గా ఎంట్రీ…

శివ కార్తికేయన్ "డాక్టర్ వరుణ్" రిలీజ్ డేట్ ఫిక్స్
శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్, కె జె ఆర్ స్టూడియోస్ బ్యానర్స్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో స్టార్ హీరో శివ కార్తికేయన్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా తెరకెక్కిన "డాక్టర్" తమిళ మూవీ , కే.జె. ఆర్ స్టూడియోస్, గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రూపొందిన తెలుగు డబ్బింగ్ వెర్షన్"డాక్టర్ వరుణ్" విజయ దశమి కానుకగా అక్టోబర్ 9వ తేదీన రిలీజ్ కానున్నాయి. ఈ మూవీ లో వినయ్ రాయ్ విలన్‌గా నటించారు.అనిరుధ్ సంగీతం అందించారు.

"శక్తి" ది సూపర్ హీరో మూవీ ట్రైలర్ రిలీజ్
కె జె ఆర్ స్టూడియోస్ బ్యానర్ పై శివ కార్తికేయన్ హీరోగా సూపర్ హిట్ "అభిమన్యుడు " మూవీ ఫేమ్ పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో సూపర్ హీరో ఫిల్మ్ "హీరో " తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ "శక్తి " మూవీ మార్చి 20 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో కళ్యాణి ప్రియదర్శన్ కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఇవానా ఒక కీలక పాత్ర లో నటించారు. అర్జున్ , అభయ్ డియోల్ ముఖ్య పాత్రలలో నటించారు.

"శక్తి " ది సూపర్ హీరో మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్
బ్లాక్ బస్టర్ "ఇరుంబు తిరై "(అభిమన్యుడు ) మూవీ ఫేమ్ పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో కె జె ఆర్ స్టూడియోస్ బ్యానర్ పై శివకార్తికేయన్ హీరోగా రూపొందిన "హీరో " తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ "శక్తి " ది సూపర్ హీరో మూవీ మార్చి 20 వ తేదీ రిలీజ్ కానుంది. కళ్యాణి ప్రియదర్శన్ కథానాయిక కాగా ఇవానా ఒక కీలక పాత్రలో నటించారు. అర్జున్, అభయ్ డియోల్ ముఖ్య పాత్రలలో నటించారు.