తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో శివ కార్తికేయన్ పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారి తన నటనతో అందరినీ ఆకట్టుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే మహా వీరుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ కార్తికేయన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో బిజీగా అయిపోయాడు. ఆర్ రవికుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న సినిమా అయలాన్. సైన్స్ ఫిక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
With Ayalaan… For #Ayalaan 👽#AyalaanTeaser from Oct 6 😊👍#AyalaanFromPongal#AyalaanFromSankranti pic.twitter.com/Kmd50GJue7
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) October 2, 2023
మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలోభాగంగానే ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 6వ తేదీన ఈసినిమా టీజర్ ను రలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తెలియచేశారు మేకర్స్. కాగా ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.కెజెఆర్ స్టూడియోస్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: