ట్యాగ్ · 71 కథనాలు · పేజీ 4
హైదరాబాద్ లో యాక్షన్ స్టార్ యశ్
అధీరా లుక్‌లోకి సంజయ్
కె.జి.ఎఫ్2 - నవంబర్ నుండి షూట్ లో సంజయ్ దత్..!
సంజయ్ భాయ్ మీరొక ఫైటర్
'కె.జి.యఫ్ 2' - భయపెడుతున్న 'అధీర' లుక్..!

'చిరు' తో ఢీ కొట్టనున్న 'అధీర'..?
ఎన్టీఆర్ సినిమాలో పవర్ఫుల్ పొలిటీషియన్‌గా ...!
‘యన్టీఆర్ 30’లో సంజయ్ దత్?
నేను పూర్తిగా కోలుకున్నా - మీ అందరి వల్లే సాధ్యమైంది
సంజయ్ దత్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే కదా. ఆయనకు ఇటీవలే లంగ్ క్యాన్సర్ అని తెలిసింది. ఈ నేపథ్యంలో గతకొద్ది కాలంగా చికిత్స తీసుకుంటున్నారు కూడా. ఇక క్యాన్సర్ పై సంజూ భాయ్ విజయం సాధించినట్టే తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
హైదరాబాద్ లో యాక్షన్ స్టార్ యశ్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా కోలార్ గోల్డ్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ కన్నడ మూవీ "కె జి ఎఫ్ చాప్టర్1 " ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీ నిధి శెట్టి హీరోయిన్ కాగా స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించారు. హీరో యశ్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీ కి హై లైట్ గా నిలిచింది. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ విజయం సాధించాయి.
అధీరా లుక్‌లోకి సంజయ్
తాను చేస్తున్న వృత్తి పట్ల తనకు ఎంత డెడికేషన్, ప్యాషన్ ఉందో అర్ధమవుతుంది బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను చూస్తుంటే. ఎందుకంటే ప్రస్తుతం సంజయ్ దత్ కు ఆరోగ్యం బాలేదన్న సంగతి తెలిసిందే. ఇటీవలే లంగ్ క్యాన్సర్ అని తెలియగా దానికి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. మరి క్యాన్సర్ ట్రీట్ మెంట్ అంటే చాలా మందికి తెలిసిందే ఎంత వీక్ అయిపోతారో. ఇటీవల సోషల్ మీడియాలో సంజయ్ లుక్ చూసి కూడా చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. ఆయన సన్నగా, కళ్లు లోపలికి పోయి, నీరసంగా కనిపించడంతో అందరూ షాకయ్యారు.
కె.జి.ఎఫ్2 - నవంబర్ నుండి షూట్ లో సంజయ్ దత్..!
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ గత కొద్దికాలంగా క్యాన్సర్ కు చికిత్స చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అటు ట్రీట్ మెంట్ తీసుకుంటూనే మరో వైపు షూటింగ్ లకు కూడా హాజరవుతూ దర్శక నిర్మాతలకు అందుబాటులో ఉంటున్నాడు. ప్రస్తుతం శంషెరా చిత్రానికి డబ్బింగ్ చెప్పే పనిలో వున్నాడు. ఇక హిందీలో పలు సినిమాల్లో నటిస్తుండగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న కె.జి.ఎఫ్2 లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అధీరా అనే ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు.
సంజయ్ భాయ్ మీరొక ఫైటర్
సంజయ్ దత్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే కదా. గత కొద్దిరోజుల క్రితం ఊపిరి పీల్చుకోవడానికి బాగా ఇబ్బంది పడటంతో హాస్పిటల్ లో చేరగా అక్కడ సంజయ్ దత్ కు కరోనా పరీక్షలు చేశారు. అయితే కరోనా నెగిటివ్ వచ్చింది కానీ లంగ్ క్యాన్సర్ అని తేలింది. దీనితో త్వరలోనే ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. అంతేకాదు చికిత్స నిమిత్తం తాను షూటింగ్‌ల నుంచి విరామం తీసుకుంటున్నానని, అయితే తన అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని.. తన ఆరోగ్యంపై వచ్చే ఎలాంటి రూమర్స్ ను నమ్మవద్దని త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తానని ట్వీట్ కూడా చేశారు.

కంగారుపడొద్దు.. మెడికల్ ట్రీట్మెంట్ కోసం బ్రేక్..!
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు లంగ్ కాన్సర్ అన్నట్టు పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. శ్వాస సరిగ్గా ఆడట్లేదని ఇటీవల హాస్పిటల్ లో చేరగా కరోనా ఏమన్నా సోకిందేమో అన్న అనుమానంతో వైద్యులు కరోనా పరీక్షలు చేయగా.. అందులో కరోనా నెగిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అదే సమయంలో జరిపిన పరీక్షల్లో ఆయనకు లంగ్ కాన్సర్ ఉన్నట్టు తేలిందట. ఈ నేపథ్యంలో చికిత్స కోసం అమెరికాకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే మరోపక్క సంజయ్ కు సీరియస్ గా ఉందని.. స్టేజ్ 4 అంటూ పలు వార్తలు కూడా వస్తున్నాయి.
'కె.జి.యఫ్ 2' - భయపెడుతున్న 'అధీర' లుక్..!
'కె.జి.యఫ్ 2' నుండి త్వరలో అప్ డేట్ అని ప్రశాంత్ నీల్ చెప్పడంతో ఆ అప్ డేట్ ఏంటబ్బా అని అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే ఆ అప్ డేట్ ఏంటో తెలిసిపోయింది. ఈ రోజు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’లోని అధీరా లుక్‌ను విడుదల చేసింది. ఈ లుక్‌ను విడుదల చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ‘‘హ్యాపీ బర్త్ డే సంజూ బాబా. మా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’లో భాగమైనందుకు ధన్యవాదాలు.. మన షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నా సర్ అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇక ఫస్ట్ లుక్ విషయానికొస్తే చెప్పేదేముంది అధీర అనే పేరుకు తగ్గట్టే ఉంది. తెల్లటి గడ్డం…
'సంజయ్ దత్' బర్త్ డే కి 'కె.జి.యఫ్2' టీమ్ సర్ప్రైజ్..?
కె.జి.యఫ్ హిట్ సంచలన విజయం దక్కించుకోవడంతో దాని సీక్వెల్ కె.జి.యఫ్2 కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఎంత ఎదురు చూస్తున్నారో అంత వెనక్కి వెళ్తుంది. మరోపక్క దర్శక నిర్మాతలు మాత్రం తొందరలోనే సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తామని చెపుతున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ అధీర పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 29 న సంజయ్ దత్ పుట్టినరోజు కావడంతో ఆరోజు ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి టీజర్ ఆ లేకపోతే సంజయ్ దత్ కు సంబంధించిన అప్ డేటే ఏదైనా ఇస్తారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.

'చిరు' తో ఢీ కొట్టనున్న 'అధీర'..?
చిరు సినిమా అంటే చాలు రోజుకో వార్త వస్తూనే ఉంటది. ఇక లూసిఫర్ సినిమాపై అయితే ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా లూసిఫర్ సినిమాల పాత్రల గురించి అయితే రోజుకో రూమర్ వస్తుంది. మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. 'సాహో' ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘లూసిఫర్’ మలయాళ వెర్షన్లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే మొదట ఈ పాత్రను తెలుగులో ప్రముఖ నటుడు రెహ్మాన్ పోషించనున్నట్టు వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఇప్పుడు మరో పేరు…
ఎన్టీఆర్ సినిమాలో పవర్ఫుల్ పొలిటీషియన్‌గా ...!
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
‘యన్టీఆర్ 30’లో సంజయ్ దత్?
‘అరవింద సమేత’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, యన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.