ట్యాగ్ · 190 కథనాలు · పేజీ 10
ఇంట్లో పనులకంటే యాక్షన్ సీక్వెన్సే ఈజీ..!
ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో సాయి ధరమ్ తేజ్
సోషల్ మీడియాలో సాయితేజ్ హవా
సోషల్ డ్రామా గా "#SDT 14"

సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం

సాయితేజ్ కి జంటగా నివేదా పెతురాజ్?
ఎన్ని రోజులు అలా ఉంటావో చూస్తా..!
అందుకే రిలేషన్ షిప్ లో లేను..!
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్ట్ తగ్గిపోతుంది. ఈలిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రానా, నితిన్ ఇద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతన్నారు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే మెగా కుటుంబంలో ముందు వరసలో ఉన్న చరణ్, బన్నీ పెళ్లి చేసుకున్నారు. వరుణ్, శిరీష్ ల పెళ్ళిళ్లకు ఇంకా టైం ఉంది. ఇప్పుడు ముందు వరుసలో కనపడుతుంది సాయి తేజ్ ఒక్కడే. పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు ఒకటే గొడవ చేస్తున్నారని చెప్పాడు. పెళ్లి వద్దని ఇంటి నుంచి పారిపోవడం కూడా ఇక కష్టమేనని ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా చెప్పేసాడు.
ఇంట్లో పనులకంటే యాక్షన్ సీక్వెన్సే ఈజీ..!
లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ వల్ల అందరూ ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ టైం లో తాను కూడా ఓ కొత్త విషయం తెలుసుకున్నా అంటున్నాడు సాయి తేజ్. నేను షూటింగ్స్ తో బిజీగా ఉంటా కాబట్టి రోజూ తాను ఇంట్లో ఏం చేస్తుందో చూసే ఛాన్స్ ఉండేది కాదు.. ఇప్పుడు లాక్ డౌన్ లో ఇంట్లో ఉండటం వల్ల రియలైజ్ అయ్యాను మన తల్లులకు మనం గ్రాంటెడ్ గా ఉండాల్సిందే.. నేను తమ్ముడు వైష్ణవ్ వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్ లో పెట్టడమే పెద్ద పనిగా ఫీల్ అవుతాం.. కానీ తను మాత్రం ఇన్ని రోజుల నుండి ఎన్నో పనులు చేస్తుంది. ఇన్ని పనులు చేస్తూ…
ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో సాయి ధరమ్ తేజ్
"చిత్ర లహరి ", ప్రతి రోజూ పండగే " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో టాలీవుడ్ లో కొనసాగుతున్న హీరో సాయితేజ్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న "సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ "ప్రస్థానం " మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో ఒక మూవీ కి సాయి తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సోషల్ మీడియాలో సాయితేజ్ హవా
ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియాదే హవా. అందుకే నిన్నటి తరం అగ్ర కథానాయకుల నుంచి నేటి తరం యువ కథానాయకుల వరకు అంతా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. తమ తమ సినిమాల అప్‌డేట్స్‌తో పాటు.. వ్యక్తిగత, సామాజిక అంశాలతో కూడా తమ అభిమానులను అలరిస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే.. రెండు వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫాలోవర్స్ పరంగా రెండు ల్యాండ్ మార్క్స్‌ను అందుకున్నాడు మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్.
సోషల్ డ్రామా గా "#SDT 14"
సక్సెస్ ఫుల్ "చిత్ర లహరి", ప్రతి రోజూ పండగే" మూవీస్ తరువాత సాయి ధరమ్ తేజ్ నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న "సోలో బ్రతుకే సో బెటర్" మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత హీరో సాయి తేజ్, "ప్రస్థానం" మూవీ ఫేమ్ దేవా కట్టా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నివేత పేతురాజ్ కథానాయిక.
ఇక రీమిక్స్ చేయను..!
ఇకపై రీమిక్స్ లు జోలికి వెళ్లనంటున్నాడు మెగా మేనల్లుడు సాయి తేజ్. పాపం అంతలా ఎం జరిగింది.. ఈ నిర్ణయం తీసుకోడానికి అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే... మెగా స్టార్ మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి తేజ్... మొదటి నుండి కాస్త తన మేన మామలు చిరంజీవిని, పవన్ ను అనుకరిస్తూనే ఉండేవాడు.. అంతే కాదు తన సినిమాల్లో మామ చిరు పాట ఒక్కటైనా రీమిక్స్ ఉండేలా చూసేవాడు. దీనితో సాయితేజ్ అలా చేయడం వల్ల విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా సాయితేజ్ దీనిపై స్పందించి...ఇకపై తన సినిమాల్లో రీమిక్స్ సాంగులు ఉండకుండా చూసుకుంటానని చెప్పాడు. ఈ విషయంపై దర్శక నిర్మాతలు వత్తిడి చేసినా, తాను మాత్రం రీమిక్స్ లు…

సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం
జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "ప్రస్థానం" మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్, నివేత పేతురాజ్ జంటగా రూపొందనున్న సోషల్ డ్రామా ప్రొడక్షన్ నెం 1 మూవీ ఈ రోజు ప్రారంభం అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నిర్మాత BVSN ప్రసాద్, దర్శకుడు వంశీ పైడిపల్లి పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ దేవుడి ఫోటో పై క్లాప్ తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సాయితేజ్ కి జంటగా నివేదా పెతురాజ్?
గత ఏడాది `చిత్రలహరి`, `ప్రతి రోజూ పండగే` రూపంలొ రెండు వరుస విజయాలు అందుకున్నాడు `సుప్రీమ్` హీరో సాయితేజ్. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న `సోలో బ్రతుకే సో బెటర్`తో ఈ మెగా కాంపౌండ్ హీరో బిజీగా ఉన్నాడు. నూతన దర్శకుడు సుబ్బు రూపొందిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎన్ని రోజులు అలా ఉంటావో చూస్తా..!
మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజు పండగే' తో సాయితేజ్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు సాయి తేజ్. ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతుంది. `ఇస్మార్ట్ శంకర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాను మే డే రోజు అంటే.. 2020 మే 1 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
త్వరలో "సోలో బ్రతుకే సో బెటర్" మూవీ థీమ్ వీడియో రిలీజ్
సక్సెస్ ఫుల్ "చిత్రలహరి" మూవీ తరువాత హీరో సాయి ధరమ్ తేజ్ విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్ హీరో గా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ప్రతి రోజూ పండగే " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు "సోలో బ్రతుకే సో బెటర్" అంటూ మరొక మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.