
ట్యాగ్ · 11 కథనాలు


ఛాంపియన్ నుండి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

ఛాంపియన్ గా వస్తున్న రోషన్

వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రోషన్

"పెళ్ళి సందD" మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్

దసరా కు "పెళ్ళిసందD"

'పెళ్లిసందD' ట్రైలర్ రిలీజ్
"పెళ్ళిసందD" షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
"పెళ్ళిసందD " లో ప్రత్యేక పాత్రలో శ్రీకాంత్ ?
"పెళ్ళిసందD " మూవీలో మాళవిక నాయర్
'పెళ్లి సందడి' కోసం శ్రీకాంత్ తనయుడు

ఓటీటీలోకి వచ్చేసిన ఛాంపియన్
శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా హీరోగా నటించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఛాంపియన్' ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం యావరేజ్ అనిపించుకుంది. ఇక ఈసినిమా ఈ రోజు నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో కూడా వీక్షించవచ్చు.

ఛాంపియన్ నుండి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్
టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్, నటి ఊహా దంపతుల కుమారుడు రోషన్ కొన్నేళ్ళక్రితం 'నిర్మలా కాన్వెంట్' (2016) అనే చిత్రంతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. తొలిచిత్రంతోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అయితే రోషన్ తెరపై కనిపించి నాలుగేళ్లు అవుతోంది. చివరిసారి అతను 2021లో వచ్చిన రెండో సినిమా 'పెళ్లిసందD'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనితర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు.

ఛాంపియన్ గా వస్తున్న రోషన్
టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్. ఎన్నో సూపర్ హిట్లను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అయితే శ్రీకాంత్ విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక శ్రీకాంత్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు తనయుడు రోషన్. నిర్మలా కాన్వెంట్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రోషన్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆసినిమాలో నటనకి ఉత్తమ నటుడిగా సైమా అవార్డును సైతం గెలుచుకున్నాడు. ఆ తర్వాత అతను డాక్టర్ కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం పెళ్లి సందడి సినిమా చేసి తన ఎనర్జిటిక్ నటనతో మరోసారి…

వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రోషన్
సక్సెస్ ఫుల్ "రుద్రమదేవి "మూవీ లో యువ చాళుక్య వీరభద్రగా టాలీవుడ్ కు పరిచయం అయిన హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ "నిర్మలా కాన్వెంట్ " మూవీ తో హీరోగా మారారు. గౌరి రోణంకి దర్శకత్వంలో రోషన్ , శ్రీలీల జంటగా తెరకెక్కిన "పెళ్ళిసందD"మూవీ కమర్షియల్ గా విజయం సాధించింది. ఆ మూవీ లో రోషన్ తన యాక్టింగ్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను అలరించారు. రోషన్ , శ్రీలీల ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రోషన్ ఇప్పుడు ఒక పెద్ద బ్యానర్ లో హీరోగా అవకాశం అందుకున్నారు.

"పెళ్ళి సందD" మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్
కె. కృష్ణమోహన్ రావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో గౌరీ రోణంకి దర్శకత్వంలో రోషన్ , శ్రీలీల జంటగా రూపొందిన “పెళ్ళి సందD” మూవీ దసరా కానుకగా రిలీజ్అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ కి నెగటివ్ టాక్ వచ్చినా భారీ వసూళ్లు సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చిపెట్టింది. హీరో రోషన్ డ్యాన్స్ లతో , హీరోయిన్ శ్రీలీల తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

దసరా కు "పెళ్ళిసందD"
కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన "పెళ్ళిసందడి "మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో గా "పెళ్ళి సందD"తెరకెక్కింది. కె. కృష్ణమోహన్ రావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో గౌరీ రోణంకి దర్శకత్వంలో రోషన్ , శ్రీలీల జంటగా రూపొందిన "పెళ్ళి సందD" మూవీ దసరా కానుకగా రిలీజ్ కానుంది.

'పెళ్లిసందD' ట్రైలర్ రిలీజ్
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లి సందD’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు మేకర్స్. ఈనేపథ్యంలో ఈసినిమా ట్రైలర్ ను మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నట్టు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు.
"పెళ్ళిసందD" షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రూపొందిన "పెళ్ళి సందడి "(1996 ) మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకులను అలరించిన "పెళ్ళి సందడి "మూవీ సీక్వెల్ "పెళ్ళిసందD" మూవీ తెరకెక్కుతుంది. ఆర్కా మీడియా వర్క్స్ , ఆర్ కె ఫిల్మ్స్ అసోసియేట్స్ బ్యానర్స్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో గౌరీ రోనంకి దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ , మాళవిక నాయర్ జంటగా "పెళ్ళిసందD" మూవీ రూపొందుతుంది.
"పెళ్ళిసందD " లో ప్రత్యేక పాత్రలో శ్రీకాంత్ ?
కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "పెళ్ళిసందడి " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రవళి , దీప్తి భట్నాగర్ కథానాయికలు. కీరవాణి స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని "పెళ్ళిసందడి " మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తో శ్రీకాంత్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. క్లీన్ ఎంటర్ టైనర్ గా "పెళ్ళిసందడి " మూవీని తెరకెక్కించి దర్శకుడు రాఘవేంద్ర రావు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 25 సంవత్సరాల తరువాత "పెళ్ళిసందడి " మూవీ సీక్వెల్ తెరకెక్కనుంది.
"పెళ్ళిసందD " మూవీలో మాళవిక నాయర్
ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో ఆర్ కె ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్ పై దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో గా "పెళ్ళిసందD " మూవీ రూపొందనుంది. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ "పెళ్ళిసందడి "(1996 ) మూవీకి రీమేక్ గా ఈ మూవీ రూపొందనుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
'పెళ్లి సందడి' కోసం శ్రీకాంత్ తనయుడు
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాకర్ కాంబినేషన్ లో పాతికేళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందడి సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి.. ఈ సినిమా శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ని తీసుకువచ్చింది.