ట్యాగ్ · 170 కథనాలు · పేజీ 9
'రాధే శ్యామ్' షూట్ కోసం వెయిటింగ్

ప్రభాస్ కమిట్ మెంట్ లెవల్స్ పీక్స్
ప్రభాస్ కు బ్రదర్ గా అథర్వా మురళి..?

షూటింగ్ కు రెడీ అయిపోయిన బుట్టబొమ్మ
ఓపికతో ఉండండి.. టీజర్స్, ట్రైలర్స్ అన్నీ వస్తాయి
"రాధే శ్యామ్ " మూవీ లో ఎయిర్ టెల్ బ్యూటీ ?
ఛలో ఇటలీ - రాధే శ్యామ్ నెక్స్ట్ షెడ్యూల్
కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాల షూటింగ్‌లు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. నిన్న మొన్నటివరకూ ఇక్కడే షూటింగ్ స్టార్ట్ చేయగా ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ లు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాధేశ్యామ్ టీం కూడా ఇటలీకి పయనమైనట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ ముందు అక్కడ కొంత చిత్రీకరణ జరుపుకుంది రాధేశ్యామ్ సినిమా. కరోనా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక మొన్నటి వరకూ విదేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో అక్కడ చాలా వరకూ షూటింగ్‌లకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు విదేశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో వెంటనే రాధేశ్యామ్ షూటింగ్ కోసం వెళ్లిపోయారు. వీలైనంత తొందరగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేసి తిరిగి…
'రాధే శ్యామ్' షూట్ కోసం వెయిటింగ్
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేస్‌లో ముందు ఉంది పూజా హెగ్డే. అల వైకుంఠపురములో, గద్దలకొండ గణేష్, మహర్షి, అరవింద సమేత ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో సూపర్ ఫామ్ లోకి వచ్చేసింది. దాదాపు స్టార్ హీరోలందరితో ఈ బుట్టబొమ్మ జోడీ కట్టేసింది. ప్రస్తుతం అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఇప్పటికే మొదలైంది. పూజా హెగ్డే, అఖిల్ షూట్ లో పాల్గొంటున్నారు.

ప్రభాస్ కమిట్ మెంట్ లెవల్స్ పీక్స్
'జిల్' ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో రాధే శ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. 6.3 మిలియన్ల ట్వీట్స్ తో ఇంతకు ముందున్న ట్విట్టర్ రికార్డులను చెరిపేసింది.
ప్రభాస్ కు బ్రదర్ గా అథర్వా మురళి..?
విభిన్నమైన పాత్రలతో తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అథర్వా మురళి. ఈ మధ్య విడుదలైన వరుణ్‌తేజ్ ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో కీలక పాత్ర చేసి ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక తమిళ్ సినిమాల్లో చేస్తూనే తెలుగులో కూడా అవకాశాలు కొట్టేస్తున్నాడు. దీనిలో భాగంగానే ఇప్పుడు ఈ యంగ్ హీరో మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తుంది.

షూటింగ్ కు రెడీ అయిపోయిన బుట్టబొమ్మ
మొత్తానికి ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలు కూడా ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి షూటింగ్ లను ప్రారంభిస్తున్నాయి. ఇన్ని రోజులు ప్రభుత్యాలు అనుమతులు ఇచ్చినా కరోనాకు భయపడి షూటింగ్ లను జరపలేదు. అయితే ఇప్పట్లో కరోనాకు అంతం లేదని భావించి.. తక్కువ మంది స్టాఫ్ తో కరోనాకు తగిన జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ లను జరపడానికి రెడీ అయిపోతున్నారు. ఒక పది. పదిహేను రోజుల పెండింగ్ వున్న సినిమాలు అయితే ఇప్పటికే షూటింగ్ ను మొదలు పెట్టి మిగిలిన షూట్ ను పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే హీరోయిన్స్ అందరూ చిన్నగా హైదరాబాద్ లో వాలిపోతున్నారు. దీనిలో భాగంగానే ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే కూడా వచ్చేసింది.
ఓపికతో ఉండండి.. టీజర్స్, ట్రైలర్స్ అన్నీ వస్తాయి
జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులు యూరప్ లో షూటింగ్ లు జరుపుకోగా కరోనా వల్ల ఇక్కడకు వచ్చేసారు. మళ్ళీ షూటింగ్ ను సెప్టెంబర్ సెకండ్ వీక్ నుండి మొదలుకానుందని ఇటీవలే తెలియచేసారు. ఇక ఈ సినిమా అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూడగా.. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇదిలా ఉండగా రాధా కృష్ణ తన ట్విట్టర్ ద్వారా అభిమానులను ఈ సినిమా గురించి ముఖ్యమైన ప్రశ్నలు అడగమని చెప్పగా ఇంకా అభిమానులు పలు ప్రశ్నలు అడుగగా వాటిలో కొన్నిటికి రాధా కృష్ణ సమాధానాలు తెలిపారు. ఆ సమాధానాలు ఇవే..
"రాధే శ్యామ్ " ఫస్ట్ లుక్ రికార్డ్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా గోపీకృష్ణా మూవీస్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , తమిళ , హిందీ భాషలలో పీరియాడిక్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్ మలయాళ భాషలో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రాధేశ్యామ్ " మూవీ జార్జియా దేశంలోని పలు బ్యూటిఫుల్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణం గా షూటింగ్ వాయిదా పడింది.
'రాధే శ్యామ్' - కొత్త రికార్డ్స్ స్టార్ట్ చేసిన ప్రభాస్..!
ఒక్కోసారి రావడం లేట్ అవ్వోచ్చేమో కానీ.. రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నాడు ప్రభాస్. అలా ఫస్ట్ లుక్, టైటిల్ తో వచ్చాడో లేదో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతూ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే పనిలో పడ్డాడు. రాధే శ్యామ్ టైటిల్ ఫిక్స్ చేసిన చిత్ర బృందం, ప్రభాస్ మరియు పూజా హెగ్డేల రొమాంటిక్ లుక్ విడుదల చేయగా ఆ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఫ్యాన్స్ అయితే ఈ 'రాధే శ్యామ్' హ్యాష్ ట్యాగ్ ను ఒక రేంజ్ లో ట్రెండ్ చేశారు. ట్విట్టర్ మొత్తాన్ని 'రాధే శ్యామ్' అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి మోత మోగించారు. దీంతో ఈ ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సింగిల్ హ్యాష్‌ట్యాగ్‌తో 3.8…
"రాధే శ్యామ్ " మూవీ లో ఎయిర్ టెల్ బ్యూటీ ?
"కట్టీ బట్టీ " బాలీవుడ్ మూవీ లో చిన్న పాత్రలో నటించిన సాషా ఎయిర్ టెల్ యాడ్ లో నటించి ఓవర్ నైట్ సెన్సేషన్ క్రియేట్ చేసి జాతీయ స్థాయి లో గుర్తింపు పొందారు. కాన్ఫిడెంట్ తో , స్టైలిష్ గా ఉండే సాషా "ఆపరేషన్ గోల్డ్ ఫిష్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సాషా ఇప్పుడు ప్రభాస్ మూవీ " రాధే శ్యామ్ " కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
'ప్రభాస్20' ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్..!
ఎప్పుడైతే ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేస్తున్నామని ప్రభాస్20 టీమ్ చెప్పారో ఆ రోజు నుండే అభిమానులు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు జులై 10.. 10 గంటలు అవుతుందా... ఎప్పుడు ఫస్ట్ లుక్ చూసేద్దామా అనిఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చేసింది. ప్రభాస్ 20 సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను యూవీ క్రియేషన్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఇక ఎప్పటినుండో అనుకున్నట్టే ఈ సినిమాకు 'రాధే శ్యామ్' అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు.