
ట్యాగ్ · 111 కథనాలు · పేజీ 6


సలార్, కె.జి.యఫ్2 ఒకే చోట
"సలార్ " మూవీ లేటెస్ట్ అప్ డేట్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ?
'సలార్' రిలీజ్ డేట్ ఫిక్స్


"సలార్ "మూవీ ఆడిషన్స్ కు విశేష స్పందన
కె.జి.యఫ్ నిర్మాత మరో భారీ ప్లాన్

పవన్ క్రేజ్.. ఎన్టీఆర్ నటన ఎవరికీ సాధ్యం కాదు..!

"సలార్ "మూవీ కై భారీ సెట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతిహాసన్ జంటగా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. మధు గురుస్వామి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు . ప్రభాస్ హీరో గా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ "జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం “ఆదిపురుష్ “మూవీ తో పాటు “సలార్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

సలార్, కె.జి.యఫ్2 ఒకే చోట
మోస్ట్ అవైటింగ్ ఇండియన్ సినిమాల్లో కె.జి.యఫ్2 అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా వస్తున్న ఈసినిమాపై మామూలు అంచనాలు లేవు. పార్ట్ 1 సంచలన విజయంతో దాని ఎఫెక్ట్ పార్ట్ 2 పై కూడా పడింది. దీంతో ప్రశాంత్ నీల్ కూడా చాలా జాగ్రత్తగా సినిమా అవుట్ ఫుట్ కోసం కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే ప్రశాంత్ నీల్ మరోవైపు సలార్ షూటింగ్ పనులు కూడా చూసుకుంటున్నాడు. ఇక ఇన్ని రోజులు ఈసినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదని నిరాశ పడుతున్న ఫ్యాన్స్ కు తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చాడు.
"సలార్ " మూవీ లేటెస్ట్ అప్ డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ ” మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్ “, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్ “, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ కి హీరో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. “ఆదిపురుష్”, “సలార్ “మూవీస్ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందే అన్ని మూవీస్ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం.
"సలార్" మూవీ లో శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హోం బలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కెజియఫ్ చాప్టర్ 1″మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్” షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ మైనింగ్ ఏరియా లో భారీ సెట్స్ లో చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు షూటింగ్ రెండవ షెడ్యూల్ కూడా ఒక కొండ ప్రాంతం లో దర్శకుడు ప్లాన్ చేశారు . యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న "సలార్ "మూవీ లో యాక్షన్ సీన్స్ హైలైట్ కానున్నాయి. శృతి హాసన్ కథానాయిక. రవి సంగీతం అందిస్తున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ?
బ్లాక్ బస్టర్ "కెజిఫ్ చాప్టర్ 1" కన్నడ మూవీ తో దేశవ్యాప్తం గా గుర్తింపు పొందిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ మూవీ కి సీక్వెల్ "కెజిఫ్ చాప్టర్ 2 " మూవీ ని తెరకెక్కించారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ "సలార్ "ను తెరకెక్కిస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ నరేట్ చేసి ప్రశాంత్ ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ పొందారు. నిన్న (9వ తేదీ ) అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ ఆఫీస్ లో ప్రశాంత్ నీల్ కలిశారు.
'సలార్' రిలీజ్ డేట్ ఫిక్స్
ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ తో ఒక సినిమా, తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలు చేస్తున్నాడు. ఒక్క నాగ్ అశ్విన్ తో సినిమా తప్పంచి మిగిలిన మూడు సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

'ఎన్టీఆర్' తో ప్రశాంత్ నీల్ సినిమా - కన్ఫామ్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత
'ఎన్టీఆర్' తో ప్రశాంత్ నీల్ సినిమా.. ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందా..ఉండదా అనేది గతకొంత కాలంగా నడుస్తున్న సస్పెన్స్. కె.జి.యఫ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేస్తాడని.. ఎన్టీఆర్ చేస్తాడని ఆ మధ్య వార్తలు రాగా.. ఆ వార్తలకు క్లారిటీ ఇస్తూ ప్రభాస్ తో సినిమా కన్ఫామ్ చేసాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నారు ప్రభాస్, ప్రశాంత్ నీల్. ఇక ఇదిలా ఉండగా మరోసారి ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమాపై చర్చలు మొదలయ్యాయి. దానికి కారణం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలే.

"సలార్ "మూవీ ఆడిషన్స్ కు విశేష స్పందన
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1"మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "సలార్" మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. "సలార్" మూవీలో న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికై దర్శక , నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. హెదరాబాద్ , చెన్నై , బెంగళూరు లలో ఆడిషన్స్ నిర్వహించి కొత్త టాలెంట్ కు అవకాశం కల్పించడానికై దర్శకుడు ప్రకటించారు. ఏ వయస్సు వారైనా , ఏ భాష వారైనా ఆడిషన్స్ లో పాల్గొన వచ్చునని తెలిపారు.
కె.జి.యఫ్ నిర్మాత మరో భారీ ప్లాన్
కె.జి.యఫ్ చాప్టర్ 1’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఇదే సీక్వెల్ లో ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ సినిమా కూడా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాపై కూడా ఎలాంటి అంచనాలున్నాయో తెలుసు. అందరి అంచనాలను మించేలా సినిమాను కూడా అలాగే రూపొందిస్తున్నారు. కరోనా వల్ల షూట్ కు కొన్ని నెలలుగా బ్రేక్ పడగా గత నెలలోనే మళ్లీ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. దాదాపు చివరిదశకు చేరుకుంది.

నెక్స్ట్ ప్రభాసా? ఎన్టీఆరా?.. ప్రశాంత్ నీల్ క్లారిటీ
జూనియర్ ఎన్టీఆర్ 'కేజీఎఫ్' చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ రోజుకో వార్త మాత్రం వస్తూనే ఉంది. అంతేకాదు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పెద్ద ఎత్తున డేట్స్ కూడా ఇచ్చినట్టుకూడా వార్తలు వచ్చాయి. ఇక ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమా పై ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్ తో కూడా సినిమా చేస్తున్నట్టు ఆ మధ్య వార్తలు జోరుగా వినిపించాయి. కానీ ఆ విషయంలో కూడా క్లారిటీ రాలేదు.

పవన్ క్రేజ్.. ఎన్టీఆర్ నటన ఎవరికీ సాధ్యం కాదు..!
టాలీవుడ్ హీరోల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఎంతమంది హీరోలు ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ మాత్రం సెపరేట్. అలాగే ఎన్టీఆర్ నటన కూడా డిఫరెంట్. ఇక ఈ విషయాన్నే చెబుతూ.. వీరిద్దరిపై ప్రశంసలు కురిపించారు కె.జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మరొకరికి సాధ్యం కాదని .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన మరొకరు భర్తీ చేయలేనిది అని ప్రశంశించారు. రాజమౌళి మిగిలినవారందరికి సరికొత్త దారి చూపించే దర్శకుడు అని.. తాను ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎంతో ఆసక్తి... ఎదురుచూస్తున్నట్లు ప్రశాంత్ నీల్…