జూనియర్ ఎన్టీఆర్ ‘కేజీఎఫ్’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ రోజుకో వార్త మాత్రం వస్తూనే ఉంది. అంతేకాదు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పెద్ద ఎత్తున డేట్స్ కూడా ఇచ్చినట్టుకూడా వార్తలు వచ్చాయి. ఇక ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమా పై ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్ తో కూడా సినిమా చేస్తున్నట్టు ఆ మధ్య వార్తలు జోరుగా వినిపించాయి. కానీ ఆ విషయంలో కూడా క్లారిటీ రాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ విషయంపై ఎంతో మంది అభిమానుల్లో డౌట్స్ ఉండగా ఒక అభిమాని సోషల్ మీడియా ద్వారా ప్రశాంత్ నీల్ ను క్లారిటీ ఇవ్వమని నెక్స్ట్ సినిమాను ప్రశాంత్ తర్వాత సినిమా ఎన్టీఆర్ తోనా ప్రభాస్ తోనా అని అడిగారు. దానికి ప్రశాంత్ నీల్ ప్రస్తుతం నా ఫోకస్ అంతా కె.జి.యఫ్2 సినిమాపైనే ఉంది.. అది అయిపోయిన తర్వాతే తర్వాత సినిమా గురించి అనౌన్స్ చేస్తా అని చెప్పాడు. మరి అప్పటివరకూ ఈ కన్ఫ్యూషన్ లో ఉండాల్సిందే .
Future projects will be announced only after my responsibility towards #KGFChapter2 ends🙏
Thank you!!— Prashanth Neel (@prashanth_neel) October 9, 2020
కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కె.జి.ఎఫ్ సినిమా మాములు రికార్డులు సృష్టించలేదు. తెలుగు, కన్నడ, హిందీ లో ఈ సినిమా స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. ఇక ‘కె.జి.ఎఫ్’ బ్లాక్ బస్టర్ కొట్టడంతో కె.జి.యఫ్2 పై కూడా అదే రేంజ్ లో అంచనాలు పెంచుకున్నారు అభిమానులు. ఈ సినిమాలో యష్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా… బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























