కాస్ట్యూమ్స్ డ్రామాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌?

Power Star Pawan Kalyan To Play Thief In His Upcoming Movie

`అజ్ఞాత‌వాసి` అనంత‌రం రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్… స్వ‌ల్ప విరామం త‌రువాత మ‌ళ్ళీ సినిమాల్లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలుత `పింక్` రీమేక్ లో న‌టించ‌నున్న ప‌వ‌న్… అనంత‌రం ఓ కాస్ట్యూమ్స్ డ్రామాలో న‌టించ‌బోతున్న‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైవిధ్య‌భ‌రిత చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కించనున్న ఈ కాస్ట్యూమ్స్ డ్రామా… మొఘ‌లాయిల కాలానికి సంబంధించిన క‌థ‌తో రూపొందుతుంద‌ని… మ‌హ్మ‌దీయుల ప‌రిపాల‌నా కాలం, అప్ప‌టి ప‌రిస్థితులను ఆవిష్క‌రిస్తూ ఈ సినిమా సాగుతుంద‌ని స‌మాచారం. అంతేకాదు… ఈ పిరియాడిక్ డ్రామాలో ప‌వ‌న్ ఓ దొంగ పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్న‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. టైటిల్ కూడా క‌థానాయ‌కుడి పాత్ర‌ను దృష్టిలో పెట్టుకునే డిజైన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2020 ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే, ఈ భారీ బ‌డ్జెట్ మూవీ గురించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 19 =