
ట్యాగ్ · 10 కథనాలు


రాబిన్ హుడ్ లా వస్తున్న నితిన్

2 దశాబ్దాల జర్నీ.. నితిన్ ఎమోషనల్ మెసేజ్..!

హీరో నితిన్ న్యూ మూవీ ప్రారంభం

ఆగస్ట్ లో హీరో నితిన్ కొత్త చిత్రం ప్రారంభం

కలిసొచ్చిన దర్శకుడితో నితిన్ చిత్రం?

నితిన్ అప్ కమింగ్ మూవీస్ ఇవే
హీరో నితిన్ నుండి ఇక మీదట వచ్చే సినిమాలు మినిమం గ్యారెంటీ అనేలా వున్నాయి.భీష్మ తరువాత నితిన్ కు అలాంటి సాలిడ్ హిట్ పడలేదు.ఈనెల 28 తను రాబిన్ హుడ్ తో రానున్నాడు.ఈసినిమా షూర్ షాట్ హిట్ అయ్యేలానే కనిపిస్తుంది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. నితిన్ కూడా ఇంతకుముందు ఎప్పుడు లేనివిధంగా ప్రమోట్ చేస్తూ ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.

రాబిన్ హుడ్ లా వస్తున్న నితిన్
ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవ్వడం అనేది కామన్. ఇక ఇప్పుడు అలాంటి కాంబినేషనే మరోసారి రిపీట్ కాబోతుంది. వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది.

2 దశాబ్దాల జర్నీ.. నితిన్ ఎమోషనల్ మెసేజ్..!
జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో నితిన్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత దిల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టి మంచి ఫామ్ లోకి వచ్చాడు. అయితే ఆ తరువాత సంబరం. శ్రీ ఆంజనేయం లాంటి సినిమాలు చేసి ఫ్లాప్స్ ను మూట గట్టుకున్నాడు.అలాంటి సమయంలోనే రాజమౌళి తో చేసే అవకాశం దక్కించుకున్నాడు. సై సినిమాతో హిట్ కొట్టి మళ్లీ పుంజుకున్నాడు. అయితే అది కూడా ఎన్నో రోజులు నిలువలేదు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు డజనుకు పైగా సినిమాలు నితిన్ కు పరాజయాన్ని అందించాయి. అయినా కూడా ఎలాంటి నిరాశ చెందకుండా ధైర్యంతో సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చాడు.

హీరో నితిన్ న్యూ మూవీ ప్రారంభం
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఎమ్ ఎస్ రాజశేఖర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "మాచర్ల నియోజకవర్గం "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కృతిశెట్టి , క్యాథరిన్ కథానాయికలు.. ఏప్రిల్ 3 వ తేదీ నితిన్ హీరోగా తెరకెక్కే కొత్త మూవీ ప్రారంభం అయ్యింది.

ఆగస్ట్ లో హీరో నితిన్ కొత్త చిత్రం ప్రారంభం
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “మాస్ట్రో ” మూవీ మేజర్ షూటింగ్ షెడ్యూల్ గోవా లో జరుగుతుండగా కరోనా సెకండ్ వేవ్ కారణం గా షూటింగ్ నిలిచిపోయింది. దర్శకుడు మేర్లపాక గాంధీ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. “మాస్ట్రో ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉందనీ , 7 రోజుల షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉందనీ చెప్పారు.

ముహూర్తం ఫిక్స్... అనుకున్న డేట్ కే నితిన్ వివాహం..!
మొత్తానికి నితిన్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. కరోనా కారణంగా హీరో నితిన్ పెళ్లి వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మార్లు వాయిదా వేశారు. ఫిబ్రవరిలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత చాలా గ్రాండ్‌గా ఈ పెళ్లిని జరపాలని ఇరు కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల కుదర్లేదు. అయితే మరీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నారు ఇరు కుటుంబసభ్యలు. ఈ నేపథ్యంలోనే జులై 26న వీరిద్దరి వివాహం జరగనున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఫైనల్ గా అధికారికంగా కూడా ప్రకటించారు.

3 మిలియన్ స్ట్రాంగ్.. నా ఫాలోవర్స్ కి పెద్ద థ్యాంక్స్..!
సెలెబ్రటీస్ అందరూ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గానే ఉంటారు. ఒకప్పుడు అంటే ఏదో కొంతమంది మాత్రమే సోషల్ మీడియాల్లో యాక్టీవ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇటీవల మహేష్ బాబు, ప్రభాస్, పూజా హెగ్డే, విజయదేవరకొండ మిలియన్స్ లలో అభిమానులను సొంతం చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేయగా.. ఇక ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నితిన్ కూడా ట్విటర్‌లో 3 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.
`ఛల్ మోహన్ రంగ` దర్శకుడితో నితిన్ `పవర్ పేట`?
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. `భీష్మ`, `రంగ్ దే`, `చదరంగం` (చంద్రశేఖర్ యేలేటి ఫిల్మ్) పేర్లతో రూపొందుతున్న సదరు మూడు సినిమాలు చిత్రీకరణ తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో... `ఛల్ మోహన్ రంగ` దర్శకుడు కృష్ణ చైతన్యతో కొత్త చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు నితిన్.
భాగ్యనగరంలో నితిన్ - చంద్రశేఖర్ యేలేటి చిత్రం
యువ కథానాయకుడు నితిన్, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ నాయికలుగా నటిస్తున్న ఈ సినిమాని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో నితిన్ చెస్ ప్లేయర్ కనిపించనుండగా... రకుల్ క్రిమినల్ లాయర్ గానూ, ప్రియా ప్రకాష్ హనీ ట్రాపర్ గానూ దర్శనమివ్వబోతున్నారని సమాచారం.

కలిసొచ్చిన దర్శకుడితో నితిన్ చిత్రం?
యువ కథానాయకుడు నితిన్‌కి ప్రేమకథా చిత్రాలు బాగా కలిసొచ్చాయి. అందుకే... కెరీర్‌లో సింహభాగం విజయాలను ఆ తరహా సినిమాలతోనే అందుకున్నాడు నితిన్. అలాంటి చిత్రాల్లో... `గుండె జారి గల్లంతయ్యిందే` ఒకటి. ఆరేళ్ళ క్రితం వేసవి సెలవుల్లో విడుదలైన ఈ సినిమా... బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. అలాంటి ఈ లవబుల్ ఫిల్మ్‌తోనే దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు విజయ్ కుమార్ కొండా. అయితే... ఫస్ట్ ఫిల్మ్ తో మెప్పించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి.. రెండో చిత్రం `ఒక లైలా కోసం` మాత్రం అంతగా వర్కవుట్ కాలేదు.