
ట్యాగ్ · 11 కథనాలు

హీరో నాని ఎదురు చూపులు
సుకుమార్ శిష్యుడితో నాని చిత్రం?
కామెడీ థ్రిల్లర్ మూవీ లో హీరో నాని
"V" దర్శకుడికి నాని బర్త్ డే శుభాకాంక్షలు
"హిట్ " మూవీ దర్శకుడితో హీరో నాని మూవీ ?
ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ లో నేచురల్ స్టార్?

ప్రయోగాత్మక చిత్రం లో నాని ?

కామిక్ రివెంజ్ డ్రామా

‘వ్యూహం’లో నాని పాత్ర వివరాలు!?

`జెర్సీ`లో నాని స్పెషల్ టచ్...

దసరా పై మీ ప్రేమకు థ్యంక్స్
కెరీర్ ప్రారంభంనుండి విభిన్నమైన పాత్రలు చేసే హీరోల్లో న్యాచురల్ స్టార్ హీరో నాని కూడా ముందుంటాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటి వరకూ పక్కింటి కుర్రాడి లాంటి పాత్రల్లో అలానే లవర్ బాయ్ పాత్రల్లో ఇక ఓ మాదిరి మాస్ పాత్రల్లో నచించి మెప్పించిన నాని ఈసినిమాతో తన కూడా ఊర మాస్ యాంగిల్ ఉందని నిరూపించడానికి దసరా సనిమాతో వచ్చేస్తున్నాడు. ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. మొదటి సారి ఈ రేంజ్ మాస్…
హీరో నాని ఎదురు చూపులు
కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ బంద్ అయ్యి చిత్ర పరిశ్రమ కష్ట నష్టాలకు గురి అయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణం గా 2నెలల 15 రోజులు సినీ సెలబ్రిటీస్ ఇంటికే పరిమితం అయ్యారు. టాలీవుడ్ లో బిజీ హీరోలలో ఒకరైన నాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ రిలీజ్ కరోనా కారణం గా వాయిదా పడింది. పలు చిత్రాలకు కమిట్ అయినా హీరో నాని షూటింగ్స్ ప్రారంభానికై ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
సుకుమార్ శిష్యుడితో నాని చిత్రం?
కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాడు నేచురల్ స్టార్ నాని. రమేష్ వర్మ, సత్య బెల్లంకొండ, నందినీ రెడ్డి, అంజన, నాగ్ అశ్విన్, శివ నిర్వాణ.. ఇలా పలువురు నూతన దర్శకులతో సినిమాలు చేశాడు నాని. వీటిలో సింహభాగం విజయం సాధించాయి. ఈ క్రమంలోనే.. తాజాగా మరో న్యూ టాలెంట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నాని.
కామెడీ థ్రిల్లర్ మూవీ లో హీరో నాని
హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" కరోనా మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడింది. హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.
"V" దర్శకుడికి నాని బర్త్ డే శుభాకాంక్షలు
దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి సూపర్ హిట్ "అష్టా చెమ్మా" మూవీ తో నాని ని టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేశారు. వారిద్దరి కాంబినేషన్ లో రూపొందిన "జెంటిల్ మన్ " మూవీ ఘనవిజయం సాధించింది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ యాక్షన్ థ్రిల్లర్ "V" కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది.
"హిట్ " మూవీ దర్శకుడితో హీరో నాని మూవీ ?
ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సూపర్ హిట్ "అష్టా చెమ్మా " మూవీతో నాని ని హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు మోహన్ కృష్ణ , నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన "V" మూవీ లో నెగటివ్ పాత్ర లో పరిచయం చేయడం విశేషం. నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్నారు.
ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ లో నేచురల్ స్టార్?
నేచురల్ స్టార్ నాని.. ఇప్పటివరకు పోలీస్ పాత్రలో కనిపించిన సందర్భం లేదు. త్వరలోనే ఆ ముచ్చట తీరనుందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. `నిన్ను కోరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత నాని, దర్శకుడు శివ నిర్వాణ మరోసారి జట్టుకట్టిన సంగతి తెలిసిందే. `టక్ జగదీష్` పేరుతో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కోసమే నాని ఖాకీ ధరించనున్నాడట. జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ సందడి చేయనున్నారు. థమన్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలైలో విడుదల కానుందని సమాచారం.

ప్రయోగాత్మక చిత్రం లో నాని ?
విభిన్న కథా చిత్రాలు ఎంపిక చేసుకుని విజయపథం లో దూసుకుపోతున్న న హీరో నాని ఇప్పుడు ఒక ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని నెగటివ్ రోల్ లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్" మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

కామిక్ రివెంజ్ డ్రామా
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన కామిక్ రివెంజ్ డ్రామా NANI'S గ్యాంగ్ లీడర్ మూవీ రేపు (13వ తేదీ) రిలీజ్ కానుంది. హీరో కార్తికేయ విలన్ గా నటించడం ఆసక్తికర విషయం. సీనియర్ నటి లక్ష్మి, శరణ్య, ప్రియాంక అరుళ్ మోహన్, శ్రీయా రెడ్డి, ప్రాణ్య లేడీస్ గ్యాంగ్ గా నటించగా నాని గ్యాంగ్ లీడర్ గా నటించారు. హీరో నాని సపోర్ట్ తో ఒకరితో ఒకరికి రిలేషన్ లేని ఈ గ్యాంగ్ ప్రతినాయకుడు (కార్తికేయ )పై ప్రతీకారం తీర్చుకొనే కథ తో ఈ మూవీ రూపొందింది.

‘వ్యూహం’లో నాని పాత్ర వివరాలు!?
వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న యువ కథానాయకుడు నాని. ఒకవైపు తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘జెర్సీ’ ఈ నెల 19న విడుదలకు సిద్ధమవుతుండగా… మరోవైపు దర్శకుడు విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘గ్యాంగ్‌లీడర్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడీ నేచురల్ స్టార్. అంతేకాదు… ఈ సినిమా సెట్స్ పై ఉండగానే… తన తొలి దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు నాని.

`జెర్సీ`లో నాని స్పెషల్ టచ్...
నేచురల్ స్టార్ నాని అప్‌కమింగ్ ప్రాజెక్ట్ `జెర్సీ` విడుదలకు ముస్తాబవుతోంది. వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో ఈ సినిమా తెరపైకి రానుంది. `మళ్ళీ రావా` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో నాని... మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ అర్జున్‌గా కనిపించనున్నాడు. అంతేకాదు... తన వయసుకు మించిన పాత్రలో తొలిసారిగా దర్శనమివ్వనున్నాడు ఈ నేచురల్ స్టార్.