
ట్యాగ్ · 13 కథనాలు


హీరో నాని అసలు పేరు
నాని 'V' షూటింగ్ పూర్తి

#Nani26 రేపు రిలీజ్ చేయనున్న టైటిల్

డిసెంబర్ నుంచి నాని, శివ చిత్రం?

నాని కోసం రెండు ఆసక్తికరమైన కథలు

హీరో నాని, స్వప్న దత్ నిర్మాతలుగా కామెడీ మూవీ

నానితో ‘మలుపు’ డైరెక్టర్?

నాని 25... టైటిల్ అదేనా?

నాని... ఆరోసారి

నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో నాని?

హీరో నాని తో మరో సారి కీర్తి సురేష్

పాన్ ఇండియా మూవీపై హీరో నాని అభిప్రాయం
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరో నాని ప్రస్తుతం "అంటే .. సుందరానికీ ! మూవీ లో నటిస్తున్నారు.

హీరో నాని అసలు పేరు
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో రూపొందిన “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా నేపథ్యంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ షూటింగ్ ను హీరో నాని కంప్లీట్ చేశారు. హీరో నాని ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న “అంటే .. సుందరానికీ !” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. నాని హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
నాని 'V' షూటింగ్ పూర్తి
మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'V'. గతకొద్ది రోజుల ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సుధీర్ బాబు , నివేత థామస్, అదితి రావు హైదరి ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీన రిలీజ్ కానుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ నిన్నటి తో పూర్తి చేసుకుంది. ఈ చిత్ర షూటింగ్ నిన్నటితో మొత్తం పూర్తయిందని నాని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
`మా అన్నయ్య`, `సంక్రాంతి` తరహాలో నాని చిత్రం?
`నిన్ను కోరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా `టక్ జగదీష్`. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ నాయికలుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీకి ఎంటర్ టైనర్ కి థమన్ బాణీలను అందిస్తున్నాడు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

#Nani26 రేపు రిలీజ్ చేయనున్న టైటిల్
మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ V మూవీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. సుధీర్ బాబు , నివేత థామస్, అదితి రావు హైదరి ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీన రిలీజ్ కానుంది.

డిసెంబర్ నుంచి నాని, శివ చిత్రం?
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ శుక్రవారం (సెప్టెంబర్ 13) జనాల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ రివెంజ్ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్టోరియల్ 'వి'లో ప్రతినాయకుడిగా నటిస్తున్న నాని... ఆ సినిమా చిత్రీకరణ దశలో ఉండగనే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

నాని కోసం రెండు ఆసక్తికరమైన కథలు
ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం యువ కథానాయకుడు నాని శైలి. ప్రస్తుతం ఒకవైపు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో నటిస్తూనే… మరోవైపు తనని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ చిత్రం చేస్తున్నాడు ఈ నేచురల్ స్టార్. అంతేకాదు.. విలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో దర్శనమివ్వనున్నాడు. ఇదిలా ఉంటే… ప్రస్తుతం నాని కాల్షీట్స్ కోసం రెండు ఆసక్తికరమైన కథలు ఎదురు చూస్తున్నాయని టాక్.

హీరో నాని, స్వప్న దత్ నిర్మాతలుగా కామెడీ మూవీ
జెర్సీ మూవీ విజయోత్సాహం లో ఉన్న హీరో నాని, వైజయంతి మూవీస్ అశ్వనీదత్ తనయ, నిర్మాత స్వప్న దత్ సంయుక్తంగా ఒక కామెడీ ఎంటర్ టైనర్ మూవీ ని నిర్మించనున్నారు. పిట్టగోడ మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీ లో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, షాలిని పాండే ప్రధాన తారాగణం. మూవీ మొత్తం 4 ప్రధాన పాత్రల మధ్య జరుగుతుందని సమాచారం.

నానితో ‘మలుపు’ డైరెక్టర్?
ఆ మధ్య డబుల్ హ్యాట్రిక్ విజయాలతో అలరించిన నేచురల్ స్టార్ నాని… గత ఏడాది మాత్రం ఆశించిన విజయాలను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో… వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అంతేకాదు… తొమ్మిది నెలల గ్యాప్‌లో ముచ్చటగా మూడు చిత్రాలతో సందడి చేయనున్నాడు నాని.

నాని 25... టైటిల్ అదేనా?
నేచురల్ స్టార్ నాని 25 చిత్రాల మైలురాయికి చేరువవుతున్నాడు. ఈ వేసవిలో విడుదల కానున్న `జెర్సీ` నాని 23వ సినిమా కాగా... సెట్స్ పైనున్న `గ్యాంగ్ లీడర్` 24వ చిత్రం. ఇక తన తొలి చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటించబోతున్న కొత్త సినిమా... సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ (25వ చిత్రం)గా తెరకెక్కనుంది. ఇందులో నానిది పూర్తిస్థాయి కథానాయకుడి పాత్ర కాదు... ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపిస్తాడని సమాచారం. హీరోగా సుధీర్ బాబు నటిస్తుండగా... కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నాని దర్శనమివ్వనున్నాడని టాక్.

నాని... ఆరోసారి
పాత సినిమాల టైటిల్స్‌తో కొత్త చిత్రాలు సందడి చేయడం తెలుగు పరిశ్రమలో కొత్తేమీ కాదు. ప్రతీ సంవత్సరం ఈ తరహా టైటిల్స్‌తో చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు ఈ జాబితాలోనే మరో కొత్త చిత్రం... పాత టైటిల్‌తో సందడి చేయనుంది. అదే... `గ్యాంగ్ లీడర్`.

నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో నాని?
పక్కింటి అబ్బాయి తరహా పాత్రలతో కుటుంబ ప్రేక్షకులకు చేరువైన యువ కథానాయకుడు నాని. గత కొంతకాలంగా ట్రాక్ మార్చే ప్రయత్నం చేస్తున్నాడీ నేచురల్ స్టార్. గత ఏడాది విడుదలైన `కృష్ణార్జున యుద్దం`లో రాక్ స్టార్‌గానూ... `దేవదాస్`లో డాక్టర్‌గానూ కనిపించిన నాని... ప్రస్తుతం `జెర్సీ`లో మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ అర్జున్ పాత్రలో కనిపించనున్నాడు.

హీరో నాని తో మరో సారి కీర్తి సురేష్
మహానటి మూవీ ఘనవిజయం తో అత్యంత ప్రతిభ గల నటిగా పేరుపొందిన కీర్తి సురేష్ నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఎంపిక చేసుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ నేను లోకల్ మూవీ లో హీరో నాని తో జతకట్టిన కీర్తి సురేష్ మరో సారి నాని తో జతకట్టనునున్నారని సమాచారం.