డిసెంబర్ నుంచి నాని, శివ చిత్రం?

Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Nani And Shiva Nirvana Project To Begin From December, Nani And Shiva Nirvana Project, Nani And Shiva Nirvana Project Latest Updates, Nani Next Project To Start From December, Nani Latest Movie News, Nani Next project Details

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ శుక్రవారం (సెప్టెంబర్ 13) జనాల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ రివెంజ్ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్టోరియల్ ‘వి’లో ప్రతినాయకుడిగా నటిస్తున్న నాని… ఆ సినిమా చిత్రీకరణ దశలో ఉండగనే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇందులో నాని కథానాయకుడుగా నటిస్తాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం… షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… డిసెంబర్ నుండి పట్టాలెక్కనుందని తెలిసింది. త్వరలోనే నాని, శివ కాంబినేషన్ మూవీపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

‘నిన్ను కోరి’(2017) విడుదలైన రెండేళ్ళ తర్వాత నాని, శివ కాంబినేషన్ రిపీట్ కానుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి… సెకండ్ వెంచర్ తోనూ నాని, శివ… విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =