
ట్యాగ్ · 111 కథనాలు · పేజీ 6


'హిట్ 2' నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

"సలార్ " మూవీ లో "ఖిలాడి " బ్యూటీ

టాలీవుడ్ లో బిజీగా మీనాక్షి చౌదరి

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ హవా

లక్కీ బ్యూటీ మీనాక్షి చౌదరి
హిట్ 2 లో హీరోయిన్ గా 'మీనాక్షి చౌదరి'..!
"ఖిలాడి " ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

హిట్2 రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ లో ఉన్న విభిన్నమైన నటుల్లో అడివి శేష్ కూడా ఒకరు. తన సినిమాలతో ఎప్పటికప్పుడు అది నిరూపిస్తూనే ఉన్నారు. ఇక రీసెంట్ గా మేజర్ సినిమాతో మరో మెట్టు ఎక్కేశాడు అడివి శేష్. ఇక ఇప్పుడు తన తరువాత సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం తను చేస్తున్నసినిమా హిట్ 2. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా హిట్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. ఇక ఈసినిమాకు ఇప్పుజు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక మొదటి పార్ట్ లో విశ్వక్ సేన్ నటించగా హిట్ 2 లో అడివి శేష్ నటిస్తున్నాడు. ఈసారి ‘హిట్ 2’ సినిమా ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే…

రవితేజ 'ఖిలాడి' రివ్యూ.. యాక్షన్ ప్యాక్డ్ మూవీ..!
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. పక్కా మాస్ యాక్షన్ కమ్ కమర్షియల్ సినిమాలను చూడాలనుకునేవారికి ఖిలాడి నచ్చుతుంది.

"ఖిలాడి " హాలీవుడ్ మూవీ లా ఉంటుంది - నిర్మాత కోనేరు
పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి ” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

"ఖిలాడి" మూవీ న్యూ పోస్టర్స్ రిలీజ్
పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'హిట్ 2' నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా హిట్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమా కూడా సెట్స్ పైకి వచ్చి షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసారి ‘హిట్ 2’ సినిమా ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే క్రైమ్ డ్రామాగా.. హీరో పేరు కూడా కె.డి అని ఇప్పటికే చెప్పేశారు కూడా మేకర్స్. అయితే ఫస్ట్ పార్ట్ లో విశ్వక్ సేన్ హీరోగా నటించినా.. ఈ పార్ట్ లో మాత్రం యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్నాడు.

"సలార్ " మూవీ లో "ఖిలాడి " బ్యూటీ
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ తో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా నటిస్తున్నారు. మధు గురుస్వామి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. "సలార్ " మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు.

టాలీవుడ్ లో బిజీగా మీనాక్షి చౌదరి
ఎస్ దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ హీరో గా రూపొందిన "ఇచ్చట వాహనములు నిలుపరాదు" మూవీ తో మోడల్ , ఫెమినా మిస్ ఇండియా (2018) టైటిల్ హోల్డర్ మీనాక్షి చౌదరి టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకున్నారు. మీనాక్షి ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ "ఖిలాడి ", అడివి శేష్ "HIT 2 "మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ హవా
ఇతర భాషా కథానాయికలు టాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. హిందీ తర్వాత జాతీయస్థాయిలో పెద్ద మార్కెట్ కలిగిన టాలీవుడ్‌పై కొత్త కథానాయికలు ఆసక్తి చూపుతారు. కొత్త కథానాయికలు నటించిన మొదటి సినిమా రిలీజ్ కాకుండానే టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకొనడం విశేషం. అడివిశేష్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన "మేజర్ " మూవీ తో "దబంగ్ 3" బాలీవుడ్ మూవీ బ్యూటీ సయీ మంజ్రేకర్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న "గని "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

లక్కీ బ్యూటీ మీనాక్షి చౌదరి
మోడల్ , హర్యానా ఫెమినా మిస్ ఇండియా (2018 )మీనాక్షి చౌదరి "అవుట్ ఆఫ్ లవ్ "హిందీ వెబ్ సిరీస్ ద్వారా కెరీర్ ప్రారంభించారు. సుశాంత్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "ఇచ్చట వాహనములు నిలుప రాదు "మూవీ తో మీనాక్షి కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ కామెడీ "ఖిలాడి " మూవీ లో మీనాక్షి కథానాయికగా ఎంపిక అయ్యారు. "ఖిలాడి "మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది.
హిట్ 2 లో హీరోయిన్ గా 'మీనాక్షి చౌదరి'..!
సుశాంత్ హీరోగా నటిస్తోన్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్ లోకి కథానాయికగా ఎంట్రీ ఇవ్వనుంది మీనాక్షి చౌదరి. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే .. రవితేజ ‘ఖిలాడి’ లో కూడా కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది. అలాగే ఇప్పుడు మరో సినిమా లో కూడా మీనాక్షి చౌదరి అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు హిట్ సీక్వెల్ హిట్2.
"ఖిలాడి " ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
హీరో రవితేజ ప్రస్తుతం ఎ స్టూడియోస్ , పెన్ మూవీస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ "రాక్షసుడు "మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హీరో రవితేజ ద్విపాత్రాభినయం తో తెరకెక్కుతున్న “ఖిలాడి “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “క్రాక్ ” మూవీ ఘనవిజయం సాధించడం తో హీరో రవితేజ ఫుల్ జోష్ లో ఉన్నారు.