హిట్2 రిలీజ్ డేట్ ఫిక్స్

Hit 2 Movie Release Date Fixed, Hit 2 Telugu Movie Release Date Fixed, Hit The Second Case, Hit 2 Release Date, #HIT2 on DECEMBER 2ND, #HIT2, Hit 2 Movie, Hit 2 Telugu Movie, Adivi Sesh and Meenakshi Chaudhary Starrer Hit The Second Case, Adivi Sesh and Meenakshi Chaudhary's Hit 2, Adivi Sesh's Hit The Second Case, Meenakshi Chaudhary, Adivi Sesh Latest Movie, Adivi Sesh Upcoming Movie, Hit 2 Latest Update, Hit 2 Movie New Update, Sailesh Kolanu, Hit 2 Movie Latest News And Upates, Telugu Filmnagar, Tollywood Latest, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

టాలీవుడ్ లో ఉన్న విభిన్నమైన నటుల్లో అడివి శేష్ కూడా ఒకరు. తన సినిమాలతో ఎప్పటికప్పుడు అది నిరూపిస్తూనే ఉన్నారు. ఇక రీసెంట్ గా మేజర్ సినిమాతో మరో మెట్టు ఎక్కేశాడు అడివి శేష్. ఇక ఇప్పుడు తన తరువాత సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం తను చేస్తున్నసినిమా హిట్ 2. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా హిట్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. ఇక ఈసినిమాకు ఇప్పుజు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక మొదటి పార్ట్ లో విశ్వక్ సేన్ నటించగా హిట్ 2 లో అడివి శేష్ నటిస్తున్నాడు. ఈసారి ‘హిట్ 2’ సినిమా ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే క్రైమ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. దాదాపు చివరి దశకు కూడా వచ్చేసింది. అయితే మధ్యలో అడివి శేష్ మేజర్ సినిమాతో బిజీ అవ్వడంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇటీవలే ఈసినిమా లాస్ట్ షెడ్యూల్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలో అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు మేకర్స్. డిసెంబర్ 2వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =