
ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 4


12A రైల్వే కాలనీ ట్రైలర్ రిలీజ్

ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రోమో రిలీజ్


భారీ ధరకు అమ్ముడైన అఖండ 2 ఓవర్సీస్ రైట్స్

జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ

జటాధరా 3 డేస్ కలెక్షన్స్

భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటున్న రవితేజ

తిరువీర్ నెక్స్ట్ మూవీ లాంఛ్

జాసన్ సంజయ్ -సందీప్ కిషన్ మూవీ టైటిల్ రివీల్

ప్రముఖ కవి అందెశ్రీ అస్తమయం

ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ డే ఫస్ట్ షో 12న

ది గర్ల్ ఫ్రెండ్ కోసం రానున్న విజయ్ దేవరకొండ
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్' ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. వీకెండ్లో మాత్రమే కాకుండా, వీక్ డేస్‌లో కూడా ఈ సినిమాకు హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తుండటంతో, చిత్రబృందం నవంబర్ 12న సక్సెస్ మీట్‌ను నిర్వహించాలని నిర్ణయించుకుంది.ఈ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. రేపు ఈ ఈవెంట్ పార్క్ హయత్ లో సాయంత్రం 6 గంటలకు జరుగనుంది.

12A రైల్వే కాలనీ ట్రైలర్ రిలీజ్
బచ్చలమల్లి తరువాత అల్లరి నరేష్ నటించిన సినిమా 12ఏ రైల్వే కాలనీ.హారర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది .పొలిమేర, పొలిమేర 2 ఫేమ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్, ఈసినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా ఈ చిత్రాన్నిప్రఖ్యాత నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. నవంబర్ 21న 12ఏ రైల్వే కాలనీ థియేటర్లలోకి రానుంది.

రూమర్స్ నమ్మొద్దు.. నాన్న బ్రతికే వున్నారు - ఈషా డియోల్
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన కుమార్తె ఈషా డియోల్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆమె సంచలన ప్రకటన చేస్తూ, తన తండ్రి ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలను ఖండించారు.

ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రోమో రిలీజ్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. కేవలం సాంగ్స్ తోనే సూపర్ హైప్ తెచ్చుకుంటుంది.ఇప్పటివరకు మూడు పాటలు రిలీజ్ అవ్వగా అన్ని చార్ట్ బస్టర్ అనిపించుకున్నాయి.ఇక రేపు ఈసినిమా నుండి నాలుగో పాట కూడా రానుంది.ఫస్ట్ డే ఫస్ట్ షో అంటూ సాగే పాట ఫుల్ సెలబ్రేషన్ మోడ్ లో ఉండనుంది.అందులో భాగంగా ఈరోజు సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.ఈ సాంగ్ అందరు హీరోల ఫ్యాన్స్ కి చాలా రోజులు గుర్తిండిపోనుంది. రేపు ఈసాంగ్ ను హైదరాబాద్ లోని విమల్ థియేటర్ లో లాంఛ్ చేయనున్నారు.

శివ మేడ్ ఫర్ వన్ అండ్ ఓన్లీ నాగార్జున- రామ్ గోపాల్ వర్మ
కింగ్ నాగార్జున ఆల్ టైం కల్ట్ క్లాసిక్ 'శివ' బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను 'బిఫోర్ శివ', 'ఆఫ్టర్ శివ'గా రీడిఫైన్ చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్ & సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ చిత్రాన్ని 4K డాల్బీ ఆట్మాస్ లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు స్పెషల్ ప్రిమియర్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ రీరిలీజ్ కావడం చాలా ఆనందంగా వుంది - కింగ్ నాగార్జున
కింగ్ నాగార్జున ఆల్ టైం కల్ట్ క్లాసిక్ 'శివ' బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను 'బిఫోర్ శివ', 'ఆఫ్టర్ శివ'గా రీడిఫైన్ చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్ & సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ చిత్రాన్ని 4K డాల్బీ ఆట్మాస్ లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. నిన్న స్పెషల్ ప్రీమియర్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు.

SSMB 29 నుండి సంచారి సాంగ్ రిలీజ్
అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి నిన్న రాత్రి SSMB 29 నుండి సడెన్ సప్రైజ్ ఇచ్చారు.ఎలాంటి ముందుస్తు సమాచారం లేకుండా ఈసినిమానుండి 'గ్లోబ్ ట్రాటర్' థీమ్ సాంగ్ సంచారి విడుదలైంది.

భారీ ధరకు అమ్ముడైన అఖండ 2 ఓవర్సీస్ రైట్స్
సీనియర్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా అఖండ 2: తాండవం.బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలై అఖండ 2: తాండవం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు.

జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు, జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా గ్రాండ్‌గా లాంచ్ అవుతున్నారు. ఒక అద్భుతమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, RX 100, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల విజనరీ ఫిల్మ్ మేకర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు.

జటాధరా 3 డేస్ కలెక్షన్స్
సుధీర్ బాబు కథానాయకుడిగా, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం జటాధర. గత శుక్రవారం విడుదలైన ఈసినిమా రివ్యూస్ తో టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.ఫస్ట్ వీకెండ్ ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.62 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ ప్రకటించారు. సినిమాకు వచ్చిన టాక్ కు అయితే ఈ కలెక్షన్స్ చాలా ఎక్కువనే చెప్పొచ్చు. మరి ముందు ముందు ఈసినిమా ఇదే జోరు కొనసాగిస్తుందో చూడాలి.

భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటున్న రవితేజ
నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన 76వ సినిమాలో నటిస్తున్నాడు.ఎస్ఎ ల్ వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను బిగ్ కాన్వాస్‌పై స్టైలిష్‌గా రూపొందిస్తున్నారు.సెట్ మీదకు వెళ్ళినప్పటినుండి ఈసినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది. దాంతో 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.నవంబర్ లోపు షూట్ కి కంప్లీట్ చేసి చెప్పినట్లు సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

తిరువీర్ నెక్స్ట్ మూవీ లాంఛ్
లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ప్రీ వెడ్డింగ్ షో'తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. సంక్రాంతికి వస్తున్నాం విజయం తర్వాత ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో భరత్ దర్శన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి ప్రొడక్షన్ నంబర్ 2 గా నిర్మిస్తున్నారు.

ఓటీటీలోకి రానున్న డ్యూడ్
కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ దీపావళికి వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమా అన్ని భాషల్లో కలిపి 100కోట్లపైనే వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ప్రదీప్ కి ఇది మూడో 100కోట్ల సినిమా. దాంతో మొదటి మూడు సినిమాలతో ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ హీరోగా ప్రదీప్ రికార్డు సృష్టించాడు.ఇంతకుముందు లవ్ టుడే ,డ్రాగన్ లతో ఈ క్లబ్ లో చేరాడు.

జాసన్ సంజయ్ -సందీప్ కిషన్ మూవీ టైటిల్ రివీల్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. జాసన్ సంజయ్ డైరెక్షన్ లో సందీప్ కిషన్ హీరోగా సినిమా రానుంది.ఇక ఈసినిమాకు టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.తమిళ్ తోపాటు తెలుగులోనూ విడుదలకానున్న ఈసినిమాకు సిగ్మా అనే టైటిల్ పెట్టారు. ఈ సందర్భంగా సందీప్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ ఇంట్రస్టింగ్ వుంది.

అదరగొడుతున్న పెద్ది చికిరి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సెన్సేషన్ సృష్టిస్తుంది. పాట విడుదలైనప్పటి నుండి అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కొత్త రికార్డ్స్ నెలకొల్పుతోంది.ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన చికిరి చికిరి ఎమోషన్స్, మాస్ అప్పీల్ తో చేసే ఆడియో-విజువల్ ఫీస్ట్ గా నిలిచింది. బాలాజీ అద్భుతమైన సాహిత్యం, మోహిత్ చౌహాన్ మ్యాజికల్ వోకల్స్ తో సాంగ్ దేశంలోని ప్రతి మూల నుండి ప్రేక్షకులకు ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యింది. రామ్ చరణ్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ తో చికిరి వైరల్ తుఫాను గా మారింది. రూరల్ బీట్స్, ఎనర్జిటిక్ మ్యూజిక్, అద్భుతమైన విజువల్స్, రామ్ చరణ్ మాస్ ఇమేజ్ తో చికిరి చికిరి పాట అదిరిపోయింది.

ప్రముఖ కవి అందెశ్రీ అస్తమయం
ప్రముఖ కవి, సినీ గీత రచయిత అందెశ్రీ ( 64) నిన్న అనారోగ్యంతో కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి లాలాగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.

ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ డే ఫస్ట్ షో 12న
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్టైనర్ ఆంధ్ర కింగ్ తాలూకా తో రానున్నాడు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన ప్రమోషనల్ మెటీరియల్‌తో ఈ సినిమా భారీ బజ్‌ను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్, పాటలు, టీజర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ప్రేమంటే సెకండ్ సాంగ్ విడుదల
ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా నెక్స్ట్ వస్తున్న సినిమా ప్రేమంటే. "థ్రిల్-యు ప్రాప్తిరస్తు!" అనేది ట్యాగ్‌లైన్. రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మాణంలో రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీగా వస్తుంది.ఇందులో ఆనంది హీరోయిన్ గా నటించగా సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు.రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్ అలాగే టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

జన నాయగన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ జన నాయగన్ నుండి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. దళపతి కచేరి అంటూ వచ్చిన ఈ మాస్ సాంగ్ చార్ట్ బస్టర్ అనిపించేలా వుంది.విజయ్ వోకల్స్ ,అనిరుధ్ సంగీతం సాంగ్ లో హైలైట్ అయ్యాయి. అరివు ఈ సాంగ్ ను రచించాడు.త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ కానుంది.ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఎలాంటి వాయిదా లేకుండా పొంగల్ కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది.ఇక ఈసినిమా ఆడియో లాంఛ్ మలేషియా లో డిసెంబర్ 27న గ్రాండ్ గా జరుగనుంది.

50 మిలియన్ క్లబ్ లో మీసాల పిల్ల
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు' ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల 50 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.కేవలం సింగిల్ లాంగ్వేజ్ లోనే విడుదలై 50 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ సాంగ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పండగ వాతావరణంలో, కుటుంబమంతా కలిసి చూసేలా ఉండే ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోంది. ఆ వైబ్‌ను అద్భుతంగా అందించిన సాంగ్ మీసాల పిల్ల. భీమ్స్ సెసిరోలియో అందించిన ఎనర్జిటిక్ ట్యూన్, బీట్లతో ఈ పాట దేశవ్యాప్తంగా చార్ట్‌బస్టర్‌గా మారింది. తెలుగు పాటగా ఇంత పెద్ద స్థాయిలో పాన్-ఇండియా రీచ్ సాధించడం…