ఓటీటీలోకి రానున్న డ్యూడ్

OTT Premiere for Dude Announced

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ దీపావళికి వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమా అన్ని భాషల్లో కలిపి 100కోట్లపైనే వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ప్రదీప్ కి ఇది మూడో 100కోట్ల సినిమా. దాంతో మొదటి మూడు సినిమాలతో ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ హీరోగా ప్రదీప్ రికార్డు సృష్టించాడు.ఇంతకుముందు లవ్ టుడే ,డ్రాగన్ లతో ఈ క్లబ్ లో చేరాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది.నెట్ ఫ్లిక్స్ పాన్ ఇండియా భాషల్లో ఈసినిమాను ఈనెల 14నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.మరి ఓటీటీలో ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. డ్యూడ్ ను కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేయగా ప్రేమలు ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటించింది.యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు.టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించింది.

ఇక ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) తో రానున్నాడు. ఇది కూడా ఈ ఏడాదే రానుంది. విగ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.డిసెంబర్ 18న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఈ ఏడాది ప్రదీప్ కి ఇది థర్డ్ రిలీజ్ కానుంది. ఇంతకుముందు ప్రదీప్ సమ్మర్ లో డ్రాగన్ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా ఇప్పుడు డ్యూడ్ తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మరి ఎల్ఐకె తో ఈ ఏడాది హ్యాట్రిక్ పూర్తి చేస్తాడో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.