భారీ ధరకు అమ్ముడైన అఖండ 2 ఓవర్సీస్ రైట్స్

Overseas Rights of Akhanda 2 Fetch a Huge Amount

సీనియర్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా అఖండ 2: తాండవం.బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలై అఖండ 2: తాండవం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనెల 14న ఈ సాంగ్ రిలీజ్ కానుంది. ఇక ఈసినిమా ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. బాలకృష్ణ కెరీర్ లో హైయెస్ట్ ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా ఇదే. దాదాపు 15కోట్లకు మోక్ష మూవీస్ అలాగే సినీ గాలక్సీ & శ్రీ వైష్ణవి ఎంటర్టైన్మెంట్ ఈ రైట్స్ దక్కించుకున్నాయి. ఇక ఓవర్సీస్ డీల్ క్లోజ్ కావడంతో డిసెంబర్ 4న అఖండ 2 కి భారీ సంఖ్యలో ప్రీమియర్లు పడనున్నాయి.

ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటించగా ఆది పినిశెట్టి ,హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా అఖండ 2: తాండవం డిసెంబర్ 5, 2025న పాన్ ఇండియా భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.