కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movie News

ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 3

Thiruveer Kickstarts Another Film Project
సినిమా వార్తలు

తిరువీర్ మరో సినిమా లాంచ్

రీసెంట్ గా ప్రీ వెడ్డింగ్ షో తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అందులో భాగంగా రీసెంట్ గా ఓ సినిమా ప్రకటించాడు. ఇందులో తిరువీర్ హీరోగా నటిస్తుండగా తనకు జంటగా ఐష్వర్య రాజేష్ కనిపించనుంది. కామెడీ డ్రామా గా తెరకెక్కుతుంది. ఇక తాజాగా తిరువీర్ మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ సైన్ చేశారు. ఈ చిత్రానికి మహేందర్ కుడుదుల దర్శకత్వం వహిస్తున్నారు. ఆధ్య మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా పరుచూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 Set for a Grand 3D Release
సినిమా వార్తలు

3డీ లో రానున్న అఖండ 2

గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ఫస్ట్ సింగిల్ తాండవం అద్భుతమైన రెస్పాన్స్ తో భారీ అంచనాలు సృష్టించాయి. ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ చిత్రాన్ని 3డీలోనూ రిలీజ్‌ చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా బిగ్ రివిల్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Andhra King taluka Arriving a Day Early
సినిమా వార్తలు

ఆంధ్ర కింగ్ తాలూకా ఒక రోజు ముందుగానే

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఒక రోజు ముందుకు తీసుకొచ్చారు.నవంబర్ 28న విడుదల కావాల్సిన ఈ చిత్రం, నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Powerful First Single from Akhanda 2 Unveiled
సినిమా వార్తలు

అఖండ 2 నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్

ఈఏడాది చివర్లో మోస్ట్ అవైటెడ్ మూవీ గా వస్తుంది అఖండ 2 .నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈసినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేలా ఈసినిమానుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ పాట లాంచ్ ఈవెంట్‌ ముంబైలోని పీవీఆర్ జుహు థియేటర్‌లో జరిగింది. ఈవెంట్ కి బాలకృష్ణ తోపాటు మిగితా టీం హాజరైంది.

Mahender Reddyవాట్సాప్
Exciting Trailer of Revolver Rita Released
ట్రైలర్ & టీజర్

రివాల్వర్ రీటా ట్రైలర్ రిలీజ్

విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న అగ్ర కథానాయిక కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'రివాల్వర్ రీటా'.ఎప్పుడో విడుదలకావల్సిన ఈసినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది.ఈనెల 28న ఈసినిమా తమిళ్ తోపాటు తెలుగులోనూ విడుదలకానుంది.ఇక ఈరోజు ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.ఈ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈసినిమాకు కె. చంద్రు దర్శకత్వం వహిస్తుండగా, సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కీలకపాత్రలో అలాగే ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ సునీల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Sandeep Reddy Vanga Reveals When Spirit Will Begin
సినిమా వార్తలు

స్పిరిట్ స్టార్ట్ ఎప్పుడో చెప్పేసిన సందీప్ రెడ్డి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ -అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ స్పిరిట్ గురించిన తాజా అప్‌డేట్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా అందించారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం యొక్క షూటింగ్‌ను నవంబర్ నెలాఖరులో ప్రారంభించబోతున్నట్లు ఓ ఈవెంట్ లో సందీప్ రెడ్డి వెల్లడించారు.

Mahender Reddyవాట్సాప్
kaantha review in telugu
రివ్యూ

రివ్యూ : కాంత

ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన కాంత ఆకట్టుకుందనే చెప్పొచ్చు. కేవలం నటీనటుల అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కోసమైనా ఈసినిమా చూడొచ్చు అనేలా వుంది. పీరియాడిక్ విజువల్స్ మరియు బలమైన సాంకేతిక విలువలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. పీరియాడిక్ డ్రామాలు, క్యారెక్టర్ డ్రైవెన్ సినిమాలు, మరియు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.

Mahender Reddyవాట్సాప్
Dude Now Streaming on netflix
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన డ్యూడ్

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ దీపావళికి డ్యూడ్ తో వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమా అన్ని భాషల్లో కలిపి 100 కోట్లపైనే వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ప్రదీప్ కి ఇది మూడో 100కోట్ల సినిమా.ఇంతకుముందు లవ్ టుడే ,డ్రాగన్ లతో ఈ క్లబ్ లో చేరాడు.

Mahender Reddyవాట్సాప్
Top Malayalam DOP nimish ravi onboard for Mega 158
సినిమా వార్తలు

మెగా 158 కోసం ప్రముఖ మలయాళ డీఓపీ

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో మెగా 158 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బ్లాక్‌బస్టర్ వాల్తేరు వీరయ్య తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా, తాజాగా టెక్నికల్ టీమ్ గురించి ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాకు మాలీవుడ్‌లో టాప్ డీఓపీగా రాణిస్తున్న నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందించనున్నారని మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 Set to Launch Its First Single in Mumbai
సినిమా వార్తలు

అఖండ 2 ఫస్ట్ సింగిల్ లాంఛ్ ముంబైలో

నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2 పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేలా చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ పాట లాంచ్ ఈవెంట్‌ను నవంబర్ 14న ముంబైలోని జుహూలోని పీవీఆర్ థియేటర్‌లో ప్లాన్ చేశారు.ఈ పాటను ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్ మరియు కైలాష్ ఖేర్ కలిసి పాడారు.ఈ సినిమాను తెలుగుతో పాటు నార్త్ ఆడియన్స్ టార్గెట్ గా తెరకెక్కిస్తున్నారు.దాంతో ప్రమోషన్స్ కూడా అక్కడి నుండే స్టార్ట్ చేయన్నునారు.

Mahender Reddyవాట్సాప్
Rajamouli Gives Instructions for the Globe Trotter Event
సినిమా వార్తలు

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి ఎలా రావాలో చెప్పిన రాజమౌళి

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న గ్లోబ్ ట్రాటర్ SSMB 29 సినిమా కోసం నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించబోతున్న అతిపెద్ద ఈవెంట్ కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ముందు జాగ్రత్తగా ఒక అలర్ట్ మెసేజ్‌ను వీడియో రూపంలో విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Yuvan Shankar Raja Lends His Voice for a Song in Parasakthi
సాంగ్

పరాశక్తి లో పాట పాడిన యువన్ శంకర్ రాజా

మదరాసి తరువాత తమిళ నటుడు శివ కార్తికేయన్ నుండి నెక్స్ వస్తున్న సినిమా పరాశక్తి .ఇది శివ కార్తికేయన్‌కు 25వ సినిమా. ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో అథర్వ, శ్రీలీల, రవి మోహన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీలీల కు తమిళ్ లో ఇదే మొదటి సినిమా. షూటింగ్ పురఃటి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది.

Mahender Reddyవాట్సాప్
Priyanka Chopra’s First Look from SSMB 29 Unveiled
ఫస్ట్ లుక్

SSMB 29 నుండి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిల భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ 'SSMB 29' నుండి వరుసగా సర్‌ప్రైజ్‌లు వస్తున్నాయి. ఇప్పటికే విలన్ పాత్ర 'కుంభ' (పృథ్వీరాజ్ సుకుమారన్) ఫస్ట్ లుక్ మరియు 'సంచారి' థీమ్ సాంగ్ విడుదల కాగా, తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
First Day First Show Song from Andhra King Taluka Released
సాంగ్

ఫస్ట్ డే ఫస్ట్ షో సాంగ్ రిలీజ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా కేవలం పాటలతోనే ప్రేక్షకుల్లో సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం నుండి మూడు పాటలు విడుదల కాగా, అవన్నీ చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక ఈ రోజు ఈ సినిమా నుండి నాలుగవ పాట కూడా రిలీజైయింది. విమల్ థియేటర్ లో అభిమానులు ఈ సాంగ్ లాంఛ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Kaantha to Have early Special Premiere Shows
సినిమా వార్తలు

కాంతకు ప్రీమియర్ షోలు

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ 'కాంత'. ఈనెల 14న థియేటర్లలోకి రానుంది.రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండి సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.1950ల నాటి సినిమా నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ థ్రిల్లర్ గా రానుంది ఈసినిమా.

Mahender Reddyవాట్సాప్
Big-Budget Set Erected for The Paradise Shoot
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ కోసం భారీ సెట్

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి నాని లుక్, అలాగే ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న మోహన్ బాబు పోస్టర్‌లు ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత, నటి సోనాలి కులకర్ణి ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. అలాగే కిల్ ఫేం రాఘవ్ జుయల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. కేవలం కాస్టింగ్ తోనే భారీ హైప్ క్రియేట్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Bollywood Star Raveena Tandon Plays a Major Role in Maa Vande
సినిమా వార్తలు

మా వందే.. కీలక పాత్రలో రవీనా టాండన్

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మా వందే అనే టైటిల్ తో ఈ బయోపిక్ రానుండగా ఇందులో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ మోదీ పాత్రలో కనిపించనున్నాడు.క్రాంతి కుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.షూట్ కూడా స్టార్ట్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
Bhagyashri Borse Says Playing Kumari in Kaantha Is a Blessing
ఇంటర్వ్యూ

కాంతలో కుమారి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం - హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే

దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా కాంత మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి వస్తుంది. సెల్వమణి సెల్వరాజ్‌ డైరెక్ట్ చేయగా రానా, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. దుల్కర్‌ సల్మాన్‌ ‘వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్‌ మీడియా’ సంయుక్తంగా నిర్మించాయి. టీజర్, ట్రైలర్, పాటలు అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా భాగ్యశ్రీ బోర్సే సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Minister Konda Surekha Withdraws Comments Made on Nagarjuna’s Family
సినిమా వార్తలు

నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా- మంత్రి కొండా సురేఖ

తెలంగాణ మంత్రి కొండా సురేఖ, సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం గురించి గతంలో చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు. ఈ విషయంలో ఆమె అర్ధరాత్రి సమయంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.తాను గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు కొండా సురేఖ తెలిపారు.

Mahender Reddyవాట్సాప్
Pretty Baby Song Promo from Biker First Single Released
సాంగ్

బైకర్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ బైకర్‌ తో రానున్నాడు. ఇందులో శర్వా సరికొత్త లుక్ తో మోటార్‌సైకిల్ రేసర్‌గా ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాడు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రం పూర్తయ్యే దశకు చేరుకుంది. రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్

షేర్