భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటున్న రవితేజ 

RT 76 Title and First Look Released Officially

నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన 76వ సినిమాలో నటిస్తున్నాడు.ఎస్ఎ ల్ వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను బిగ్ కాన్వాస్‌పై స్టైలిష్‌గా రూపొందిస్తున్నారు.సెట్ మీదకు వెళ్ళినప్పటినుండి ఈసినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది. దాంతో 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.నవంబర్ లోపు షూట్ కి కంప్లీట్ చేసి చెప్పినట్లు సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈరోజు ఈసినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈసినిమాకు భర్త మహాశయులకు విజ్ఞప్తి  అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఈ సందర్భంగా   విడుదల చేసిన గ్లింప్స్ కూడా ఆకట్టుకుంది.నా జీవితం లో వున్న ఇద్దరు ఆడాళ్ళు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు ..సమాధానం కోసం చాలా ఆలోచించాను  చివరికి చాట్ జీపీటీ ,జెమినీ వాటిని కూడా అడిగాను ,పెళ్లయినా మగవాళ్ళను అడిగాను కానీ ఎవరు  సమాధానం చెప్పలేకపోయారు.అలాంటి ప్రశ్న మిమ్మల్ని  ఏ ఆడాళ్ళు అడుగకూడదని  ఈ పరిస్థితి ఎవరికి రాకుడదంటూ పెళ్లైన వాళ్ళకు అసలు రాకూడదని కోరుకుంటూ మీ రామసత్య నారాయణ విజ్ఞప్తి అంటూ  గ్లింప్స్ ను  ముగించేశారు. గ్లింప్స్ అయితే ఇంట్రెస్టింగ్ గా వుంది.ఇంతకీ ఏంటి ఆ ప్రశ్న అనే క్యూరియాసిటీని తీసుకొచ్చింది. గ్లింప్స్ చూస్తుంటే రవితేజ ఈసారి ఫ్రెష్ కంటెంట్ తో వస్తున్నాడనిపిస్తుంది. 

కంప్లీట్  ఫ్యామిలీ & ఫన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో రవితేజ మార్క్ కామెడీ ఈసినిమాలో హైలైట్ అవ్వనుంది.ఇందులో రవితేజ సరసన  ఆషికా రంగనాథ్,డింపుల్ హయతి నటిస్తుండగా సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.