కింగ్ నాగార్జున ఆల్ టైం కల్ట్ క్లాసిక్ ‘శివ’ బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను ‘బిఫోర్ శివ’, ‘ఆఫ్టర్ శివ’గా రీడిఫైన్ చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్ & సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ చిత్రాన్ని 4K డాల్బీ ఆట్మాస్ లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు స్పెషల్ ప్రిమియర్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాము గారు.. 36 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్స్ లో అంతే ఎక్సయిట్మెంట్ ఉంది. ముఖ్యంగా మ్యూజిక్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంది. రీరిలీజ్ కోసం సౌండ్ లో ఎలాంటి కేర్ తీసుకున్నారు?
సౌండ్ క్యాలిటీ ఎన్హెన్స్ అయ్యిందని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఒరిజినల్ లో ఉండే ఫ్లేవర్ పోకుండా ఏఐ టెక్నాలజీని వాడి బెటర్ ఎఫెక్ట్ ఇవ్వడం కోసం వర్క్ చేసాము. అది మీ అందరికీ నచ్చడం హ్యాపీగా ఉంది.
రాము గారు మళ్ళీ శివ తీస్తే ఎవరితో చేస్తారు?
శివ మేడ్ ఫర్ వన్ అండ్ ఓన్లీ నాగార్జున.
రాము గారు సైకిల్ చైన్ ఐడియా ఎలా వచ్చింది?
నాగార్జున క్యారెక్టర్ ఒక స్టూడెంట్. తన రౌడీ కాదు. కానీ ఒక సిచువేషన్ లో తన చేతిలో వెపన్ ఉండాలనుకున్నప్పుడు, అది నేచురల్ గా ఉండాలి. అలాంటి సమయంలో తన దగ్గరలో ఉండే ఏదైనా ఒక వెపన్ లాంటిది కావాలనుకున్నాం. అలా సైకిల్ చైన్ ఐడియా క్రియేట్ అయింది.
రాము గారు రెండు సాంగ్స్ కట్ చేసి రీరిలీజ్ చేశారు కదా ఆ పాటలకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు?
సౌండ్ క్వాలిటీ ఇంత పెరిగాక సాంగ్స్ స్లోడౌన్ చేస్తాయని మాకు అనిపించింది. అందుకే ఆ రెండు సాంగ్స్ తీయడం జరిగింది. అప్పుడు సినిమాలో ఐదు పాటలు ఉండాలనే ఫార్ములా ఉండేది. ఇప్పుడు మాకు ఛాన్స్ దొరికింది. తీసేసాం. అయితే సినిమా ఎండ్ లో సాంగ్స్ ని అటాచ్ చేశాను. ఫ్యాన్స్ ఎంజాయ్ చేయొచ్చు (నాగార్జున)
నాగార్జున గారు నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారితో సినిమా చేసే ఆలోచన ఉందా?
-రాము మీద నాకు అదే కాన్ఫిడెన్స్ ఉంది. అన్ని వర్కౌట్ అయితే తప్పకుండా చేస్తాం.
-నేను బయట ఒక హిట్ కొట్టిన తర్వాతే నాగార్జున ని అప్రోచ్ అవుతాను(రాంగోపాల్ వర్మ).
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























