అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి నిన్న రాత్రి SSMB 29 నుండి సడెన్ సప్రైజ్ ఇచ్చారు.ఎలాంటి ముందుస్తు సమాచారం లేకుండా ఈసినిమానుండి ‘గ్లోబ్ ట్రాటర్’ థీమ్ సాంగ్ సంచారి విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ప్రాజెక్ట్ ‘SSMB 29’. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉండగా, నవంబర్ 15న జరగబోయే “గ్లోబ్ ట్రాటర్” ఈవెంట్‌కు ముందుగా సినిమా యొక్క థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. విలన్ పాత్ర ‘కుంభ’ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఫస్ట్ లుక్ విడుదలైన వెంటనే, ఈ మ్యూజికల్ సర్ప్రైజ్ను అందించారు.
ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ థీమ్ సాంగ్ పూర్తిగా గ్లోబల్ స్టాండర్డ్స్‌లో ఉంది. అడ్వెంచర్ థీమ్ గా వచ్చిన ఈసాంగ్, ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ మరియు ట్రెజర్ హంట్ వైబ్‌ను స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్త సాహస యాత్ర గురించి ఉంటుందనే విషయాన్ని ఈ పాట మరింత స్పష్టం చేసింది.
ఈ థీమ్ సాంగ్ కు ప్రముఖ నటి శ్రుతి హాసన్ తన ప్రత్యేకమైన హస్కీ మరియు పవర్ఫుల్ వాయిస్‌తో అదనపు ఎనర్జీని అందించారు. చైతన్య ప్రసాద్ ఈ సాంగ్ ను రచించారు. “కాలాన్ని శాసిస్తూ… ప్రతిరోజూ పరుగేలే”, “వేగాన్నే శ్వాసిస్తూ…” వంటి పదాలు మహేష్ బాబు క్యారెక్టర్ ఒక ధైర్యవంతుడైన, సమయాన్ని శాసించే ‘గ్లోబ్ ట్రాటర్’ అని తెలియజేస్తున్నాయి. మొత్తం మీద పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ తో సినిమాపై వున్న అనుమానాలను ఒక్క థీమ్ సాంగ్ తో పటాపంచలు చేశారు.ఇక 15న వచ్చే గ్లింప్స్ ఏ రేంజ్ లో ఉంటుందో.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























