
ట్యాగ్ · 11 కథనాలు

ఓటీటీ లోకి వచ్చేసిన వారసుడు
ఇళయ దళపతి విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తన తమిళ్ సినిమాలను ఇక్కడ డబ్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారు మేకర్స్. ఇక రీసెంట్ గా వారసుడు సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈసినిమా తెలుగు డైరెక్టర్ దర్శకత్వం వహించడం విశేషం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన సినిమా వారసుడు. తమిళ్ లో వారిసు టైటిల్ తో రిలీజ్ అవ్వగా.. తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ అయింది. తమిళంలో జనవరి 12న, తెలుగులో జనవరి 14న విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది.

ఓటిటి లో "రాధేశ్యామ్ "మూవీ కి అద్భుత స్పందన
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.”రాధేశ్యామ్ ” మూవీ లో వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దక్షిణాది భాషల వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు…

అమెజాన్ లోకి వచ్చిన 'నాట్యం'..!
ఈమధ్య కేవలం కమర్షియల్ సినిమాలే కాదు ప్రయోగాత్మక సినిమాలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే మేకర్స్ కూడా అలాంటి సినిమాలను చేయడానికి ముందుకొస్తున్నారు. అలా వచ్చిన ఒక సినిమానే నాట్యం. గతంలో సంగీతం, నృత్యం నేపథ్యంలో సినిమాలు వచ్చేవి కానీ ఇప్పుడు చాలా తక్కువయ్యాయి. ప్రస్తుతం భారీ బడ్జెట్.. పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుండగా.. ఇలాంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మెచ్చుకోతగిన విషయం. అందుకే ఈసినిమాకు కూడా మంచి ప్రశంసలే దక్కాయి. మెగాస్టార్ చిరు, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి ప్రముఖులు కూడా ఈసినిమాను ప్రశంసించారు. అంతేకాదు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో…

'ఓటీటీ'లోకి వచ్చిన 'కొండపొలం'
కరోనా వల్ల చాలా సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. ఈమధ్యనే కరోనా సెకండ్ వేవ్ తరువాత సినిమాలు మళ్లీ థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. ఇక థియేటర్లలో రిలీజ్ అయినా కూడా ఒకప్పటిలాగ సినిమాలు ఆడే పరిస్థితి లేదు. ఒక వారం రోజులు గట్టిగా ఆడితే గొప్ప అనేలా పరిస్థితి మారిపోయింది. అందుకే థియేటర్లలో రిలీజ్ అయినా కూడా ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకోకుండా వెంటనే ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు.

ఈ కథలో పాత్రలు కల్పితం సినిమా తప్పకుండా చూడడానికి ఉసిగొలిపే అంశాలు
గత కొంత కాలంగా విభిన్న కథలకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆలవాలం అయింది. ఇప్పుడు అలాంటి విభిన్నమైన కథతో కొణిదెల కుటుంబం నుంచి పవన్ తేజను హీరోగా పరిచయం చేస్తూ అభిరాం దర్శకత్వంలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మాధవి సమర్పణలో రాజేష్ నాయుడు నిర్మించిన చిత్రం "ఈ కథలో పాత్రలు కల్పితం". మనం మాములుగా ఒక సినిమా చూడకపోతే చూసినవారిని ఎలా ఉంది అని అడిగి తెలుసుకుంటాం. అప్పుడు వాళ్ళు సినిమా ఎలా ఉందొ చెప్పాక ఆ సినిమా చూడాలా వద్దా అనే ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటాం. ఇప్పుడు మీరే గనుక ఇంకా ఈ చిత్రాన్ని చూడకపోతే ఇప్పుడు మేము చెప్పే ఈ సినిమాకి చెందిన విషయాలు మిమ్మల్ని సినిమా చూడడానికి దోహదపరుస్తాయి. అవి…

అమెజాన్ లోకి వచ్చేసిన 'గాలి సంపత్'
అనీష్ కృష్ణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్- శ్రీ విష్ణు ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా గాలి సంపత్. మహాశివరాత్రి కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో గాలి సంపత్ సినిమా కూడా ఒకటి. మొదటి నుండి ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి బ్రాండ్.. రాజేంద్రప్రసాద్-శ్రీవిష్ణు కాంబినేషన్ సినిమాకు బాగా కలిసొచ్చింది. తండ్రిగా రాజేంద్ర ప్రసాద్.. కొడుకుగా శ్రీవిష్ణు చేయడమే సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. వీరిద్దరి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సే రాబడుతూ రన్ అవుతుంది.
అమెజాన్ ప్రైమ్ లో 'అక్షర'
బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా 'అక్షర'. విడుదలకు ముందు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విద్యావ్యవస్థలోని లోపాలును చూపిస్తూ ఈసినిమాను రూపొందించినఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.
IIT కృష్ణమూర్తి - మరో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
ఇక ఓవర్ ఆల్ గా చెప్పాలంటే చిన్న చిత్రమే అయినా పెద్ద ఇంపాక్ట్ ని చూపించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఫుల్ ఫామ్ లో అమెజాన్ ప్రైమ్ - 5 భాషల్లో 9 సినిమాలు
లాక్ డౌన్ వల్ల సినిమాల షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే కదా. ఏదో ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త ముందుకొచ్చి తక్కువమంది సిబ్బందితో.. జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక సినిమా థియేటర్లలో బొమ్మ పడి ఆరు నెలలు పూర్తి అయ్యింది. కొద్దిరోజుల్లో థియేటర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇక ఈ కరోనా వల్ల థియేటర్స్ లేక బిజినెస్ లేక సినీ పరిశ్రమకు కొన్ని కోట్లలో నష్టం కలిగిన సంగతి తెలిసిందే. మరో పక్క ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పుంజుకున్నాయి. మొదట చిన్న సినిమాలు రిలీజ్ అయ్యేవి.. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా ఓటీటీ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధపడుతున్నాయి…

అమెజాన్ లో వచ్చేసిన 90ML
బోల్డ్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఆర్‌ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు కార్తికేయ. ఈ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ యంగ్ హీరో. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు కార్తికేయ. ఇక ఈ సినిమా విజయంతో వరుస అవకాశాలు కార్తికేయ తలుపు తట్టాయి. ఇక అటుపై కార్తికేయ హిప్పీ, గుణ 369లాంటి చిత్రాలతో పలకరించి మంచి విజయాలను అందుకున్నాడు.
అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసిన 'సాహో'
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా 'సాహో'. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి రోజు నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా చూస్తే మాత్రం.. మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక్కడితో పోల్చుకుంటే హిందీలో మాత్రం ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. హిందీలో మాత్రం రూ.50 కోట్ల లాభాన్ని తీసుకొచ్చింది. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 425 కోట్లకుపైగా వసూళ్లు సాధించి పలు రికార్డ్‌లు సృష్టించింది.