అమెజాన్ లోకి వచ్చిన ‘నాట్యం’..!

Sandhya Rajus Natyam Movie Is Now Streaming On The OTT Platform Amazon Prime Video

ఈమధ్య కేవలం కమర్షియల్ సినిమాలే కాదు ప్రయోగాత్మక సినిమాలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే మేకర్స్ కూడా అలాంటి సినిమాలను చేయడానికి ముందుకొస్తున్నారు. అలా వచ్చిన ఒక సినిమానే నాట్యం. గతంలో సంగీతం, నృత్యం నేపథ్యంలో సినిమాలు వచ్చేవి కానీ ఇప్పుడు చాలా తక్కువయ్యాయి. ప్రస్తుతం భారీ బడ్జెట్.. పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుండగా.. ఇలాంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మెచ్చుకోతగిన విషయం. అందుకే ఈసినిమాకు కూడా మంచి ప్రశంసలే దక్కాయి. మెగాస్టార్ చిరు, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి ప్రముఖులు కూడా ఈసినిమాను ప్రశంసించారు. అంతేకాదు ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రదర్శనలో కూడా ‘నాట్యం’ ఎంపికైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయిన ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ప్రస్తుతం ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్లలో చూడకుండా మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసి ఏంజాయ్ చేసేయండి.

కాగా రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో ఇంకా కమల్ కామరాజు , రోహిత్ బెహల్ , ఆదిత్య మీనన్ , భానుప్రియ ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , నిశ్రింకళ ఫిల్మ్‌ బ్యానర్స్ పై ఈసినిమాను రూపొందించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 1 =