
ట్యాగ్ · 12 కథనాలు


ఆడియన్స్ కు హీరో కిరణ్ అబ్బవరం స్పెషల్ థ్యాంక్స్

వినరో భాగ్యము విష్ణుకథ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

'సమ్మతమే' రిలీజ్ డేట్, ట్రైలర్ అప్ డేట్..!

'సెబాస్టియన్ P.C 524' ట్రైలర్ రిలీజ్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సెబాస్టియన్ P.C 524'

'సెబాస్టియన్ పీసీ 524' టీజర్ రిలీజ్

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా టైటిల్ రిలీజ్

టాప్ బ్యానర్ లో ఛాన్స్ కొట్టేసిన 'కిరణ్ అబ్బవరం'

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా షూటింగ్ మొదలు

కిరణ్ మీటర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు కిరణ్. ఇక వెంటనే మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. రమేశ్ కాడూరి దర్శకత్వంలో కిరణ్ హీరోగా వస్తున్న సినిమా మీటర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్న ఈసినిమాలో కిరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను ఏప్రిల్ 7వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేస్తూ…

ఆడియన్స్ కు హీరో కిరణ్ అబ్బవరం స్పెషల్ థ్యాంక్స్
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫిబ్రవరి 18వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. విష్ణు పాత్రలో కిరణ్ అబ్బవరం తన ఈజ్ యాక్టింగ్ తో అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ లో శుభలేఖ సుధాకర్ , మురళీ శర్మ, ప్రవీణ్, ఎల్ బి శ్రీరామ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

వినరో భాగ్యము విష్ణుకథ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు వినరో భాగ్యము విష్ణుకథతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ఇటీవలే ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

'సమ్మతమే' రిలీజ్ డేట్, ట్రైలర్ అప్ డేట్..!
ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ తరువాత ఎస్ఆర్ కల్యాణమండపంతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇటీవల సెబాస్టియన్ 524 పీసీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ అది బోల్తాకొట్టింది. ఇప్పుడు ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు ఉన్నాయి. వీటిలో సమ్మతమే సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది.

'సెబాస్టియన్ P.C 524' ట్రైలర్ రిలీజ్
బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా సెబాస్టియన్ పీసీ 524. ఈ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా కిరణ్ ఒక డిఫరెంట్ పాత్రలో వస్తున్నట్టు అర్థమవుతుంది. కానిస్టేబుల్ పాత్రలో నైట్ బ్లైండ్ నెస్ తో ఎలా విధులు నిర్వహించాడు అన్న నేపథ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సెబాస్టియన్ P.C 524'
రాజా వారు రాణి వారు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. అలాగే రెండో సినిమా SR కళ్యాణ మండపం తో మరో హిట్ ను అందుకున్నాడు కిరణ్. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అయితే బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో 'సెబాస్టియన్ P.C 524' సినిమా వస్తుంది. ఈసినిమాలో కూడా కిరణ్ మరో డిఫరెంట్ రోల్ తో వస్తున్నాడు. కిరణ్ నైట్ బ్లైండ్‌నెస్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాఈ సినిమాలో. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈనేపథ్యంలోనే తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసుకుంది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్…

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..!
ఈమధ్య సినిమా టైటిల్స్ తోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక అందులో మొదటి నుండి డిఫరెంట్ టైటిల్స్ ను పెట్డడంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎప్పుడూ ముందుంటాడు. మొదటి సినిమాకే 'రాజావారు.. రాణివారు' అనే టైటిల్ పెట్టి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ సినిమా తో హిట్ కొట్టాడు. ప్రస్తుతం ‘సమ్మతమే’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. రీసెంట్ గానే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తున్న సినిమాకు వినరో భాగ్యము విష్ణు కథ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

'సెబాస్టియన్ పీసీ 524' టీజర్ రిలీజ్
ప్రస్తుతం టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న కుర్ర హీరోల్లో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. ఇప్పటికి కిరణ్ సినిమాలు రిలీజ్ అయింది రెండు సినిమాలు మాత్రమే కానీ వరుస అవకాశాలు.. పెద్ద పెద్ద బ్యానర్స్ లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఇక కిరణ్ లిస్ట్ లోచాలా సినిమాలు ఉండగా అందులో సెబాస్టియన్ పీసీ 524 సినిమా కూడా ఒకటి. కిరణ్ అబ్బవరం మొదటిసారి ఈ సినిమాలో పోలీస్ గా నటిస్తున్నాడు. ఈసినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు మేకర్స్.

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా టైటిల్ రిలీజ్
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం ఒక ఎత్తైతే.. ఇప్పుడున్న కాంపిటీషన్ ను తట్టుకొని అవకాశాలు దక్కించుకోవడం మరో ఎత్తు. అందుకే ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా కొంత లక్ అనేది మాత్రం ఉండాలి. ఇక ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోల్లో అలాంటి అదృష్టం ఉన్న హీరో కిరణ్ అబ్బవరం అని చెప్పొచ్చు. ఈ కుర్ర హీరో ఇప్పుడు వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కిరణ్ అబ్బవరం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అ సినిమా ఫలితం పక్కన పెడితే తన నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి. రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ్ మండపం’ గత యేడాది ఆగస్ట్ లో విడుదలై డీసెంట్ హిట్ అందుకుంది. అయినా కూడా అవకాశాల పరంగా మాత్రం కిరణ్ కు…

టాప్ బ్యానర్ లో ఛాన్స్ కొట్టేసిన 'కిరణ్ అబ్బవరం'
టాలీవుడ్ లో టాప్ బ్యానర్స్ లో గీతా ఆర్ట్స్ సంస్థ కూడా ఒకటి. ఈ బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే ఆ సినిమాకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ఇక దీనికి అనుసంధానంగా రీసెంట్ గా గీతా ఆర్స్ట్ 2 కూడా వచ్చింది. ఈ బ్యానర్ నుండి ఇప్పటివరకూ అరడజను వరకూ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు కూడా దాదాపు అన్నీ సక్సెస్సే అయ్యాయి. అంతేకాదు ఈ బ్యానర్ లో యంగ్ హీరోలకు.. కొత్త టాలెంట్ కు ఛాన్స్ లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈ బ్యానర్ చాలా తక్కువ టైమ్ లోనే సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.

ప్రముఖ నిర్మాణ సంస్థల్లో 'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా
రాజా వారు-రాణీగారు, ఎస్‌ఆర్ కల్యాణ మండపం చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రామిసింగ్ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఇక ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేశాడు. టాప్ ప్రొడక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. బాబీ, గోపీచంద్ మలినేనిల వద్ద ఎన్నో సినిమాలకు పనిచేసిన రమేష్ కాదూరి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఈసినిమాను ఎంతో మంది అగ్ర కథానాయకులతో, స్టార్ డైరక్టర్లతో సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీమేకర్స్, ఇటీవల మత్తు వదలరా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా…

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా షూటింగ్ మొదలు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం సైలెంట్ గా ఒక సినిమా తర్వాత మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే SR కళ్యాణమండపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. ఇక ఇదిలా ఉండగా తాజాగా కిరణ్ మరో సినిమాను ప్రారంభించాడు. కిరణ్ హీరోగా కార్తీక్ శంకర్ అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. ఇక నేటి నుండి ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించింది.