కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

KGF Chapter 2 Telugu Movie

ట్యాగ్ · 33 కథనాలు · పేజీ 2

షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్నకె.జి.యఫ్ 2

దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 కూడా ఒకటి. కె.జి.యఫ్ సినిమా సంచలన విజయంతో ఈ సినిమా కోసం కూడా ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూాడా చేస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. ఇక యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ వ్యూస్ తో ఇప్పటికే టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూాడా పూర్తి చేసుకుంది. ఈవిషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

కె.జి.యఫ్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్

సినీ లవర్స్ కు పండగే పండగ. గత ఏడాది థియేటర్స్ లేకపోవడంతో సినిమాలను చూసే అవకాశం లేకుండా పోయింది. ఇక ఈ ఏడాది మాత్రం థియేటర్లలో వరుస సినిమాలతో సందడి నెలకొననుంది. గత వారం రోజులుగా వరుసపెట్టి సినిమా రిలీజ్ ల అప్ డేట్ లు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది రిలీజ్ అవ్వాల్సిన పెండింగ్ లో ఉన్న సినిమాలతో పాటు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల రిలీజ్ డేట్ లు కూడా వచ్చేసాయి. ఆర్ఆర్ఆర్, ఆచార్య, సర్కారు వారి పాట లాంటి పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ డేట్ లు కూడా ప్రకటించేసారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హైదరాబాద్ లో స్టార్ హీరో యశ్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో యశ్ , శ్రీనిధి శెట్టి జంటగా బ్లాక్ బస్టర్ "కెజిఎఫ్ చాప్టర్ 1 " కన్నడ మూవీ సీక్వెల్ "కెజిఎఫ్ చాప్టర్ 2 "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా పాత్రలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన "కెజిఎఫ్ చాప్టర్ 2 "మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
KGF2 Team Heads To Hyderabad For Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

హైదరాబాద్ లో "కెజిఎఫ్ 2" షూటింగ్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో స్టార్ హీరో యశ్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "కెజిఎఫ్ చాప్టర్ 1" కన్నడ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుమారు 250 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ తో హీరో యశ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

యష్ బర్త్ డే కి కె.జి.యఫ్ 2 టీజర్..?

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ సంచలన విజయంతో ఇప్పుడు కె.జి.యఫ్ 2 పై ఎంత క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా వచ్చి వారి ఎదురుచూపులకు బ్రేక్ వేసింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కరోనా వల్ల ఇంకా వెనక్కి వెళ్ళింది. ఇక ఇన్ని నెలలు కరోనా వల్ల సినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టారు. ఈ షూటింగ్ లో యష్ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ ఫైనల్ షెడ్యూల్ లోనే సంజయ్ దత్ కూడా పాల్గొనబోతున్నారు. త్వరలోనే సినిమా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కె.జి.యఫ్2 సెట్ లోఅడుగుపెట్టిన రాఖీ భాయ్

కె.జి.యఫ్ సీక్వెల్ కె.జి.యఫ్2 కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఈ కరోనా వచ్చి నిరాశనే మిగిల్చింది. ఇక ప్రస్తుతం కె.జి.యఫ్2 సినిమా షూటింగ్ చివరి దశలో వుంది. లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి షూటింగ్ పూర్తయ్యేది. ఇక ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు. ఇక ఇప్పుడు ఈ షూటింగ్ లో రాఖీ భాయ్ కూడా అడుగుపెట్టాడు. ఇక ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా తెలిపాడు. అంతేకాదు అలలను ఆపడం కష్టం.. కానీ ఆ అలలలో ఈదడం నేర్చుకోవచ్చు.. చాలా గ్యాప్ తర్వాత కె.జి.యఫ్2 లో షూట్ కు రెడీ అవుతున్నా అంటూ ఇన్స్టా లో పేర్కొన్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కె.జి.యఫ్ 2 సెట్ లో అడుగుపెట్టనున్న యష్

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్2. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టారు. బెంగ‌ళూరులో వేసిన సినిమా సెట్స్ లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ తో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఇదిలా ఉండగా ఈ షూటింగ్ లో యష్ కూడా జాయిన్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. రేపటినుండి షూటింగ్ కు వెళ్లనున్నాడట. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ షూటింగ్ మొత్తం అక్టోబర్ చివరికల్లా పూర్తి చేసుకోనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'కేజీఎఫ్ - చాప్టర్ 2'కి హైలెట్‌గా సంజయ్ దత్

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన కన్నడ చిత్రం 'కేజీఎఫ్ - చాప్టర్ 1' (2018).. పాన్ ఇండియా మూవీగా రిలీజై సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. యష్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. రెండు భాగాల కథ అయిన 'కేజీఎఫ్'కి సంబంధించిన రెండో చాప్టర్ 'కేజీఎఫ్ - చాప్టర్ 2' ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.

Team TFNవాట్సాప్
KGF 2 Team Gets Busy With Music Sessions
సినిమా వార్తలు

మ్యూజిక్ పనుల్లో బిజీగా కె.జి.ఎఫ్2 టీమ్..!

సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే సినిమాల్లో కె.జి.ఎఫ్ 2 ఒకటి అని కూడా చెప్పొచ్చు. ‘కె.జి.ఎఫ్’ బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఈ సినిమాపై కూడా అదే రేంజ్ లో అంచానాలు పెంచుకున్నారు అభిమానులు. ఇక అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పెట్టకూడదన్న నేపథ్యంలో ఈ సినిమా అవుట్ ఫుట్ కోసం కోసం చిత్ర యూనిట్ అదే రేంజ్ లో కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'KGF2' రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!

లాక్ డౌన్ వల్ల చాలా సినిమాల రిలీజ్ విషయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇక చిన్న సినిమాల సంగతేమో కానీ.. పెద్ద సినిమాల రిలీజ్ విషయంలో మాత్రం రోజుకో వార్త వస్తూనే వుంది. ఇక 'కె.జి.ఎఫ్2' సినిమా రిలీజ్ విషయంలో కూడా గత కొద్ది రోజులుగా ఈ కన్ఫ్యూజన్ నెలకొంది. ఇక ఈ విషయంపై ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చినా... ఏదో ఒక రూమర్ అయితే వస్తూనే ఉంది. ఇక తాజాగా వచ్చిన రూమర్స్ పై 'కె.జి.ఎఫ్2' నిర్మాత కార్తీక్ గౌడ స్పందించి..30 రోజుల షూటింగ్ మిగిలి ఉంద‌ని, రెండు ఫైట్స్ మిన‌హా షూటింగ్ పూర్త‌య్యింద‌న్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, జూలైలో ప్ర‌భుత్వం షూటింగ్‌కి అనుమ‌తిచ్చినా అక్టోబ‌ర్ 23నే సినిమాను…

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

KGF చాప్టర్ 2 మూవీ రిలీజ్ వాయిదా ?

దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ " KGF చాప్టర్1" కన్నడభాషలో ఘనవిజయం సాధించి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

పోరాట ఘట్టాలు మినహా 'కేజీఎఫ్: చాప్టర్ 2' పూర్తి

పాన్ ఇండియా మూవీగా రిలీజైన కన్నడ చిత్రం 'కేజీఎఫ్: చాప్టర్ 1'.. నేషనల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామాకి సంబంధించిన సెకండ్ పార్ట్ 'కేజీఎఫ్: చాప్టర్ 2'.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

టీజర్ కోసం కష్టపడుతున్న కె.జి.ఎఫ్ 2 టీమ్..!

ఒక్కసారి ఒక సినిమాపై అంచనాలు పెంచేసిన తర్వాత దానిని తప్పించడం అంత ఈజీ కాదు. దాని తర్వాత వచ్చే సీక్వెల్ పై ఆ ప్రెషర్ మాములుగా ఉండదు. అసలు మించి సీక్వెల్ అదిరిపోవాలంటే...అంతకుమించి అన్నట్టు ఉండాలి సీక్వెల్. మరి దాని కోసం దర్శకనిర్మాతల దగ్గరనుండి హీరో వరకూ ఎంత కష్టపడతారో.. ఎంత టెన్షన్ ఉంటుందో చెప్పడం కష్టం.. ఆ ప్లేస్ లో ఉంటే కానీ మనకు అర్ధమవుతుంది. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు కె.జి.ఎఫ్2 టీమ్.

TFN Adminవాట్సాప్

షేర్