టీజర్ కోసం కష్టపడుతున్న కె.జి.ఎఫ్ 2 టీమ్..!

KGF 2 Team Gets Busy In Making Final Movie Teaser

ఒక్కసారి ఒక సినిమాపై అంచనాలు పెంచేసిన తర్వాత దానిని తప్పించడం అంత ఈజీ కాదు. దాని తర్వాత వచ్చే సీక్వెల్ పై ఆ ప్రెషర్ మాములుగా ఉండదు. అసలు మించి సీక్వెల్ అదిరిపోవాలంటే…అంతకుమించి అన్నట్టు ఉండాలి సీక్వెల్. మరి దాని కోసం దర్శకనిర్మాతల దగ్గరనుండి హీరో వరకూ ఎంత కష్టపడతారో.. ఎంత టెన్షన్ ఉంటుందో చెప్పడం కష్టం.. ఆ ప్లేస్ లో ఉంటే కానీ మనకు అర్ధమవుతుంది. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు కె.జి.ఎఫ్2 టీమ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించింది. మరి ఇక్కడివరకూ బాగానే ఉంది. దీని ఎఫెక్ట్ సీక్వెల్ పై ఉంటుంది కదా. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచుస్తున్నారు. అందుకే ఈ సినిమా టీజర్ కటింగ్ విషయంలో యష్ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీనికోసం నిద్రపోకుండా మరీ టీజర్ ను కట్ చేసే పనిలో ఉన్నారట. చాలా క్రిస్ప్ గా అంతే ఇంపాక్ట్ గా టీజర్ ఉండేలా చూస్తున్నారట. మరి చూద్దాం ఎలా ఉంటుందో..

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. సంజయ్ దత్, రవీనా టాండన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబరు 23న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి చాప్టర్ 1 సూపర్ హిట్ అయింది… కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ఎలా ఉంటుందో చూడాలంటే సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చుద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.