కె.జి.యఫ్ 2 సెట్ లో అడుగుపెట్టనున్న యష్

Actor Yash To Join Back The Sets Of KGF2

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్2. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టారు. బెంగ‌ళూరులో వేసిన సినిమా సెట్స్ లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ తో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఇదిలా ఉండగా ఈ షూటింగ్ లో యష్ కూడా జాయిన్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. రేపటినుండి షూటింగ్ కు వెళ్లనున్నాడట. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ షూటింగ్ మొత్తం అక్టోబర్ చివరికల్లా పూర్తి చేసుకోనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో…ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.

మరి అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా కోసం. ఇక థియేటర్స్ కూడా త్వరలోనే ప్రారంభమవుతున్నాయి. చూడబోతే త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 9 =