
ట్యాగ్ · 13 కథనాలు


డెవిల్ కోసం కళ్యాణ్ రామ్ కసరత్తులు

సెన్సార్ పూర్తిచేసుకున్న 'బింబిసార'

ప్రభాస్ పై కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు

అందుకే 'ఎన్టీఆర్ 30' ఆలస్యం..!

బాబాయి తోనే నా సినీ జర్నీ మొదలైంది..!

అఫీషియల్.. మైత్రీ తో కళ్యామ్ రామ్ సినిమా..!
హీరో కళ్యాణ్ రామ్ న్యూ లుక్
కళ్యాణ్ రామ్ 'తుగ్లక్' కాదు 'రావణ'

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కళ్యాణ్‌రామ్?

`తుగ్లక్`గా కళ్యాణ్ రామ్?

వేసవి నుంచి కళ్యాణ్ రామ్ చిత్రం?

బింబిసార 2-ఈ ఏడాది చివరి నుండి స్టార్ట్
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన రూట్ ను మార్చి విభిన్నమైన కథనలను ఎంటుకుంటూ వెళుతున్నాడు. చాలా గ్యాప్ తరువాత గతఏడాదే బింబిసార అంటూ కెరీర్ లోనే మొదటిసారి డిఫరెంట్ కథతో వచ్చాడు కళ్యాణ్ రామ్. మల్లిడి విశిష్ట అనే కొత్త దర్శకుడితో బింబిసార సినిమా తీసి సూపర్ హిట్ ను కొట్టాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్.. బింబిసారుడుగా, దేవదత్తుడుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంటున్నాడు. ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే.

అమిగోస్ బాలయ్య రీమిక్స్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
కళ్యాణ్ రామ్ మొత్తానికి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా అమిగోస్. ఈసినిమాలో ఏకంగా మూడు పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అందులో ఒక పాత్ర నెగెటివ్ షేడ్ లో రెండు పాత్రలు కాస్త విభిన్నంగా ఉండేలా కనిపిస్తున్నాయి. కేవలం ఫస్ట్ లుక్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. ఈసినిమా ఫిబ్రవరి 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

డెవిల్ కోసం కళ్యాణ్ రామ్ కసరత్తులు
ఈమధ్య కళ్యాణ్ రామ్ కూడా తన రూట్ మార్చి కొత్త ప్రయోగాలు చేయడానికి ముందుకొస్తున్నాడు. అలా రీసెంట్ గా బింబిసార సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. పీరియాడికల్ సినిమాగా వచ్చిన ఈసినిమాలో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ పాత్రలో అలరించాడు. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో డెవిల్ సినిమా కూడా ఒకటి. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. నిజానికి ఈసినిమాను ఎప్పుడో ప్రారంభించారు. ఈసినిమా కూడా 1945 కాలం నాటి పీరియాడిక్ సినిమాగా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో కళ్యాణ్‌రామ్ ఈ సినిమాలో రహస్య గూఢాచారిగా కనిపించనున్నాడు.

సెన్సార్ పూర్తిచేసుకున్న 'బింబిసార'
వశిష్ఠ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ బింబిసార. టైమ్ ట్రావెల్, పీరియాడిక్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు మొదటి నుండి మంచి బజ్ ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌తో పాటు లిరికల్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదల చేశారు. అది కూడా ఆకట్టుకుంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని వ్యూస్ తో దూసుకుపోతుంది.

ప్రభాస్ పై కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.హీరో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించిన , హై టెక్నికల్ వాల్యూస్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన…

అందుకే 'ఎన్టీఆర్ 30' ఆలస్యం..!
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్. ఇక ఈసినిమా అయిపోయింది కాబట్టి తమ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ శంకర్ తో చేస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ఎన్టీఆర్ కొరటాల శివతో తన తరువాత ప్రాజెక్ట్ ను చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తుంది ఎన్టీఆర్ 30వ సినిమా కోసం. ఈసినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా ఇప్పటికే మొదలవ్వాలి కానీ అనుకోకుండా ఆలస్యమవుతూ వస్తుంది. అయితే సెప్టెంబర్ నుండి ఈసినిమా సెట్స్ పైకి వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పలు వార్తలు…

బాబాయి తోనే నా సినీ జర్నీ మొదలైంది..!
ఇప్పటివరకూ కమర్షియల్ సినిమాలు, యాక్షన్ ఎంటర్ టైనర్ లతో ప్రేక్షకులను అలరించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు మొదటిసారి కెరీర్ లోనే డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. బింబిసార అనే సోషియో ఫాంటసీ సినిమాతో వస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.. ఈనెల 29వ తేదీన ఈసినిమా ప్రీరిలీజ్ ను నిర్వహించనున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రానున్నారు.

అఫీషియల్.. మైత్రీ తో కళ్యామ్ రామ్ సినిమా..!
కళ్యామ్ రామ్ కూడా ఒక్కొక్క సినమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సోషియో ఫాంటసీ మూవీ బింబిసార రిలీజ్ కు సిద్దమవుతుంది. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈసినిమాలో కేథరిన్ థెరిసా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఆగష్ట్ 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
హీరో కళ్యాణ్ రామ్ న్యూ లుక్
"బాలగోపాలుడు "మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు కళ్యాణ్ రామ్ పరిచయం అయ్యారు.సూపర్ హిట్ "అతనొక్కడే ", "హరే రామ్ ", "పటాస్ ", "118" మూవీస్ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి కళ్యాణ్ రామ్ పలు సక్సెస్ ఫుల్ మూవీస్ ను నిర్మించారు. హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ తో కలసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా "NTR 30 " మూవీ ని నిర్మించనున్నారు. కళ్యాణ్ రామ్ ఇప్పుడు హీరోగా రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కళ్యాణ్ రామ్ 'తుగ్లక్' కాదు 'రావణ'
ఇటీవలే '118' సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కళ్యాణ్ రామ్.. నూతన దర్శకుడు మల్లిడి వశిష్టతో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇక ఈ సినిమాకి 'తుగ్లక్' అనే టైటిల్ ను అనుకున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు ఆ టైటిల్ ను మార్చనున్నట్టు తెలుస్తోంది. తుగ్లక్ అనే టైటిల్ అంత క్యాచీగా లేదని... పెద్దగా రీచ్ అవ్వదని భావించి 'రావణ' అనే టైటిల్ ను మార్చనున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట చిత్రయూనిట్.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కళ్యాణ్‌రామ్?
ఓ వైపు కథానాయకుడిగా రాణిస్తూనే… మరోవైపు నిర్మాతగానూ ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మిస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇటీవల ‘118’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కళ్యాణ్… ప్రస్తుతం సోషియో ఫాంటసీ ఫిలిమ్ ‘తుగ్లక్’లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇది సెట్స్‌పై ఉండగానే మరో సినిమాలో నటించేందుకు కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

`తుగ్లక్`గా కళ్యాణ్ రామ్?
`118` విజయం... నందమూరి కళ్యాణ్ రామ్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలో... మరింత జోష్‌తో తన తదుపరి చిత్రాలకు సన్నధ్ధమవుతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. వినిపిస్తున్న కథనాల ప్రకారం... కళ్యాణ్ రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ డైరెక్షన్‌లో ఉంటుందని టాలీవుడ్ టాక్. అంతేకాదు... ఈ సినిమాని తన సొంత సంస్థ యన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ పై నిర్మించే అవకాశముందని సమాచారం. కాగా... సోషియో ఫాంటసీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకి `తుగ్లక్` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అలాగే అవుట్ అండ్ అవుట్ హిలేరియస్…

వేసవి నుంచి కళ్యాణ్ రామ్ చిత్రం?
`ఉయ్యాలా జంపాలా`, `మజ్ను` చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు విరించి వర్మ. ఈ యువ దర్శకుడు అతి త్వరలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తన తదుపరి చిత్రాన్ని రూపొందించనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా భావోద్వేగాలకు పెద్ద పీట వేసే కథాంశంతో తెరకెక్కనుందని తెలుస్తోంది. వేసవి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడతాయి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్... యాక్షన్ థ్రిల్లర్…