అమిగోస్ బాలయ్య రీమిక్స్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Enno Ratrulosthayi Remix Song Release Date Fixed From Amigos Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Amigos,Amigos Movie,Amigos Telugu Movie,Amigos Update,Amigos Updates,Amigos Movie Updates,Amigos Movie Update,Amigos Movie Latest Updates,Amigos Movie Latest Update,Amigos Latest Update,Amigos Latest Updates,Amigos Telugu Movie Latest Updates,Amigos Movie News,Amigos Telugu Movie Latest News,Amigos Movie Latest News,Kalyan Ram,Kalyan Ram Movies,Kalyan Ram New Movie,Kalyan Ram Latest Movie,Kalyan Ram Upcoming Movie,Kalyan Ram New Movie Updates,Kalyan Ram Latest Movie Updates,Kalyan Ram Movie Updates,Kalyan Ram Movie News,Kalyan Ram New Projects,Kalyan Ram Latest Projects,Kalyan Ram Upcoming Projects,Kalyan Ram Next Projects,Kalyan Ram Latest News,Kalyan Ram Movie Updates,Kalyan Ram Amigos,Kalyan Ram Amigos Movie,Enno Ratrulosthayi Remix Song,Enno Ratrulosthayi Song,Enno Ratrulosthayi Remix Song Release Date,Enno Ratrulosthayi Song Release Date,Amigos Songs,Amigos Movie Songs,Amigos Telugu Movie Songs,Amigos Telugu Songs,Amigos Movie Enno Ratrulosthayi Remix Song,Enno Ratrulosthayi Remix Song Amigos Movie

కళ్యాణ్ రామ్ మొత్తానికి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా అమిగోస్. ఈసినిమాలో ఏకంగా మూడు పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అందులో ఒక పాత్ర నెగెటివ్ షేడ్ లో రెండు పాత్రలు కాస్త విభిన్నంగా ఉండేలా కనిపిస్తున్నాయి. కేవలం ఫస్ట్ లుక్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. ఈసినిమా ఫిబ్రవరి 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే వరుసగా పాటలను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ఫ్రెండ్ షిప్ మీద ఒక పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయనున్నారు. ఎన్నోరాత్రులొస్తాయి కానీ అనే పాటను రిలీజ్ చేయనున్నారు. ఈపాట బాలకృష్ణ, దివ్యభారతి నటించిన ధర్మక్షేత్రం సినిమాలోని ఎన్నో రాత్రులొస్తాయి.. కానీ పాటకు రీమిక్స్ అన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈపాట రిలీజ్ కు డేట్ ను టైమ్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. జనవరి 29న సాయంత్రం 5 గంటలకు ఈ రెండో పాటను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ చేస్తుంది. ఈసినిమాతో తెలుగు తెరకి ఆషిక రంగనాథ్ పరిచయమవుతోంది. ఇంకా ఈసినిమాలో ఇంకా బ్రహ్మాజి, సప్తగిరి, ర‌వి ప్రకాష్, శివ‌న్నారాయ‌ణ‌, చైత‌న్య కృష్ణ, ర‌ఘు కారుమంచి, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సోనాక్షి వ‌ర్మ త‌దిత‌రులు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =