నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన రూట్ ను మార్చి విభిన్నమైన కథనలను ఎంటుకుంటూ వెళుతున్నాడు. చాలా గ్యాప్ తరువాత గతఏడాదే బింబిసార అంటూ కెరీర్ లోనే మొదటిసారి డిఫరెంట్ కథతో వచ్చాడు కళ్యాణ్ రామ్. మల్లిడి విశిష్ట అనే కొత్త దర్శకుడితో బింబిసార సినిమా తీసి సూపర్ హిట్ ను కొట్టాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్.. బింబిసారుడుగా, దేవదత్తుడుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంటున్నాడు. ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా అప్ డేట్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నుండి వస్తున్న సినిమా అమిగోస్. ఈసినిమా కూడా డిఫరెంట్ కథతో రాబోతుంది. ఫిబ్రవరి 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సందర్భంగా ఓ ఇంటర్య్వలో పాల్గొన్న కళ్యాణ్ రామ్.. బింబిసార 2 గురించి చెబుతూ ఈ ఏడాది చివరలో తాము స్టార్ట్ చేయనున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు.
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ చేస్తుంది. ఈసినిమాతో తెలుగు తెరకి ఆషిక రంగనాథ్ పరిచయమవుతోంది. ఇంకా ఈసినిమాలో ఇంకా బ్రహ్మాజి, సప్తగిరి, రవి ప్రకాష్, శివన్నారాయణ, చైతన్య కృష్ణ, రఘు కారుమంచి, కళ్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, సోనాక్షి వర్మ తదితరులు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్.సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: