ట్యాగ్ · 32 కథనాలు · పేజీ 2
ఎన్టీఆర్ కోసం రోహిత్ స్పెషల్ గిఫ్ట్..!
అభిమానులకు శుభవార్త
తన స్టాఫ్ కు అండగా నిలిచిన ఎన్టీఆర్..!
"ఎన్టీఆర్ 30" లో మరో యంగ్ హీరో ?
స్టైలిష్ బిజినెస్ మెన్ గా ఎన్టీఆర్
మలయాళ భాష ప్రాక్టీస్ లో ఎన్టీఆర్
యన్టీఆర్ పుట్టినరోజున డబుల్ ట్రీట్?

స్టార్ డైరెక్టర్లతోనే యన్టీఆర్ వరుస చిత్రాలు
పెళ్లి చూపులు డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా...?

`అసురన్` దర్శకుడితో యన్టీఆర్?
భారీ చిత్రాల హీరో ఎన్టీఆర్
టాలీవుడ్ లో ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాలతో యంగ్ రెబల్ స్టార్ ముందుండగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 400 కోట్ల తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో నటిస్తున్నారు.
ఎన్టీఆర్ కోసం రోహిత్ స్పెషల్ గిఫ్ట్..!
ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఎవరి ఏర్పాట్లలో వాళ్ళు ఉన్నారు. ఒక పక్క అభిమానులు తమ హీరో బర్త్ డే సందర్భంగా ఏ సినిమా ఏ అప్ డేట్ వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ నుండి పెద్ద సర్ప్రైజ్ ఏ ఉంటుందని ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమానుండి ఏదో ఒక అప్డేట్ వస్తుందని.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోను ఒక సినిమా చేయనున్నట్టు కూడా వార్తలు వస్తుండటంతో ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు గురించిన కూడా ప్రకటన రావొచ్చని అనుకుంటున్నారు.
అభిమానులకు శుభవార్త
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం " మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత #NTR30 మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనుంది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కన్నడ మూవీ రికార్డ్స్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. #NTR30 మూవీ తరువాత ఈ మూవీ తెరకెక్కనుంది.
తన స్టాఫ్ కు అండగా నిలిచిన ఎన్టీఆర్..!
కరోనా నిర్మూలనలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు...రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నాయి. వాటితో పాటు పేదలకు అండగా నిలుస్తూ ఉదారత చాటుకుంటున్నారు చాలా మంది ప్రముఖులు. కేవలం సెలబ్రిటీస్ మాత్రమే కాదు.. సామాన్య ప్రజలు కూడా తమ స్థోమతకు తగిన విధంగా సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సినీ కార్మికుల కోసం చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో సాయం అందిస్తున్నారు.
పీరియాడికల్ డ్రామాగా ఎన్టీఆర్ 31 మూవీ.. విలన్ గా రణవీర్ సింగ్..?
స్టార్ హీరో సినిమా అంటే రూమర్స్ రావడం కామన్ థింగ్. ఏం చేసిన వాటిని ఆపడం కష్టం. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ పై కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటే బయటకు వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ గా ఉన్నాడు. గత రెండేళ్లుగా మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుపుకుంటూనే ఉంది. దాదాపు చివరి దశకు రాగా కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది.
"ఎన్టీఆర్ 30" లో మరో యంగ్ హీరో ?
హారిక &హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా "ఎన్టీఆర్ 30" మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. "రౌద్రం రణం రుధిరం " మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత ప్రారంభం అయ్యే ఈ మూవీ లో ఒక యంగ్ హీరో కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. దర్శకుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు.
స్టైలిష్ బిజినెస్ మెన్ గా ఎన్టీఆర్
ఎటువంటి పాత్రనైనా తనదైన స్టైల్ లో రక్తి కట్టించే జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం" మూవీ లో ట్రైబల్ లీడర్ కొమరం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్నారని సమాచారం. "RRR"మూవీ తరువాత ఎన్టీఆర్ మరోమూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మలయాళ భాష ప్రాక్టీస్ లో ఎన్టీఆర్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం" మూవీ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. అన్ని భాషలలోనూ తన పాత్ర కు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. హీరో రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన "RRR" మూవీ వీడియో కి ఒక్క మలయాళ భాషలో తప్ప మిగతా భాషలన్నిటికీ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.
యన్టీఆర్ పుట్టినరోజున డబుల్ ట్రీట్?
మే 20.. యంగ్ టైగర్ యన్టీఆర్ అభిమానులకు వెరీ స్పెషల్ డే. ఎందుకంటే.. ఆ రోజు తారక్ పుట్టినరోజు. అభిమానులకు పండగ రోజు. అలాంటి రోజున తారక్ నుంచి ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ అందనుందని సమాచారం.

స్టార్ డైరెక్టర్లతోనే యన్టీఆర్ వరుస చిత్రాలు
యంగ్ టైగర్ యన్టీఆర్ ఈ మధ్య సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘అరవింద సమేత’ నుంచి అగ్ర దర్శకులతోనే వరుస చిత్రాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రీవియస్ మూవీ ‘అరవింద సమేత’ని సెల్యూలాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో చేసిన తారక్.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’(‘రౌద్రం రణం రుధిరం’) ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో చేస్తున్నారు. మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ పేట్రియాటిక్ డ్రామా.. 2021 సంక్రాంతికి రిలీజ్ కానుంది. కాగా, ఈ చిత్రం తరువాత తారక్ నుంచి రాబోతున్న సినిమాలు కూడా అగ్ర దర్శకుల కలయికలోనే…
పెళ్లి చూపులు డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా...?
మొదటి సినిమా పెళ్లి చూపులు సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి. మధ్యలో ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తానే హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కూడా తీసాడు. ఇక తన తరువాత సినిమా వెంకీ ఉన్నట్టు ఇటీవలే వార్తలు కూడా వచ్చాయి.

`అసురన్` దర్శకుడితో యన్టీఆర్?
యంగ్ టైగర్ యన్టీఆర్ ప్రస్తుతం `డైరెక్టర్ నంబర్ వన్` రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`తో బిజీగా ఉన్నాడు. 2021 సంక్రాంతికి ఈ పేట్రియాటిక్ డ్రామా థియేటర్లలో సందడి చేయనుంది. ఈలోపే సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీని పట్టాలెక్కించబోతున్నాడు యన్టీఆర్. `అయినను పోయి రావాలె హస్తినకు` పేరుతో ఈ సినిమా రూపొందనుందని టాక్. అంతేకాదు.. మరో క్రేజీ ప్రాజెక్ట్ కి కూడా తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వినిపిస్తోంది.