ట్యాగ్ · 10 కథనాలు
అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా మరోసారి ?
కథా చర్చలలో "ఐకాన్ "
'ఐకాన్' సాలిడ్ లుక్ లో బన్నీ..!
'ఐకాన్' పై దిల్ రాజు క్లారిటీ
'ఐకాన్' కు మంచి స్టోరీ లైన్ ఉంది
బన్నీ 'ఐకాన్' రావడం పక్కా - వేణు శ్రీరామ్
పవన్ సినిమా తర్వాత 'ఐకాన్' సినిమానే..!

ప్రయోగాత్మక చిత్రంగా 'ఐకాన్'..!

బన్నీ 'ఐకాన్' పై రూమర్లకు చెక్..!
'ఐకాన్' ప్రారంభానికి సన్నాహాలు
బన్నీ ఐకాన్.. ఈసినిమా ఇప్పటి వరకూ ప్రారంభంకాలేదు కానీ.. ఏదో ఒక వార్తలతో మాత్రం ఎప్పుడూ ఫోకస్ లోనే ఉంటుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకూ ఈసినిమా సెట్స్ పైకి వెళ్లలేకపోయింది. ఇక ఈమధ్య కాలంలో అయితే అసలు ఈసినిమా అల్లు అర్జున్ చేయట్లేదని.. ఆగిపోయిందని కూడా అనుకున్నారు అందరూ. వార్తలకు తగ్గట్టూ ఎవరూ స్పందించకపోవడంతో నిజంగానే సినిమా అటకెక్కిందేమో అనుకున్నారు. కానీ నిర్మాత బన్నీ వాసు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బన్నీ పుష్ప తరువాత ఈ సినిమానే చేస్తున్నాడు అని చెప్పడంతో క్లారిటీ వచ్చింది.
అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా మరోసారి ?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 2 భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప"మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తరువాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "వకీల్ సాబ్" మూవీ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న "ఐకాన్ "మూవీ కి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరోయిన్ గా పూజాహెగ్డే ని సంప్రదిస్తున్నట్టు సమాచారం.
కథా చర్చలలో "ఐకాన్ "
బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. " మూవీ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 2 భాగాలుగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప " మూవీ లో నటిస్తున్న విషయంతెలిసిందే . రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ "పుష్ప - ది రైజ్ "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. "పుష్ప - ది రైజ్ "మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , పుష్ప రాజ్ పరిచయ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
'ఐకాన్' సాలిడ్ లుక్ లో బన్నీ..!
ఈమధ్య సినిమాల్లో ఏదైనా కొత్తదనం ఉంటేనే ఆడియన్స్ కూడా సినిమాలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకూ కథలోనే కాదు తమ లుక్ విషయంలో కూడా సినిమా సినిమాకు డిఫరెన్స్ చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఫార్ములాను అల్లు అర్జున్ కూడా ఫాలో అయిపోతున్నాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలోనే తన డీగ్లామర్ లుక్ లోకి మారిపోయి కొత్తగా ట్రై చేస్తున్నాడు. పుష్ప లుక్ కు మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు రాబోయే సినిమా ఐకాన్ కోసం కూడా సాలిడ్ లుక్ ను లాక్ చేసినట్టు తెలుస్తుంది.
'ఐకాన్' పై దిల్ రాజు క్లారిటీ
చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా సరే దిల్ రాజు కమిట్ అయ్యాడంటే అది దాదాపు పూర్తయినట్టే. సినిమా కోసం వంద శాతం ఎఫర్ట్ పెట్టే నిర్మాతల్లో ఒకడు కాబట్టే టాలీవుడ్ లో నెంబర్ వన్ నిర్మాతగా దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గానే వకీల్ సాబ్ సినిమాతో మరోహిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇదిలా ఉండగా తన నిర్మాణంలో పెండింగ్ లో ఉన్న ఐకాన్ పై ఇప్పుడు నోరు విప్పాడు దిల్ రాజు.
'ఐకాన్' కు మంచి స్టోరీ లైన్ ఉంది
మొత్తానికి ఏది ఎలా ఉన్నా ఈసారి పరిస్థితులు బన్నీ ఐకాన్ సినిమాకు మాత్రం కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈసినిమా ఇంతవరకూ ఆ అదృష్టానికి నోచుకోలేదు. సినిమాను అయితే ఎప్పుడో ప్రకటించారు కానీ అప్పటినుండి ఎవరు చెప్పినా సినిమా పక్కా ఉంటుంది.. ఉంటుంది అంటున్నారే తప్పా ట్రాక్ లోకి తీసుకురావడంలేదు. ‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ ఈ సినిమానే చేస్తాడని అప్పుడు అందరూ అనుకున్నారు కానీ.. దాన్ని పక్కన పెట్టి ‘అల వైకుంఠపురములో’ను లైన్లో పెట్టేశాడు. ఈసినిమా తరువాత అయినా చేస్తాడనుకుంటే వెంటనే పుష్ప సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
బన్నీ 'ఐకాన్' రావడం పక్కా - వేణు శ్రీరామ్
బన్నీ ఐకాన్ సినిమా.. ఈ సినిమా ప్రకటించిన దగ్గరనుండి వార్తల్లోనే ఎక్కువ నిలిచింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం లో బన్నీ హీరోగా ఐకాన్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2019 లోనే ఈ సినిమాను ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ముందుకు వెళ్లలేకపోయింది. దానికి తోడు బన్నీ త్రివిక్రమ్ తో సినిమా మొదలుపెట్టేసరికీ అప్పట్లో ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ బన్నీ పుట్టినరోజున చిత్రయూనిట్ తరపున విషెస్ చెప్పి సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు.
పవన్ సినిమా తర్వాత 'ఐకాన్' సినిమానే..!
శ్రీరామ్ వేణు దర్శకత్వం లో బన్నీ హీరోగా ఐకాన్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2019 లోనే ఈ సినిమాను ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ముందుకు వెళ్లలేకపోయింది. దీనితో ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే అదేంలేదంటూ ఇటీవలే క్లారిటీ ఇచ్చారు.

ప్రయోగాత్మక చిత్రంగా 'ఐకాన్'..!
శ్రీరామ్ వేణు దర్శకత్వం లో బన్నీ హీరోగా ఐకాన్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా సుకుమార్ సినిమా కంటే ముందే మొదలవ్వాలి కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా లేట్ అయింది. ఇక ప్రస్తుతం శ్రీరామ్ వేణు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో బిజీ గా వున్నాడు. మరోవైపు బన్నీ సుకుమార్ సినిమాతో బిజీగా వున్నాడు. వారి సినిమాలు పూర్తయిన తర్వాత వీరిద్దరి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

బన్నీ 'ఐకాన్' పై రూమర్లకు చెక్..!
మొత్తానికి రూమర్లకు చెక్ పెట్టారు బన్నీ 21 చిత్రయూనిట్. ఇన్నిరోజులు ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఒక్క పోస్టర్ తో గాసిప్ రాయుళ్ల నోర్లు మూయించారు. బర్త్‌డే విషెష్ చెబుతూ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. పోస్టర్ పాతదే... మళ్ళీ పోస్ట్ చేసి ఈ సినిమా పక్కన పెట్టలేదన్న క్లారిటీ ఇచ్చారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బన్నీ కి జంటగా నటించేది ఎవరు అలాగే మిగితా నటీనటులు వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.