
ట్యాగ్ · 33 కథనాలు · పేజీ 2


రామ్ చరణ్ "రంగస్థలం " స్వీట్ మెమరీస్

చరణ్ బర్త్ డే కు చిరు స్పెషల్ వీడియో
అలియా పై రామ్ చరణ్ ప్రశంసలు
ఆచార్య - 'సిద్ధ' గా చెర్రీ
మెగా - మంచు దీపావళి
మిడ్ నైట్ చలిలో 'ఆర్ఆర్ఆర్' టీమ్ షూటింగ్

దీపావళి సెల్ఫీ
'ఆర్ఆర్ఆర్' టీమ్ నుండి దీపావళి విషెస్
రామ్ చరణ్ ట్విట్టర్ రికార్డ్
ఫైట్ సీక్వెన్స్ షూట్ లో 'ఆర్ఆర్ఆర్'

రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్
సూపర్ హిట్ "చిరుత " మూవీ తో పరిచయం అయిన రామ్ చరణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య "మూవీ లో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

రామ్ చరణ్ "రంగస్థలం " స్వీట్ మెమరీస్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా "రంగస్థలం "మూవీ 2018 సంవత్సరం మార్చి 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వినికిడి లోపం ఉన్న చిట్టి బాబు గా రామ్ చరణ్ , రామలక్ష్మి గా సమంత , రంగమ్మత్త గా అనసూయ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

చరణ్ బర్త్ డే కు చిరు స్పెషల్ వీడియో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు తన 36 వ బర్త్ డే ను జరుపుకుంటున్నారు.హీరో రామ్ చరణ్ కు సినీ ప్రముఖుల , అభిమానుల బర్త్ డే శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అనేక చోట్ల రామ్ చరణ్ బర్త్ డే వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం "రౌద్రం రణం రుధిరం "మూవీ లో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. చరణ్ బర్త్ డే సందర్భం గా ఆ చిత్ర యూనిట్ అల్లూరి సీతారామరాజు లుక్ ను రిలీజ్ చేశారు . ఆ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

'ఆర్ఆర్ఆర్' - అదిరిపోయిన చరణ్ 'రామరాజు' లుక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులందరూ ఎదురుచూస్తున్న టైమ్ రానేవచ్చేసింది. నేడు రామ్ చరణ్ పుట్టిన రోజుకావడంతో ఆర్ఆర్ఆర్ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక చెప్పినట్టే రామ్ చరణ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్ ఇచ్చారు. రామరాజు లుక్ ను రిలీజ్ చేశారు. చేతిలో విల్లుతో చరణ్ పోస్టర్ మాత్రం అదిరిపోయింది. ఇక చరణ్ లుక్ ని చూసి అభిమానులు సంబర పడిపోతున్నారు.
'ఆర్ఆర్ఆర్'.. చరణ్ బర్త్ డే కి స్పెషల్ పోస్టర్
భీమ్ ఫర్ రామరాజు ఈ వీడియో వచ్చి ఏడాది అవుతుంది. గత ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ చరణ్ ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేశాడు. ఇక అప్పుడే ఏడాది అవుతుంది. మరో వారం రోజుల్లో రామ్ చరణ్ పుట్టిన రోజు రానుంది. ఇక ఈపుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ కు సంబంధించిన ఏదైనా అప్ డేట్ వస్తుందా లేదా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా కూడా అప్ డేట్ ఉందా లేదా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఇక ఇప్పుడు ఈవిషయంలో తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చి క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. చరణ్ పుట్టినరోజు నాడు రామరాజు కు సంబంధించి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా…
అలియా పై రామ్ చరణ్ ప్రశంసలు
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో ఆలియా భట్ నటిస్తున్న సినిమా గంగూబాయికతియావాడీ. ఈ సినిమా టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా అందులో అలియా నటన చూసినవారందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలియా భట్ మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది
ఆచార్య - 'సిద్ధ' గా చెర్రీ
కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవలే తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా.
మెగా - మంచు దీపావళి
మెగా ఫ్యామిలీ- మంచు ఫ్యామిలీల మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పుడప్పుడు చిరు,మోహన్ బాబు సరదాగా కౌంటర్లు వేసుకున్నా రెండు ఫ్యామిలీస్ మధ్య బంధం వేరు. కేవలం ఈ రెండు ఫ్యామిలీస్ మాత్రమే కాదులెండి టాలీవుడ్ లో అక్కినేని,మెగా,నందమూరి, దగ్గుబాటి, మంచు ఫ్యామిలీస్ దాదాపు సన్నిహిత్యంగానే ఉంటాయి. ఇక హీరోస్ మంచు మనోజ్, చరణ్, ఎన్టీఆర్, రానా, మహేష్ వీళ్ళ మధ్య ఫ్రెండ్ షిప్ కూడా అందరికీ తెలుసు.
మిడ్ నైట్ చలిలో 'ఆర్ఆర్ఆర్' టీమ్ షూటింగ్
కరోనా వల్ల ఆర్ఆర్ఆర్ షూటింగ్ కి చాలా గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టగా టీం మాత్రం నిర్విరామంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఒక్కసారి కమిట్ అయితే ఎంత కష్టమైనా షూటింగ్ కు మాత్రం బ్రేక్ చెప్పడు. ఇక ఇప్పటికే షూటింగ్ కు సంబంధించి పలు వీడియోలు పోస్ట్ చేయగా ఇప్పుడు మరో వీడియో ను ఆర్ఆర్ఆర్ టీం పోస్ట్ చేసింది. ఇక వీడియోలో చూస్తుంటే చలికి వణుకుతూ షూటింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.

దీపావళి సెల్ఫీ
ప్రజల జీవితాలలో వెలుగులు నింపే దీపావళి పండగను దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ఘనంగా జరుపుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి, తన తనయుడు రామ్ చరణ్ తో పాటు కుటుంబ సభ్యులతో దీపావళి పండుగను వైభవంగా జరుపుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న "ఆచార్య " మూవీ లో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించనున్నారు. "ఆచార్య "మూవీ లో చిరంజీవి ,రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకొని అభిమానులను అలరించనున్నారు.
'ఆర్ఆర్ఆర్' టీమ్ నుండి దీపావళి విషెస్
ఈ మధ్య ఆర్ఆర్ఆర్ నుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ అభిమానులకు కాస్త ఊరట కలిగిస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా రేపు దీపావళి కావడంతో అభిమానులకు మరో సర్ఫరైజ్ ఇచ్చారు. అందరికీ దీపావళి విషెస్ చెపుతూ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. ఇక ఫొటోల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ తెలుపు రంగు దుస్తుల్లో దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. తారక్, చెర్రీకి రాజమౌళి ఏదో వివరిస్తున్నట్లు ఓ ఫొటో ఉంది. వారి ముగ్గురి వెనుక ఆర్ఆర్ఆర్ అనే అక్షరాలు కనపడుతున్నాయి. చెర్రీ, తారక్ కలిసి, అలాగే విడివిడిగా కూడా ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం సోషల్…
రామ్ చరణ్ ట్విట్టర్ రికార్డ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీతారాగణం తో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా "రౌద్రం రణం రుధిరం " మూవీ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న రామ్ చరణ్ , కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా రూపొందుతున్న "ఆచార్య "మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. రామ్ చరణ్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
ఫైట్ సీక్వెన్స్ షూట్ లో 'ఆర్ఆర్ఆర్'
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా..ఫైనల్ గా ఇటీవలే షూట్ ను స్టార్ట్ చేశారు. ఇక ఇటీవలే ఈ సెట్ లో హాలీవుడ్ నటి.. ఈ సినిమాలో లేడీ స్కాట్ గా చేస్తున్న ఆలిసన్ డూడి అడుగుపెట్టేసింది. బాలీవుడ్ నటి అలియా భట్ కూడా త్వరలోనే సెట్ లో అడుగుపెట్టనుంది.