
ట్యాగ్ · 11 కథనాలు


గుర్తుందా శీతాకాలం ఫైనల్ రిలీజ్ డేట్

గుర్తుందా శీతాకాలం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

ఛాలెంజింగ్ పాత్రలకై ఎదురుచూస్తున్నా - సత్యదేవ్

డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తో తమన్నా బిజీ

బాలీవుడ్ ఎంట్రీ ఊహించలేదు

ఫుల్ జోష్ లో సత్యదేవ్
'గుర్తుందా శీతాకాలం' ఫన్ ఫస్ట్ షెడ్యూల్
'గుర్తుందా శీతాకాలం' - అతిథి పాత్రలో మేఘ

ఆ క్లాసిక్ మూవీ రీమేక్ చేయాలని ఉంది
టాలీవుడ్ లో టాలెంటెడ్ నటులు చాలా మందే ఉన్నారు. వారిలో సత్యదేవ్ పేరు ముందు వరుసలోనే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాందించుకున్నాడు సత్యదేవ్. పాత్ర ఏదైనా సరే.. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసే సత్తా ఉన్న నటుడు. అందుకే ప్రస్తుతం కెరీర్ లో బిజీ అయిపోయాడు. ఒక పక్కహీరో పాత్రలు చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కీలక పాత్రలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈనేపథ్యంలోనే ఇటీవల గాడ్ ఫాదర్ లో తను ఒక కీలక పాత్రలో నటించగా ఆ పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇక ఇప్పుడు హీరోగా వస్తున్న గుర్తుందా శీతాకాలం సినిమా రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు.

గుర్తుందా శీతాకాలం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా
తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో సుమారు 17 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్రస్తుతం సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం, చిరంజీవి భోళా శంకర్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. తలైవా రజనీకాంత్ జైలర్ మూవీ లో తమన్నా ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. D 147 మూవీ తో తమన్నా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

గుర్తుందా శీతాకాలం ఫైనల్ రిలీజ్ డేట్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా వస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ఈసినిమా కన్నడ సూపర్ హిట్ మూవీ లవ్ మాక్ టైల్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి కూడా తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగశేఖర్ తెరెక్కిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.ఇక ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ పలు కారణాలవల్ల ఇప్పటివరకూ రిలీజ్ కాలేకపోయింది. అంతేకాదు ఇప్పటికే రెండు మూడుసార్లు రిలీజ్ డేట్ ను కూడా మార్చారు. కానీ రిలీజ్ కాలేదు. ఇప్పుడు తాజాగా ఈసినిమా ఫైనల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్…

గుర్తుందా శీతాకాలం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
చిన్న చిన్న పాత్రలు వేసే స్థాయి నుండి ఇప్పుడు హీరోగా వరుస అవకాశాలతో సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన తమన్నాతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గుర్తుందా శీతాకాలం టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. కన్నడ సూపర్ హిట్ మూవీ లవ్ మాక్ టైల్ సినిమాకు ఈసినిమా రీమేక్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగశేఖర్ తెరెక్కిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

ఛాలెంజింగ్ పాత్రలకై ఎదురుచూస్తున్నా - సత్యదేవ్
విలక్షణ నటుడు సత్యదేవ్ ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం”, “గాడ్సే”, “స్కైలాబ్ ” మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. “రామ్ సేతు” హిందీ , చిరంజీవి "గాడ్ ఫాదర్ " మూవీస్ లో సత్యదేవ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సత్యదేవ్ కథానాయకుడిగా తెరకెక్కిన “స్కైలాబ్ ” మూవీ డిసెంబర్ 4వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సత్యదేవ్ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు . స్కైలాబ్ " మూవీ సిట్యువేషనల్ కామెడీ మూవీ అనీ , తాను నటిస్తున్న తొలి వినోదాత్మక చిత్రమనీ , ఎక్కువగా సీరియస్ పాత్రలు చేస్తూ వచ్చాననీ , ఈ మూవీ లో తన పాత్ర ఫన్నీ గా ఉంటుందనీ, ఈ సినిమా కోసం తొలిసారి తెలంగాణ యాసలో సంభాషణలు పలికాననీ చెప్పారు.

డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తో తమన్నా బిజీ
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తో తమన్నా బిజీ గా ఉన్నారు. ఒకవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్‌లతో కాల్షీట్స్ అడ్జెస్ట్ చేస్తూ తమన్నా ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు.

బాలీవుడ్ ఎంట్రీ ఊహించలేదు
మన టాలీవుడ్ హీరోలు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. పిలిచిమరీ మనవాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. ఈనేపథ్యంలోనే టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ బాలీవుడ్ లో ఆఫర్ రాగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ శర్మ దర్శకత్వంలో ‘రామ సేతు’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో ఓ కీలక పాత్రలో సత్యదేవ్ కు ఛాన్స్ దక్కింది.. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్‌దంతియా ఎంటర్‌టైన్‌మెంట్, లైకా ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. దీనిలో భాగంగానే బాలీవుడ్ ఎంట్రీ పై సత్యదేవ్…

ఫుల్ జోష్ లో సత్యదేవ్
టాలీవుడ్ లో పలు మూవీ కమిట్ మెంట్స్ తో సత్యదేవ్ ఫుల్ జోష్ లో ఉన్నారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో చిన్న పాత్రలలో నటించిన సత్యదేవ్ “బ్లఫ్ మాస్టర్” మూవీ తో హీరోగా మారారు. “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ” మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సత్యదేవ్ ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “తిమ్మరుసు “, “గాడ్సే “మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. భారత దేశం , శ్రీలంక లను కలిపే రామసేతు వారథి నేపథ్యంలో తెరకెక్కుతున్న “రామ్ సేతు”హిందీ మూవీలో సత్యదేవ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.
'గుర్తుందా శీతాకాలం' ఫస్ట్ లుక్ రిలీజ్
నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా, మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాకు రీమేక్ ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకొని.. మరో షెడ్యూల్ కోసం చూస్తున్నారు.
'గుర్తుందా శీతాకాలం' ఫన్ ఫస్ట్ షెడ్యూల్
తన విలక్షణమైన నటనతో తన కంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సత్యదేవ్ హీరోగా, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగశేఖర్ దర్శకత్వంలో కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాను తెలుగులో గుర్తుందా శీతాకాలం పేరుతో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.
'గుర్తుందా శీతాకాలం' - అతిథి పాత్రలో మేఘ
నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్లుగా కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాను తెలుగులో గుర్తుందా శీతాకాలం పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ముందు చెప్పినట్టే సింగల్ షెడ్యూల్ లోనే ఈ సినిమా షూట్ ను పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు. దీనిలోభాగంగానే నిర్విరామంగా షూటింగ్ జరుపుతున్నారు.