కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Gopichand New Movie Updates

ట్యాగ్ · 10 కథనాలు

Pakka Commercial Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pakka Commercial,Pakka Commercial Movie,Pakka Commercial Telugu Movie,Pakka Commercial latest Movie,Pakka
ట్రైలర్ & టీజర్

"పక్కా కమర్షియల్ " ట్రైలర్ రిలీజ్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్‌” మూవీ జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్ , అనసూయ , రావు రమేష్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Pakka commercial movie wraps up shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pakka commercial,Pakka commercial Movie,Pakka commercial Telugu Movie,Pakka commercial Movie Updates
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తిచేసుకున్న 'పక్కా కమర్షియల్'

టాలీవుడ్ యాక్ష‌న్‌ హీరో గోపీచంద్, మారుతి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం పక్కా కమర్షియల్. కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇక ఈసినిమా జులై1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా ఒకవైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పార్లల్ కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. అంతేకాదు ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసేశారు. అంతేకాదు ఇప్పటికే పాటలు, టీజర్ ను కూడా రిలీజ్ చేసేశారు కూడా. మరోవైపు ట్రైలర్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ కు డేట్ కూడా ఫిక్స్ చేశారు. జూన్12 ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్…

TFN Adminవాట్సాప్
Macho Star Gopichand To Work With Director Sriwass For Third Time,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Gopichand And Sriwaas Film Confirmed,Gopichand,Gopichand Movies,Gopichand New Movie,Gopichand Latest Movie,Gopichand Updates,Gopichand Latest
సినిమా వార్తలు

గోపిచంద్-శ్రీవాస్ మూడోసారి

గోపిచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇంకా దీనితో పాటు మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమాను సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు గోపీచంద్. మరోవైపు ఎన్నో ఏళ్ల నుండి పెండింగ్ లో ఉన్న ఆరడుగుల బుల్లెట్‌ సినిమా కూడా రిలీజ్ కానుంది. థియేటర్లు ఓపెన్ చేసిన తర్వాత ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

గోపీచంద్ "పక్కా కమర్షియల్" ?

పలు యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ "మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో హీరో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు. "సీటీ మార్ "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో గోపీచంద్ ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

గోపీచంద్-సంపత్ నంది సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి..!

సంపత్ నంది దర్శకత్వం లో యాక్షన్ హీరో గోపీచంద్, తమన్నా జంటగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు సంపత్ నంది ట్వీట్ తో ధృవీకరిస్తూ ‘నా కోచ్ అండ్ కబడ్డీ టీంతో సాగిన 15 రోజుల మొదటి షెడ్యూల్ షూటింగ్ ను అద్భుతమైన విజువల్స్ అండ్ అంశాలతో చిత్రీకరించాము. అవుట్ ఫుట్ విషయంలో చాల సంతోషకరంగా ఉన్నాము’ అని యూనిట్‌ తో దిగిన గ్రూప్ ఫోటోను పోస్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

గోపీచంద్ కు అభయమిచ్చిన తేజ

పాపం కెరీర్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన 'గోపీచంద్' కు ఇప్పుడు కాలం కలిసి రావట్లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా సక్సెస్ మాత్రం దక్కట్లేదు. గతకొద్ది కాలంగా ప్లాప్స్ తప్పించి సక్సెస్ అనేది చూడలేదు. ఇటీవల వచ్చిన 'చాణక్య' సినిమాపై అంచనాలు పెంచుకున్నా.. ఆ అంచనాలను అందుకోలేకపోయాడు 'చాణక్య'. దీనితో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలు కూడా వెనక్కి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు గోపీచంద్ తో సినిమా అంటే నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్నారు. ఇటీవ‌లే గోపీచంద్ చేతులోంచి ఓ సినిమా జారిపోయింది. సంప‌త్ నందితో ఓ సినిమా ప‌ట్టాలెక్కాల్సివుంది. అది సెట్స్‌పైకి వెళ్లేంత వ‌ర‌కూ సినిమా ఉంటుందో లేదో కూడా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'సీటీ మార్ ' అంటున్న గోపీచంద్?

'గౌతమ్ నంద' తరువాత యాక్షన్ హీరో గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్‌లో మ‌రో చిత్రం రాబోతున్న సంగ‌తి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించనుంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్న ఈ చిత్రం... త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సంపత్ నంది-గోపీచంద్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్

ప్రస్తుతం గోపీచంద్ చాణక్య సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్ తిరు సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో గోపీచంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘చాణక్య’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దసరా పండుగా నేపథ్యంలో అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. మెహ్రీన్ కౌర్, బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Gopichand To Pair Up With Tamannah,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Gopichand Upcoming Movie News,Gopichand Next Film Heroine Confirmed,Gopichand New Movie Updates,Gopichand Next Project Detail
సినిమా వార్తలు

గోపీచంద్‌కి జోడిగా తమన్నా?

దర్శకుడు సంపత్ నందికి కలిసొచ్చిన కథానాయిక తమన్నా. ఇది వరకు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ మంచి విజయం సాధించాయి. మళ్ళీ నాలుగేళ్ల గ్యాప్ తరువాత ఈ ఇద్దరి కలయికలో ముచ్చటగా మూడో సినిమా రానుంద‌ని సమాచారం.

Team TFNవాట్సాప్
Gopichand Chanakya Movie First Look Out Now,Telugu Filmnagar,Telugu Film Udates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Chanakya Movie First Look,Gopichand New Look From Chanakya Movie,#ChanakyaFirstlook,Gopichand First Look From Chanakya
ఫస్ట్ లుక్

రిలీజయిన చాణక్య మూవీ ఫస్ట్ లుక్

యాక్షన్ స్టార్ గోపిచంద్, మెహరీన్ జంటగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో స్పై థిల్లర్ మూవీ చాణక్య రూపొందుతున్న విషయం తెలిసిందే. 2001 సంవత్సరంలో తొలి వలపు మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయమైన గోపి చంద్, ప్రతి నాయకుడిగా కొన్ని చిత్రాలలో నటించి సూపర్ హిట్ మూవీ యజ్ఞం తో హీరోగా సెటిల్ అయ్యారు. గోపి చంద్ నటించిన ఆంధ్రుడు , రణం, లక్ష్యం, శౌర్యం, గోలీమార్, సాహసం, లౌక్యం, గౌతమ్ నంద, ఆక్సిజన్ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

Team TFNవాట్సాప్

షేర్