
ట్యాగ్ · 14 కథనాలు

ఎంత మంచివాడవురా మూవీ పబ్లిక్ ఒపీనియన్
'ఎంత మంచి వాడవురా' ట్రైలర్ రిలీజ్

"ఎంత మంచివాడవురా" మూవీ లో విలన్

'ఎంత మంచివాడవురా' సెన్సార్ పూర్తి
అన్నకు అతిథిగా తమ్ముడు..!

'ఎంత మంచి వాడవురా' రిలీజ్ డేట్ ఫిక్స్
రామోజీ ఫిల్మ్ సిటీలో కళ్యాణ్ రామ్ సందడి

సంక్రాంతి బరిలో ఎంత మంచివాడవురా ! మూవీ
పోరాట ఘట్టంలో `ఎంత మంచివాడవురా`
ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో కళ్యాణ్ రామ్ మూవీ
ఎంత మంచివాడవురా ! కళ్యాణ్ రామ్

'ఎంత మంచివాడవురా' ఫస్ట్ డే కలెక్షన్స్
కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో వచ్చిన కుటుంబ కథా చిత్రం ‘ఎంత మంచివాడవురా. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు కొన్ని చోట్ల 'ఎంత మంచివాడవురా' సినిమాకి ఫరవాలేదనిపించే ఓపెనింగ్స్ వచ్చినా.. కొన్నిచోట్ల మాత్రం డీలా పడింది. దానికితోడు 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' సినిమాలు కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ఇంత టఫ్ కాంపిటీషన్ లో ఈ సినిమా రావడం అంటే కొంచం రిస్క్ తో కూడిన విషయమే. మరి ఇంత పోటీని తట్టుకొని ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.
ఎంత మంచివాడవురా మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
'ఎంత మంచి వాడవురా' ట్రైలర్ రిలీజ్
సతీష్ వేగేశ్న దర్శకత్వంలో... నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఎంత మంచివాడవురా'. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై బాగానే అంచనాలు వున్నాయి.

"ఎంత మంచివాడవురా" మూవీ లో విలన్
శ్రీదేవి మూవీస్ సమర్పణ లో ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా గ్రామీణ నేపథ్యం లో రూపొందిన "ఎంత మంచివాడవురా " మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీ రిలీజ్ కానుంది. శరత్ బాబు, విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. మూవీ టైటిల్ క్యాచీ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

2020 సంక్రాంతి డైరెక్టర్స్.. ఓ కామన్ ఫ్యాక్టర్
2020 సంక్రాంతికి నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ (దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, ఎంత మంచివాడవురా) సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ నాలుగు సినిమాల దర్శకులకు కూడా ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే ఆ యా దర్శకులకు ఆ యా చిత్రాలు సెకండ్ పొంగల్ రిలీజెస్ కావడం విశేషం.

'ఎంత మంచివాడవురా' సెన్సార్ పూర్తి
‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్ వేగేశ్న దర్శకత్వంలో... నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఎంత మంచివాడవురా'. గతకొద్ది రోజులుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసింది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

"ఎంత మంచివాడవురా !" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి
శ్రీదేవి మూవీస్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ " ఎంత మంచివాడవురా !" మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీ రిలీజ్ కానుంది. మెహరీన్ కథానాయిక. శరత్ బాబు, విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.
అన్నకు అతిథిగా తమ్ముడు..!
‘118’ ఘనవిజయం తర్వాత సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా.. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది. ఈ నేపథ్యంలో జనవరి 5వ తేదీనగానీ .. 6వ తేదీనగాని ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట. అంతేకాదు ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కళ్యాణ్ రామ్ సినిమాల ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటాడు. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

'ఎంత మంచి వాడవురా' రిలీజ్ డేట్ ఫిక్స్
సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. ఇక ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చింది. కేరళలోని మున్నార్ తదితర సుందరమైన ప్రదేశాల్లో చివరి షెడ్యూల్ జరుపుకుంటుంది. అక్కడ రెండు పాటలు, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో కళ్యాణ్ రామ్ సందడి
నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా ‘ఎంత మంచివాడవురా’ పేరుతో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘శతమానంభవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంక్రాంతి బరిలో ఎంత మంచివాడవురా ! మూవీ
శ్రీ దేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణ లో ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న ఎంత మంచివాడవురా ! మూవీ సంక్రాంతి పండుగకు రిలీజ్ కానుంది. మెహరీన్ కథానాయిక కాగా గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
పోరాట ఘట్టంలో `ఎంత మంచివాడవురా`
ఈ సంవత్సరం ఆరంభంలో `118`తో థ్రిల్ చేసిన నందమూరి కళ్యాణ్ రామ్... ప్రస్తుతం `ఎంత మంచివాడవురా`తో బిజీగా ఉన్నాడు. `శతమానం భవతి` ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్‌కి జోడీగా మెహరీన్ నటిస్తుండగా... గోపీసుందర్ బాణీలు అందిస్తున్నాడు. శివలెంక కృష్ణప్రసాద్, ఉమేష్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన తాజా షెడ్యూల్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇటీవల కళ్యాణ్ రామ్, నటాషా దోషిపై ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించిన యూనిట్... ప్రస్తుతం కళ్యాణ్ రామ్ బృందంపై పోరాట ఘట్టాన్ని తెరకెక్కించే పనిలో…
ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో కళ్యాణ్ రామ్ మూవీ
ఇటీవల ‘118’తో మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్... ప్రస్తుతం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కళ్యాణ్ సరసన పంజాబీ భామ మెహరీన్ కథానాయికగా నటిస్తుండగా... గోపిసుందర్ బాణీలు సమకూరుస్తున్నాడు.
ఎంత మంచివాడవురా ! కళ్యాణ్ రామ్
ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉమేష్ గుప్తా నిర్మాణసారథ్యం లో, శివలెంక కృష్ణ సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కుటుంబ విలువల నేపథ్యం లో కళ్యాణ్ రామ్ 17 మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. అందాల తార మెహరీన్ కథానాయిక. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.