‘ఎంత మంచి వాడవురా’ ట్రైలర్ రిలీజ్

Entha Manchivadavuraa Trailer Out Now

సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో… నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎంత మంచివాడవురా’. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై బాగానే అంచనాలు వున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇకపోతే ఎంత మంచివాడవురా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న ఈ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం.

కాగా ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుండగా..ఇంకా తనికెళ్ళ భరణి, విజయ్ కుమార్, నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + one =