‘ఎంత మంచివాడవురా’ సెన్సార్ పూర్తి

Entha Manchivaadavuraa Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Entha Manchivaadavuraa Movie Updates,Entha Manchivaadavuraa Telugu Movie Latest News,Entha Manchivaadavuraa Censor Report,Entha Manchivaadavuraa Movie Completed Censor Formalities,Entha Manchivaadavuraa Telugu Movie Completed Censor Verdict

‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో… నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎంత మంచివాడవురా’. గతకొద్ది రోజులుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసింది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై బాగానే అంచనాలు వున్నాయి. ఇకపోతే ఎంత మంచివాడవురా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో జరపనున్నారు. ఈ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా వస్తున్నారు.

కాగా ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుండగా..ఇంకా తనికెళ్ళ భరణి, విజయ్ కుమార్, నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.