
ట్యాగ్ · 11 కథనాలు


సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు

సార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

విజయ్ కు విలన్ గా ధనుష్..?

రెండు దశాబ్దాల ప్రస్థానం..!

'వెంకీ అట్లూరి' కి ధనుష్ బర్త్ డే విషెస్..!

ధనుష్ తో థ్రిల్లర్ చేస్తున్నా

టాలీవుడ్ లో బిజీగా ధనుష్

'#D43' జులై నుండి ఫైనల్ షెడ్యూల్

కాంటెంపరరీ నటుల్లో ధనుష్ టాప్
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా మరో రోజులో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి.

సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ కూడా ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్రయూనిట్. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తన డబ్బింగ్ సినిమాలకే ధనుష్ ఇక్కడికి వచ్చి ప్రమోషన్స్ లో పాల్గొంటాడు. అలాంటిది ఇప్పుడు ఏకంగా తెలుగులో సినిమా చేస్తున్నాడు కాబట్టి ధనుష్ కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను…

సార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ్ టాలెండెట్ స్టార్ హీరో ధనుష్ గురించి, తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక తెలుగులో తనకు ఎంత క్రేజ్ ఉందో కూడా తెలిసిందే. ఇప్పటివరకూ తన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఓటీటీ లోకి వచ్చేసిన ధనుష్ తిరు
తమిళ్ స్టార్ హీరో ధనుష్ విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక అదే రకంగా విజయాలను కూడా అందుకుంటున్నాడు. రీసెంట్ గా ధనుష్ హీరోగా వచ్చిన సినిమా తిరుచిత్రంబలం. తెలుగులో ఈసినిమా తిరు అనే టైటిల్ తో రిలీజ్ అయింది. ఆగష్ట్ 18వ తేదీన రిలీజ్ అయింది ఈసినిమా. మంచి ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈసినిమాకు మంచి ఆదరణ లభించింది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ అందించింది. ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి కూడా చేరింది.

ధనుష్ "నానే వరువేన్ "మూవీ న్యూ పోస్టర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో ధనుష్ తన సోదరుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో "కాదల్ కొండెన్ ", "పుదు పేట్టై" , "మయక్కం ఎన్న " మూవీస్ లో నటించిన విషయం తెలిసిందే. దాదాపు 10 సంవత్సరాల తరువాత సెల్వ రాఘవన్ , ధనుష్ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కింది. వి క్రియేషన్స్ బ్యానర్ పై సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన "నానే వరువేన్ "తమిళ మూవీ సెప్టెంబర్ నెలలో రిలీజ్ కానుంది. ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో ఇందుజ రవిచంద్రన్ , ఎల్లి అవరం కథానాయికలు. సెల్వ రాఘవన్ , ప్రభు , యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

విజయ్ కు విలన్ గా ధనుష్..?
ఇండస్ట్రీలో ఇప్పుడు ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. ఎవరు ఎవరితో అయినా సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నారు. స్టార్ హీరోలు సైతం ఈ పద్దతికి అలవాటు పడుతున్నారు. ఒకప్పుడు కూడా ఇలా ఉండేది కానీ ఆ తరువాత స్టార్ హీరోలు మ్యాగ్జిమమ్ వారి సినిమాలు వారే చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సినిమా రేంజ్ పెరిగిపోయింది. కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇక హీరోలు కూడా ఏ లాంగ్వేజ్ అయినా సరే చేసేస్తున్నారు. స్టార్ హీరోలు కూడా ఒకే సినిమాలో కనిపించడానికి ఎలాంటి షరతులు పెట్టుకోవడంలేదు.

రెండు దశాబ్దాల ప్రస్థానం..!
తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో ఒదిగిపోయి చేస్తాడని తన సినిమాలను చూస్తేనే తెలుస్తుంది. 2002 లో ‘తుల్లు వాదో ఇమ్మాయ్` అనే సినిమాతో కోలీవుడ్ లో నటుడిగా పరిచయం అయ్యాడు ధనుష్. ఇక ఆతరువాత ఇప్పటి వరకూ ఎన్నో పాత్రల్లో నటించాడు. ఇక ధనుష్ తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్నాడు. ఈ ఇరవై ఏళ్లలో ధనుష్ ఎన్నో సినిమాల్లో నటించాడు. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా తెలుగు సినిమానే చేసేస్తున్నాడు.

'వెంకీ అట్లూరి' కి ధనుష్ బర్త్ డే విషెస్..!
తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడమే కాదు.. ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మన తెలుగు దర్శకుల టాలెంట్ కు ఫిదా అవుతున్న కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగులో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ముందు శేఖర్ కమ్ములతో సినిమాను ప్రకటించిన ధనుష్ ఆ తరువాత వెంటనే యూత్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నట్టు ధనుష్ ప్రకటించాడు. ఇక వాటిలో ప్రస్తుతం వెంకీ అట్లూరి సినిమా ముందు సెట్స్ పైకి వెళ్లి ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. సార్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

ధనుష్ తో థ్రిల్లర్ చేస్తున్నా
కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా లవ్ స్టోరీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న శేఖర్ కమ్ముల ధనుష్ సినిమా గురించి కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఇప్పటి వరకూ కూల్ సినిమాలతో అలరించిన శేఖర్ కమ్ముల ధనుష్ తో చేయబోయేది థ్రిల్లర్ మూవీ అని క్లారిటీ ఇచ్చాడు. ఇంకా మల్టీ లింగ్వువల్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నానని, వచ్చే ఏడాది…

టాలీవుడ్ లో బిజీగా ధనుష్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ధనుష్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. పలు సూపర్ హిట్ డబ్బింగ్ మూవీస్ ద్వారా ధనుష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. హీరో ధనుష్ ప్రస్థుహం ఒక , హిందీ , ఒక ఇంగ్లీష్ , రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. "ఆడుకాలం" , "అసురన్" మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. ధనుష్ నటుడే కాకుండా నిర్మాత , దర్శకుడు , స్క్రీన్ రైటర్ , సింగర్ , లిరిసిస్ట్ కూడా. టాలెంటెడ్ హీరో ధనుష్ ఇప్పుడు కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

'#D43' జులై నుండి ఫైనల్ షెడ్యూల్
కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అనేతేడా లేకుండా అన్ని భాషల్లోనూ సినిమా చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు ధనుష్. ఇప్పటికే ధనుష్ నటించిన కర్ణన్, జగమే తంత్రం సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయి సందడి చేశాయి. ఇప్పుడు కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ మొదలై చివరి దశకు కూడా చేరుకుంది. లాక్ డౌన్ లేకపోతే షూటింగ్ పూర్తి చేసుకొని ఉండేది. ఇక ఇప్పుడు అందరూ షూటింగ్ లు మొదలుపెడుతుండటంతో ధనుష్ కూడా రంగంలోకి దిగనున్నాను. ఈసినిమాఫైనల్ షెడ్యూల్ ను జులై నుండి ప్రారంభించనున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలిపారు.