
ట్యాగ్ · 18 కథనాలు


చెక్ మూవీ పబ్లిక్ టాక్
'చెక్' ఇంట్రెస్టింగ్ పాయింట్స్
అందుకే 'చెక్' సినిమా వెంటనే ఓకే చేశా
ఈవారం సందడి చేయనున్న సినిమాలు
ప్రముఖ నిర్మాణ సంస్థకు 'చెక్' నైజాం హక్కులు
నితిన్ చెక్ పై 'చెస్ కామ్ ఇండియా' రియాక్షన్

నితిన్ 'చెక్' మూవీ ట్రైలర్ పబ్లిక్ రెస్పాన్స్
నితిన్ 'చెక్' ట్రైలర్ రిలీజ్
'చెక్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
నితిన్ చెక్ రిలీజ్ డేట్ ఫిక్స్
'చెక్' - ఫస్ట్ గ్లింప్స్ కు ముహూర్తం ఫిక్స్
నితిన్ 'చెక్' మొదలైంది
'చెక్' రకుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

2021 సంవత్సరం లో నితిన్ రికార్డ్
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలోసోషల్ మెసేజ్ తోతెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతిశెట్టి కథానాయిక. పూజాకార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

ఓటీటీలో నితిన్ "చెక్ " మూవీ
భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై విభిన్న కథా చిత్ర దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన "చెక్ "మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. హీరో నితిన్ తన పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
'చెక్' రివ్యూ - మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్
ఫస్టాఫ్ అంతా ఎలాంటి ట్విస్ట్‌లను రివీల్ చేయకుండా నార్మల్‌గా నడిపించాడు. అసలు హీరో ఈ కేసులో ఎలా ఇరుక్కున్నాడో చెప్పకుండా ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. మంచి ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగిస్తాడు. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. సెకండాఫ్‌లో కోర్టు, చెస్ ఆట, జైలులో గొడవలు ఇలా ట్విస్ట్ లతో సాగుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని చెప్పొచ్చు.

చెక్ మూవీ పబ్లిక్ టాక్
@BhavyaCreations ThaNk You SoMuCh FoR GiViNg SuCh A WoNdeRFuL MoVie To My Bro @actor_nithiin !!😍 @Rakulpreet @yeletics #saichand GaRu #PriyaPrakashVarrier…
'చెక్' ఇంట్రెస్టింగ్ పాయింట్స్
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్, రకుల్ ప్రీత్, ప్రియా వారియర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం చెక్. ఈసారి నితిన్ పూర్తి ఎక్స్ పెరిమెంటల్ మూవీతో రాబోతున్నాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లలో ఆ విషయం అర్ధమైంది. ఈసినిమా కూడా నితిన్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని అర్థమవుతుంది. ఇక సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం రేపటివరకూ వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ సినిమా ఎందుకు చూడాలో.. ఈ సినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఎంటో ఒకసారి చూద్దాం.
ఆ అవకాశం వస్తే నా ఫస్ట్ ఛాయిస్ పవన్‌కల్యాణ్‌గారే
చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్, రకుల్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా చెక్. ఇక ఈ సినిమా రేపు (ఫిబ్రవరి 26)న రీలీజ్ కానుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో అంచనాలను పెంచగా ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అవుతుందో.. లేదో తెలియాలంటే రేపటి వరకూ వెయిట్ చేయాల్సిందే. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్య్వూలో పాల్గొన్న నితిన్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు. అవేంటో మీరు కూడా ఒక లుక్కేయండి.
అందుకే 'చెక్' సినిమా వెంటనే ఓకే చేశా
'ఒరు అదార్ లవ్'లో 'మాణిక్య మలరాయ పూవీ' పాటలో కన్ను గీటి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. మొదటి సినిమా అంత విజయం కాకపోయినా ప్రియా మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇక తెలుగులో చెక్ లాంటి మరో విభిన్నమైన సినిమాతో వచ్చేస్తుంది. ఇది ప్రియా ప్రకాష్ కు డైరెక్ట్ తెలుగు ఫిలిం. మరి ఫిబ్రవరి 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రియా ఈ సినిమాలో ఎలా అవకాశం వచ్చింది.. ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది. మరి అవేంటో ఒకసారి చూద్దాం..
ఈవారం సందడి చేయనున్న సినిమాలు
ఈ ఫిబ్రవరి నెల సినిమాల సందడితోనే ముగిసిపోనుంది. నిజానికి ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ లు పెద్దగా పెట్టుకొనేవారు కాదు దర్శకనిర్మాతలు. వస్తే వాలెంటైన్స్ డే కి ఒకటో రెండో సినిమాలు వచ్చేవి. సంక్రాంతి సీజన్ అయిపోయిన తర్వాత సమ్మర్లో సినిమాల సందడి మొదలవుతుంది. కానీ గత ఏడాది కరోనా వల్ల థియేటర్స్ లేకపోవడంతో ఎన్నో సినిమాలు పెండింగ్ లో పడిపోయాయి. ఇక థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో వీలైనంత త్వరగా రిలీజ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయి రిలీజ్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి మాత్రం వరుస రిలీజ్ లతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడిగా మారింది.
ప్రముఖ నిర్మాణ సంస్థకు 'చెక్' నైజాం హక్కులు
చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా చెక్. చాలా డిఫరెంట్ కథతో వస్తున్నాడు నితిన్. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమాతో మరో హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడన్న అభిప్రాయానికి వస్తున్నారు అందరూ . ఇక ఈ ఎఫెక్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ పై కూడా పడింది. టీజర్ కు ట్రైలర్ కు మంచి టాక్ వచ్చి సినిమాపై అంచనాలు పెరిగితే ఆ సినిమా హక్కులు కూడా అదే రేంజ్ లో అమ్ముడుపోతాయన్న విషయం తెలిసిందే కదా. ఇప్పుడు చెక్ విషయంలో కూడా అదే జరిగింది.
నితిన్ చెక్ పై 'చెస్ కామ్ ఇండియా' రియాక్షన్
రొటీన్ సినిమా ఫార్ములాకు చెక్ పెట్టి మొదటిసారి కాస్త విభిన్నమైన కథతో వస్తున్నాడు నితిన్. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా చెక్. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తూనే ఉన్నాం. చాలా డిఫరెంట్ థీమ్ తో వస్తుంది. చదరంగాన్ని, జీవితాన్ని ముడిపెడుతూ తీసిన సినిమా.. మరణ శిక్ష పడిన ఖైదీ తన చదరంగం నైపుణ్యంతో బయటకు రావడానికి ఎలా ప్రయత్నిస్తాడు అన్నది కథ. ట్రైలర్ లో అయితే కొంతే చూశాం.. మరి నితిన్ ఎత్తులు పైఎత్తులు చూడాలంటే సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

నితిన్ 'చెక్' మూవీ ట్రైలర్ పబ్లిక్ రెస్పాన్స్
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో నితిన్ కూడా ఒకడని అతను చేసిన సినిమాలను చూస్తే చెప్పొచ్చు. ఇక గత ఏడాది భీష్మ తో హిట్ కొట్టిన నితిన్ చెక్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకునేటట్లే కనిపిస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో చెక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ ను చూస్తే నితిన్ ఈ సినిమాతో కూడా హిట్ కొట్టడం పక్కా అన్న టాక్స్ అప్పుడే వినిపిస్తున్నాయి.
నితిన్ 'చెక్' ట్రైలర్ రిలీజ్
భీష్మ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు. అందులో నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న చెక్ సినిమా ఒకటి. జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. విభిన్నమైన కథతో వస్తుండటంతో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.. దానికి తోడు ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు ఇంకా పెరిగాయి.
'చెక్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
గత ఏడాది భీష్మ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీ గా వున్నాడు. ఇక ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఒకటి రంగ్ దే కాగా.. మరొకటి చెక్. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'చెక్'. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 19న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్…
నితిన్ చెక్ రిలీజ్ డేట్ ఫిక్స్
గత ఏడాది భీష్మ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీ గా వున్నాడు. అందులో నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న చెక్ సినిమా ఒకటి. లాక్‌డౌన్‌కు ముందే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అంతేకాదు ఈసినిమా నుండి న్యూ ఇయర్ సందర్భంగా చిన్నపాటి వీడియోను ఒకటి రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇక చంద్రశేఖర్ అనగానే ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది.
'చెక్' - ఫస్ట్ గ్లింప్స్ కు ముహూర్తం ఫిక్స్
ఈ ఏడాది హీరో నితిన్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో ‘రంగ్ దే’ సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమా తెరకెక్కుతుంది. లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు.
నితిన్ 'చెక్' మొదలైంది
సినిమా రిలీజ్ లు విషయం పక్కనపెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు నితిన్. ప్రస్తుతం నితిన్ రంగ్ దే సినిమా షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముంగింపు దశకు రాగానే మరో సినిమాను లైన్ లో పెట్టేసాడు. నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా... ఇటీవల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా `చెక్` యూనిట్ ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
'చెక్' రకుల్ ఫస్ట్ లుక్ రిలీజ్
నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. చెక్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రీ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నితిన్ ఉరిశిక్ష పడిన ఖైదీగా నటిస్తారని టాక్. త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేయనున్నట్టు తెలుస్తుంది.
నితిన్ కొత్తసినిమా టైటిల్, ప్రీ లుక్ రిలీజ్
నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఈ సినిమాపై ఎలాంటి అప్ డేట్ ఇవ్వని చిత్ర యూనిట్ ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ను అలాగే ఒకే సారి ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా టైటిల్ ను ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు చెక్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రీ లుక్ లో నితిన్ చేతికి సంకెళ్లతో ఉండగా..అతడి ముందు చెస్ కాయిన్స్ కనిపిస్తున్నాయి. పోస్టర్ చూస్తుంటే డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి థ్రిల్లర్ స్టోరీతో సినిమాను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.