‘చెక్’ రకుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

Rakul Preet First Look From Check Movie Is Out Today

నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. చెక్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రీ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నితిన్ ఉరిశిక్ష పడిన ఖైదీగా న‌టిస్తార‌ని టాక్. త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేయనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ రోజు ర‌కుల్ ప్రీత్ సింగ్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆమెకు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అయితే ర‌కుల్ నితిన్ సరసన చెక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆమె ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసింది. ఇక ఈ ఫస్ట్ లుక్ లో చేతిలో ఓ ఫైల్ పట్టుకొని సీరియస్ గా ఉన్న రకుల్ లుక్ ఆకట్టుకుంటుంది. కాగా భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

 

రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా వెంటనే మొదలైపోయింది. ఇంకా హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 19 =