
ట్యాగ్ · 10 కథనాలు


రవి ఏం చేసినా తప్పేనా..?

కూతురికి యాంకర్ రవి స్పెషల్ బర్త్ డే విషెస్

రవి టార్గెట్ అవుతున్నాడా..!

స్టార్ రైటర్ ను కలిసిన బిగ్ బాస్ కంటెస్టెంట్..!
బిగ్ బాస్ 5 సీజన్ ఇటీవలే సక్సెస్ ఫుల్ గా పూర్తయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సీజన్ లో వచ్చిన కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ కూడా గుర్తుండే ఉంటుంది కదా. ఈ సీజన్లో ప్రియాంక సింగ్ మాత్రం తన ప్రత్యేకతను చూపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తన కెరీర్ ను స్టార్ట్ చేసి.. ఆ తర్వాత్ ట్రాన్స్ జెండర్ గా మారింది ప్రియాంక సింగ్. ఇక ఆతరువాత చాలా కాలం బుల్లి తెరకు దూరమైన ప్రియాంక సింగ్.. బిగ్ బాస్ 5 లో ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక కొన్ని టీవీ షోలలో కనిపిస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచిన 'సన్నీ'
బిగ్ బాస్ 5.. మొత్తానికి సీజన్ 5 కూడా సక్సెస్ ఫుల్ గా ముగిసిపోయింది. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిని బిగ్ బాస్ సీజన్ 5 ఈసారి కూడా ఎంతగానో అలరించింది అని చెప్పొచ్చు. 5 మచ్ ఎంటర్ టైన్ మెంట్ అంటూ ఈ సీజన్ స్టార్ట్ అవ్వడం.. దానికి తగ్గట్టే పవర్ ఫుల్ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వడంతో అంతే ఆసక్తికరంగా సాగింది. ఇక ఈసీజన్ విన్నర్ గా సన్నీ నిలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు.

రవి ఏం చేసినా తప్పేనా..?
బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు చూద్దామా అని బుల్లి తెర ప్రేక్షకులు ఈ షో కోసం ఎంతగా ఎదురుచూశారో. ఇక షో స్టార్ట్ అవ్వడం జరిగిపోయింది.. చూస్తుండగానే చివరి దశకు కూడా వచ్చేసింది. ఇంకా ఉంటే మూడు నాలుగు వారాలు ఉంటుందేమో. మొత్తం 19మంది కంటెస్టెంట్స్ తో కళకళలాడిపోయిన హౌస్ ఇప్పుడు కేవలం 8 మందితో బోసిపోయింది. వీరిలో చివరికి టాప్ 5 కంటెస్టెంట్స్ మిగులుతారు.. మిగిలిన ముగ్గురు ఎలిమినేట్ అవుతారు.

బిగ్ బాస్ 5.. ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు..?
ఇప్పటి వరకూ బిగ్ బాస్ సీజన్ 5లో 9 వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యాయి. ప్రస్తుతం 10వ వారం జరుగుతుంది. నిజానికి బిగ్ బాస్ చూసేవాళ్లకి వీకెండ్ డేస్ కంటే కూడా నామినేషన్స్ డే నే ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు. దానికి కారణం హౌస్ మేట్స్ ఫుల్ ఫైర్ మీద ఉండి గొడవలు జరుగుతుంటాయి కాబట్టి. కెప్టెన్ గా ఉన్న ఆనీ మాస్టర్‌కి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చి నలుగురిని నామినేషన్ చేసి జైలులో పెట్టమని చెప్పగా ఆనీ ముందు కాజల్, సన్నీ, మానస్, షణ్ముఖ్ ను సెలక్ట్ చేస్తుంది. ఇక ఆతరువాత మరో ఇమ్యూనిటీ టాస్క్ ఇవ్వగా అది పూర్తయ్యే లోపు మానస్, సిరి, సన్నీ, రవి, కాజల్‌లు జైలులో ఉండటంతో ఈవారం ఈ ఐదుగురు నామినేష్స్ లోకి వచ్చారు. మరి…

బిగ్ బాస్ 5.. బ్యాక్ టు బ్యాక్ నామినేషన్స్ లోకి రవి
బిగ్ బాస్ 5 సీజన్ ఇప్పటికే రెండు నెలలు పూర్తి చేసుకుంది. ఇక ఈసీజన్ లో ఈసారి చాలా మంది మన తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వాళ్లనే తీసుకొచ్చారు. ఇంటిలోకి ఎంట్రీ దొరకడం ఎంత కష్టమో అలాగే హౌస్ లో ఉండటం కూడా అంతే కష్టం. ఒక రకంగా బిగ్ బాస్ ఆడించినట్టు ఆడాలి. ముఖ్యంగా నామినేషన్స్ లోకి రాకుండా చూసుకోవాలి. ఇక ఇప్పటివరకూ 9 వారాలు అయిపోగా ఈవారం నామినేషన్ ప్రక్రియ కూడా నిన్నటితో పూర్తయింది. ఈ వారం మానస్, రవి, కాజల్, సిరి, సన్నీ ఐదుగురు నామినేట్ అయ్యారు.

కూతురికి యాంకర్ రవి స్పెషల్ బర్త్ డే విషెస్
ప్రస్తుతం యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సందర్భంగా రవి తన ముద్దుల కూతురు వియా కి స్పెషల్ వీడియో ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించాడు. అదేంటి రవి హౌస్ లో ఉండగా వీడియో ఎలా పంపించడబ్బా అనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. బిగ్ బాస్ హౌస్ కు వెళ్లేముందు కంటెస్టెంట్స్ ను క్వారంటైన్ లో ఉంచుతారన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ నేపథ్యంలోనే క్వారంటైన్ పీరియడ్ లో ఉన్నప్పుడే రవి తన కూతురు వియా కోసం బర్త్ డే విషెస్ అందిస్తూ స్పెషల్ గా వీడియో తీసుకున్నాడు. ఇక ఇప్పుడు వియా పుట్టిన రోజు సందర్భంగా రవి స్పెషల్ వీడియో ను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. మరి రవికి…

రవి టార్గెట్ అవుతున్నాడా..!
ఎప్పటినుండో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయిపోయింది. ఇక ఇంట్లో ఉండి స్మాల్ స్క్రీన్ పై ఈషో చూడటానికి బాగానే ఉంటుంది కానీ.. ఆ హౌస్ లో ఉండే వాళ్లకి తెలుస్తుంది ఎంత ప్రెజర్ ఉంటుందో. తమ వ్యక్తిత్వాన్ని చూపిస్తూ.. నేచురల్ గా ఉంటూ.. కాస్త ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోగలిగితేనే ఈ హౌస్ లో ఉండగలగుతారు. అయితే ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా ఉంటారు కాబట్టి కొంతమంది హౌస్ నుండి ముందు వెళిపోతారు.. కొంతమంది ఫైనల్ వరకూ ఉంటారు. చివరికి టైటిల్ గెలిచేది ఒక్కరే. అలా ఈసారి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో ఫైనల్ వరకూ వెళ్లే అవకాశం ఎక్కువగా ఉన్న కంటెస్టెంట్ రవికి ఉందని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం హౌస్ లో ఉన్న…

'బిగ్ బాస్ 5' ఫస్ట్ వీక్ నామినేషన్స్..రవి కి ఈజీనే
బిగ్ బాస్ 5.. ఈసీజన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసారి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వస్తున్నాడు. ఇక ఈసీజన్ మాములుగా ఉండదని ఇప్పటికే అర్థమయిపోయింది. ఒకరిద్దరు తప్ప అందరూ మంచి పాపులారిటీ ఉన్న వాళ్లే.. అందులోనూ చాలా మంది తెలిసిన కంటెస్టేంట్సే ఉన్నారు. టన్నుల కొద్దీ కిక్కు అందించేందుకు మొత్తం 19 మంది కంటెస్టెంట్లు రెడీగా ఉన్నారు. అంతేనా దాదాపు 5 నెలల పాటు ఈ సీజన్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో యాంకర్ రవి కూడా ఉన్న సంగతి తెలిసిందే.

'బిగ్ బాస్ 5' అఫీషియల్ డేట్ వచ్చేసింది
బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రోగ్రామ్స్ లో బిగ్ బాస్ 5 ఒకటి. ఈసారి కూడా కింగ్ నాగార్జుననే యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈషోకి సంబంధించి పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఈ షోలో పార్టిసిఫేట్ చేస్తున్న వారికి సంబంధించిన పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఈషోకి సంబంధించి ఇప్పటికే రెండు ప్రోమోస్ రిలీజ్ అవ్వగా ఇప్పుడు తాజాగా సీజన్ 5ని ప్రారంభించే ముహూర్తం అఫీషియల్ గా స్టార్ మా ప్రకటించింది.

బిగ్ బాస్ 5 ఫైనల్ లిస్ట్ ఇదేనా..!
బిగ్ బాస్ లవర్స్ సీజన్ 5 కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇక బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఈసారి అదే రేంజ్ లో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ అయింది . అంతేకాదు ఈసారి బిగ్ బాస్ 5 సీజన్లో కంటెస్టెంట్ లు వీరేనంటూ పులువురి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, సురేఖా వాణి, వర్షిణి, ఈషాచావ్లా ఇలా ఈసారి చాలా మంది తెలిసిన వాళ్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.